posted on Nov 21, 2013
ఇదేమిటి
- డా.వై. రామకృష్ణారావు
ఇదేమిటి
ముల్లులా మాట్లాడుతాడు
గత జన్మలో
తుమ్మ చెట్టేమో !
మోయలేని బరువుతో
కుంగిపోతున్నాడు
గుండె నిండా
ద్వేషమేగా మరి.
అప్పుడు ముఖం చేటంత
ఇప్పుడేమో చాటుకు
ప్రేమకు
దిష్టి తగిలిందా ?