posted on Nov 25, 2013
కన్నీటి పరిమళంతో
-డా.వై.రామకృష్ణారావు.
కన్నీటి పరిమళంతో
పోల్చుకున్నా
అవును
ఈ రుమాలు ఆమెదే.
భావోదయమైందా ?
కవిత్వం కొమ్మపైకి
అక్షరాలు
పక్షుల్లా ఎగిరొస్తాయి.
కుండలో
కంకర రాళ్లేసిందికాకి
నీళ్ళ కోసం.
కుండ చిల్లి పడింది.