లేత చిగురుల తీరు

లేత చిగురుల తీరు

- వి. బ్రహ్మానంద చారి

లేత చిగురుల తీరు
నాతి తనువూ ఎదిగి
పూత పూసిన తీరు
బాల కన్యగ మారె

కొంగ్రొత్త అందాల
పొంగులూ ఎదగంగ
ఎద బరువుతో నడుము
నాట్యమె ఆడంగ

నవ వధువు తడబాటు
నగుమోము తిలకించి
నవనీతమాయె మది
నా.... జాబిలమ్మ