RELATED EVENTS
EVENTS
న్యూజేర్సీలో కీరవాణి స్వరరాగ గంగా ప్రవాహం

నాట్స్ హెల్ప్ లైన్, హెల్ఫ్ పౌండేషన్ కు ఆర్ధిక మద్దతు కోసం నాట్స్ ప్రయత్నం

 

 

 

అమెరికాలోని న్యూజేర్సీలో స్వరాలవాణి కీరవాణి తెలుగువారిని పాటల ప్రవాహంలో ముంచెత్తారు. రారిటన్ వ్యాలీ కమ్యూనిటీ కాలేజీలో కీరవాణి సంగీత విభావరి జరిగింది. న్యూజేర్సీలో ఉండే తెలుగువారు ఈ సంగీత విభావరిలో పాల్గొన్నారు. భారతదేశంలో అనాధ పిల్లల జీవితాల్లో అక్షర వెలుగులు నింపే 'హెల్ఫ్ పౌండేషన్' కు నిధుల సమీకరించేందుకు నాట్స్ ఈ సంగీత విభావరిని ఏర్పాటు చేసింది. న్యూజేర్సీలో తెలుగువారికి సంగీత కానుకలా మారిన ఈ కీరవాణి మ్యూజికల్ నైట్ లో తెలుగు పాటలు హోరెత్తాయి.

 

 


 

నాట్స్  వైస్ ప్రెసిడెంట్ గంగాధర్ దేసు నాట్స్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను ఈ సందర్భంగా ప్రేక్షకులకు దృశ్య ప్రదర్శన ద్వారా వివరించారు. నాట్స్ ప్రతినిధులు అప్పసాని శ్రీధర్, మోహన కృష్ణ మన్నవ, మధు కొర్రపాటి, విమల్ కావూరి, అరుణ గంటిలు ఈ మ్యూజికల్ నైట్ విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోపించారు. ఆటా, నాటా, తానా సంఘాల సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. 

 


 

తెలుగు ఫైన్ ఆర్ట్ సొసైటీ ఎంతో ఉత్సాహంగా  ఈ మ్యూజికల్ నైట్ ను సక్సెస్ చేయడంలో తన వంతు పాత్ర పోషించింది. రంజిత్ చాగంటి, శ్రీ హరి మందాడి, ఎన్ ఆర్సీ నాయుడు,  వాసు తుపాకుల, వేణు పాల్యం, మంజు భార్గవ, వసంత్ తన్నా, వెంకటేశ్వరరావు వక్కలగడ్డ, దాము గేదెల, రాజ్ అల్లాడ, చంద్రశేఖర్ కొణిదెల, విష్ణు ఆలూరు, ప్రసాద్ గుర్రం, సూర్య ప్రకాశ్ గంటి.. మురళీ మేడిచర్ల, శ్రీనివాస్ వెంకట, రామానాయుడు కంటుభుక్త , ప్రసాద్ బొబ్బ, శ్రీధర్ దోనేపూడి, హరికృష్ణ వీరవల్లి, మూర్తి పంతుల, హరి కొల్లూరి, ఫణి కడియాల, జయప్రకాష్ గుత్తా, ఆషా వైకుంఠం, రేఖ ఉప్పలూరి, శ్యామ్  నాళం, శంకరరావు పోలేపల్లి, మాధవి పోలేపల్లి, సత్య నేమాన, సురేష్  మాకం, సుధాకర్ ఉప్పల, శ్రీనివాస్ గండి, బిందు మాదిరాజు, ఉమ మాకం తదితరులు కీరవాణి మ్యూజికల్ నైట్  భారీ ఎత్తున సక్సెస్ చేయడంలో కీలక పాత్ర పోషించారు.

TeluguOne For Your Business
About TeluguOne
;