పాపం! అమ్మ
posted on Dec 3, 2013
పాపం! అమ్మ
- డా. సి. భవానీదేవి
ఇంతకి నువ్వు ఎవరివి ?
కంటేనే అమ్మంటారు
ప్రేమను పంచినా అమ్మే !
అద్దె అమ్మగా
నన్నుకనిపెట్టిన యంత్రానివి
పుట్టకముందే నీకు సంపాదించిపెట్టాను కదా!
తల్లి రుణం తీరిందనుకొనా ?
ఎక్కడో పెరిగి అక్కడక్కడా తిరుగుతూ
ఏ సిగ్నల్ దగ్గర్లో
నిస్సహాయంగా చాపిన నీ అరచేతిలోకి
కారు అద్దం దించి కాసొకదాన్ని
విసిరేస్తానేమో అని భయం గా ఉందమ్మా
వెలిసిపోయిన నీ ఇంటి గోడపై
ఫోటోగా మిగిలిన నా బోసి నవుల్ని చూసి
నీ కళ్ళ తడి మసకేసినప్పుడైనా
నీది కాకుండా పోయిన నీ బిడ్డకోసం
కన్న పేగు కదలకుండా ఉంటుందా ?