RELATED EVENTS
EVENTS
గుంటూరులో నాట్స్ ఆరోగ్య ర్యాలీ


గుంటూరులో నాట్స్ ఆరోగ్య ర్యాలీ

 

 

 

అమెరికాలో తెలుగువారికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తెలుగునాట కూడా అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలోనే గుంటూరులో స్వచ్ఛ ఆరోగ్య ర్యాలీ నిర్వహించింది. స్థానిక కిట్స్ ఇంజనీరింగ్ కళశాలతో కలిసి ఈ ర్యాలీ ఏర్పాటుచేసింది. గుంటూరు బృందవన్ గార్డెన్స్ లో నాట్స్ ప్రతినిధులు, కిట్స్ ఇంజనీరింగ్ కళశాల విద్యార్ధులు ఆరోగ్యంపై అవగాహన పెంచుతూ ఈ ర్యాలీ నిర్వహించారు.

 

ఆరోగ్యం కోసం నడక పేరుతో నిర్వహించిన ఈ ర్యాలీకి మంచి స్పందన లభించింది. స్థానికులు కూడా ఎంతోమంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవడంతో పాటు ఆ ఆరోగ్య సంరక్షణను నడకను తమ జీవనశైలిలో భాగం చేసుకోవాలని ఈ ర్యాలీ ద్వారా గుర్తు చేశారు.. స్వచ్ఛత, శుభ్రత, ఆరోగ్య పరిరక్షణపై ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ఈ ర్యాలీ సాగింది.

 

 

 

 

TeluguOne For Your Business
About TeluguOne
;