RELATED EVENTS
EVENTS
లాస్ ఏంజిల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు

క్రమశిక్షణ, పట్టుదల, ప్రేమ ఈ మూడు లక్షణాలు ఎన్టీఆర్ జీవితం నుంచి నేర్చుకోవచ్చని ఎన్టీఆర్ కుమార్తె  కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధరేశ్వరీ అన్నారు.  ఈ మూడు లక్షణాలే ఎన్టీఆర్ కు తరగని ఖ్యాతిని తెచ్చిపెట్టాయని చెప్పారు. ఎన్టీఆర్ ను స్ఫూర్తి ప్రదాతగా భావించడమే కాకుండా... ఆయన లక్షణాలను అలవర్చుకుంటే అద్భుతమైన విజయాలను సాధించవచ్చని పురంధరేశ్వరి సెలవిచ్చారు. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో నార్త్ అమెరికా తెలుగు సంఘం నాట్స్  ఘనంగా నిర్వహించిన ఎన్టీఆర్ జన్మదిన వేడుకల్లో పురంధేశ్వరి పాల్గొని ప్రసంగించారు. ఎన్టీఆర్ గొప్పతనాన్ని వివరించడంతో పాటు తాను చిన్నతనంలో  తండ్రితో ఉన్న  జ్ఞాపకాలను ఆమె ప్రస్తావించారు. ఎన్టీఆర్ రావణాసురుడు, దుర్యోధనుడు, లాంటి వేషాలు వేసినప్పుడు..ఆయన గదిలోకి వెళ్లడానికే కాస్త జంకు పడేదానినని ఆమె తెలిపారు. పౌరాణిక పాత్రల్లో ఆయనకు సాటి మరెవరు లేరన్నారు. రాముడిగా, కృష్ణుడుగా ఎన్నో పాత్రలు వేసిన ఎన్టీఆర్ ... దేవుడంటే ఇలానే ఉంటాడేమో అన్నంతగా తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించారని పురంధరేశ్వరి అన్నారు. ఎన్టీఆర్ ఫోటోలతో ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను ఆమె ప్రారంభించారు.. ఎన్టీఆర్ కు సంబంధించిన అరుదైన ఫోటోలు ఒక్క చోటికి చేర్చి ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనకు మంచి స్పందన లభించింది..

 

los angeles ntr birthday celebrations, nats brand ambassador ghazal srinivas, ntr daughter  purandeswari,  purandeswari union minister state human resource development,  nandamuri taraka rama rao, ntr  birthday celebrations los engels

 

తొలుత, నాట్స్ ప్రెసిడెంట్ రవి మాదాల కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ, నాట్స్ చేస్తున్న వివిధ సేవా కార్యక్రమాల గురించి వివరించారు. NRI లకు అనుకోని దురదృష్టకర సంఘటనలు జరిగినపుడు నాట్స్ హెల్ప్ లైన్ ఎలా సహాయపడుతోందో వివరిస్తూ, ఈ హెల్ప్ లైన్ NATS Helpline (800-4-TELUGU) గురించి  మరింత విస్తృత ప్రచారం చేయాలనీ ఆహూతులకు విజ్నప్తి చేసారు. అనంతరం, లాస్ ఏంజిల్స్ చాప్టర్ ఏర్పాటు చేస్తున్నట్టు, బోర్డు సభ్యులు డా.మధు కొర్రపాటి, డా. వీరయ్య చుండు ప్రకటించారు.  

 

తెలుగుజాతి గర్వించదగ్గ వ్యక్తి... ఎన్టీఆర్ అని చందు నంగినేని, నందన్ పొట్లూరి అన్నారు. ఎన్టీఆర్  గొప్పతనాన్ని  వారు వివరించారు. అటు సినీ  ప్రస్థానంలో.. ఇటు రాజకీయ ప్రస్థానంలో ఎన్టీఆర్ అద్భుత విజయాలు సాధించారని చెప్పారు. ఎన్టీఆర్ ను కేవలం ఒక్క రాజకీయ పార్టీకే పరిమితం చేయకూడదని వారు తెలిపారు. తెలుగు సంస్కృతికి తెలుగువారి ఆత్మాభిమానానికి ఎన్టీఆర్ ఓ రోల్ మోడల్ అని వారు అభివర్ణించారు. తెలుగు జాతి ఉన్నంతవరకు.. ఎన్టీఆర్ తెలుగువారి గుండెల్లో కొలువై ఉంటారని చందు, నందన్ లు కొనియాడారు.

 

los angeles ntr birthday celebrations, nats brand ambassador ghazal srinivas, ntr daughter  purandeswari,  purandeswari union minister state human resource development,  nandamuri taraka rama rao, ntr  birthday celebrations los engels

 

నాట్స్  బ్రాండ్ అంబాసిడర్ గజల్ శ్రీనివాస్ ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో పాల్గొని.. కుటుంబ సంబంధాలు, ప్రేమ గురించి వివరించడంతో పాటు.. తన గజల్స్ తో అందరిని అలరించారు. దాదాపు 800 మందికి పైగా పాల్గొన్న ఈ వేడుకల్లో ఎన్టీఆర్ పాటలతో ఏర్పాటు చేసిన ఆట, పాట అందరిని ఆకట్టుకున్నాయి.  శ్రీనివాస్ కిల్లాడ సమన్వయంతో ఏర్పాటు చేసిన సాంస్క్రుతిక కార్యక్రమాలు ఆద్యంతం రసవత్తరంగా సాగాయి. చంద్రశేఖర్ గండూరి, కవితా గరికపాటిలు ఎన్టీఆర్ పాటలకు చిందేశారు. విద్య తాడంకి కూర్చిన  ప్రవాసాంధ్రుల డ్యాన్స్,  సిమి వ్యాలీ చిన్నారుల  పుణ్యభూమి నాదేశం పాట,  వెంకట్ కొమ్మినేని ఏకపాత్రాభినయం, అమోఘ కోక క్లాసికల్ డ్యాన్స్,  రోహిత్ చిమిత్ అదుర్స్ డ్యాన్స్,  టోరెన్స్ కిడ్స్ చే బృందావనం డాన్స్, వికాస్ శ్లోకాలు,  శ్రీనివాస్ కిలాడ, సౌజన్య ఎన్టీఆర్ పాటలు,  వెంకట్ ఆలపాటి పిల్లలు పాడిన త్రిలింగదేశం నాదోయి పాట...  కవిత సమర్పించిన కిరణ్ సింహద్రి, ఎన్టీఆర్ మిడ్ లీ గ్రూప్ డ్యాన్స్ ,.. ఇవన్నీ  ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో అంతులేని వినోదాన్ని అందించాయి.

 

los angeles ntr birthday celebrations, nats brand ambassador ghazal srinivas, ntr daughter  purandeswari,  purandeswari union minister state human resource development,  nandamuri taraka rama rao, ntr  birthday celebrations los engels

 

ఈ కార్యక్రమం దిగ్విజయం గా జరగటానికి   తమవంతు మద్దతు తెలిపిన స్థానిక సంస్థలు IYANA ఫౌండర్ లక్ష్మి చుండు, TASC అద్యక్షుడు విజయ్ భాస్కర్ నెక్కంటి, ట్రై-వాలీ తెలుగు అసోసియేషన్  మరియు వాలంటీర్ లకు, NATS ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు ప్రసాద్ పాపుదేసి కృతజ్ఞతలు తెలియచేసారు. రామ్ యార్లగడ్డ కు చెందిన e-పిలుపు ను దగ్గుపాటి పురంధరేశ్వరి ప్రారంభించారు. "స్థానిక హీరోస్" గా గుర్తింపు పొందిన, శ్యాం  గుండాల, బెనర్జీ  సున్కవల్లి, మధు  బోడపాటి, కిషోర్  గరికపాటి, శ్రీధర్  అద్దంక, రామ్ యలమంచిలి, సురేష్  బాబు  ఆయనంపుడి, గౌతం కటారి, లక్ష్మి  చిమట, హరి కొనక, హరి మాదాల, పండు  చిమట, రవి తిరువైపాటి ఈ కార్యక్రమ నిర్వహణలో ఎంతో శ్రమించారు. దోసా ప్లేస్  టస్టీన్ వారు అందించిన డిన్నర్ వెరైటీ రుచులతో భోజన ప్రియులకు పండుగ చేసింది.

 

los angeles ntr birthday celebrations, nats brand ambassador ghazal srinivas, ntr daughter  purandeswari,  purandeswari union minister state human resource development,  nandamuri taraka rama rao, ntr  birthday celebrations los engels

 

 

 

TeluguOne For Your Business
About TeluguOne
;