నా చెలి పారాణి పాదాలు

నా చెలి పారాణి పాదాలు - ఇల్లిందల పద్మా శ్రీనివాస్ నా చెలి పారాణి పాదాలు ఆ నేల తాకే వేళ ఆనందాల ఆకాశం నీలి రంగుల కాంతులై నా చెలి మోము తాకుతూ తన నీలి కురులలో తారాజాబిలి తారాట్లాడుతూ నా చెలి నన్ను చేరి ఓ కౌగిలి ఇస్తే ఆ రోజు మరువలేని ఓ తీపి గుర్తు నా  కళ్ళలో నీ రూపం కదలాడుతూ ఉంటే రెప్పయినా వేయను నేను ఎందుకంటే ఎక్కడ నీ రూపం కరిగిపోతుందో అని భయం ఎడారిలో ఒయాసిస్సులా ఉండేనాలో వలపుల వానలు చిలికి చిరునవ్వుల పూలు పూయించే నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోను నీలో సగమయితే తప్ప నింగినేల ఉన్నంత కాలం మన ప్రేమ ఉంటుంది ఎందుకంటే వాటిలాగే ఇప్పటికి మనం కూడా కలవలేం కానీ నీకు తెలుసా? నీలా నింగి వాన కురిపిస్తేనే నాలా నేల పులకరిస్తుంది. ఈ జన్మకు ఈ బంధం చాలు

జగన్మాత

జగన్మాత డా.రాధశ్రీ   కైలాస శిఖరాన కొలువున్న తల్లీ శంకరుని  హృదయాన నెలవున్న దేవి కరుణించి కాపాడుమో జగజ్జననీ రక్షించి మము బ్రోవుమో జగన్మాతా ! నీ దివ్య శుభ చరణ మంజీర నాదాలు భక్త హృదయాలలో కలిగించు మోదాలు సుందరము సుమధురము నీ  దయాదృష్టి కురిపించు ప్రతి ఇంట సంపదల వృష్టి నగపతి పుత్రివై, పశుపతికి పత్నివై గణపతికి జననివై, అల జగజ్జననివై మహిశాసురని గూల్చి, మహికి మోదము గూర్చి శాంతి నొసగిన తల్లి శివకంకరీ! రోషాలు ద్వేషాలు రగిలేటి యుగమందు నేరాలు ఘోరాలు చలరేగు జగమందు ఘోర నరకాసుల,క్రూర మహిషాసురుల దృష్ట దుశ్మాసనుల దునుమాడవమ్మ నీ పాదపద్మాల నెరనమ్మి యున్నటి హృదయ వేదిక మీద నిను నిలుపుకున్నట్టి నిజ భక్త వర్యులను రక్షించవమ్మ ఆయురారోగ్యాలు అందించి రమ్మా!!