నాకోసం
posted on Dec 11, 2013
నా కోసం
- డా.సి. భవానీదేవి
నాకో మాటివ్వు
అక్షరలక్షలతో
అమృతాన్ని కురిపిస్తాను
నాకో ఓదార్పునివ్వు
గుండెని గుడిగా చేస్తాను
అనంతంగా ఆరాధిస్తాను
నాకో స్నేహన్నివ్వు
గాయాల దారంతా
మందహసాన్ని పరుస్తాను
నాకో చిటికెడు ప్రేమనివ్వు
నీకోసం నిట్టుర్పునౌతాను
ప్రపంచాన్నెదిరిస్తాను
ప్రాణాలైన ఇచ్చేస్తాను
నాక్కొంచం విషమివ్వు
నీకోసం నిష్క్రమిస్తాను
సమాధిలేని జ్ఞాపకన్నౌతాను