RELATED EVENTS
EVENTS
న్యూజెర్సీలో నాట్స్ సంబరాల సన్నాహాక కార్యక్రమం..

 

 

న్యూజెర్సీలో నాట్స్ సంబరాల సన్నాహాక కార్యక్రమం


ఎడిసన్: న్యూ జెర్సీ: ఏప్రిల్ 7:  ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అమెరికాలో అంగరంగ వైభవంగా జరిపే తెలుగు సంబరాల కోసం సన్నాహాలు ముమ్మరమయ్యాయి. ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఈ సారి చికాగో వేదికగా అమెరికా తెలుగు సంబరాలను నిర్వహించనుంది. దీనిలో భాగంగానే సంబరాలకు సన్నాహకంగా న్యూజెర్సీలోని రాయల్ అల్బెర్ట్స్ కన్వెన్షన్ హాల్ లో అమెరికా తెలుగు సంబరాలు చికాగో కన్వెన్షన్ 2017- కర్టన్ రైజర్ పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. చికాగోలోని శ్యాం బర్గ్ వేదికగా జూన్ 30, జులై 1,2 తేదీల్లో జరిగే తెలుగు సంబరాలకు అమెరికాలోని తెలుగు ప్రజలంతా తరలిరావాలని నాట్స్ పిలుపునిచ్చింది. భాషే రమ్యం.. సేవే గమ్యం అని నినదించే నాట్స్ అమెరికాతో పాటు తెలుగు రాష్ట్రాల్లో చేపడుతున్న సేవాకార్యక్రమాలను నాట్స్ ఛైర్మన్ శ్యాం మద్దాళి వివరించారు. నాట్స్ హెల్ఫ్ లైన్ లతో తెలుగు ప్రజలకు ఎలా చేరువయ్యింది..భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటనేది నాట్స్ అధ్యక్షుడు మోహనకృష్ణ మన్నవ తెలిపారు. ఉచిత వైద్య శిబిరాలతో పాటు ఇక ముందు నాట్స్ వైద్య బృందాలు చేపట్టే సేవా కార్యక్రమాలను నాట్స్ బోర్డ్  కార్యదర్శి శ్రీధర్ అప్పసాని వివరించారు.

బోర్డు అఫ్ డైరెక్టర్స్, గంగాధర్ దేసు, రాజేంద్ర అప్పలనేని, అరుణ గంటి నాట్స్ చేస్తున్న, మున్ముందు చేయబోయే  సేవా కార్యక్రమాలను వివరిస్తూ సంబరాలలో తెలుగు వారందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.


యువిక జెవెల్లర్స్, శాండియాగో, కాలిఫోర్నియా వారు కూడా ఈ సంబరాలలో మరో ప్రముఖ సపోర్టర్ గా వ్యవహరించనున్నారు. తొలుత, బోన్ మారో డ్రైవ్ ను డా.మధు కొర్రపాటి ప్రారంభించి అసలు ఈ బోన్ మారో డ్రైవ్ ఉద్దేశ్యం ఏమిటి, యువత బాధ్యత ఇందులో ఎంత ఉంది తదితర వివరాలు తెలియచేస్తూ యువత ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని పదే పదే విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది.  ముఖ్యంగా యువతలో నాట్స్ కు ఆదరణ పెరుగుతుందని..యువ నాయకత్వానికి ఎప్పుడూ నాట్స్ పెద్ద పీట వేస్తుందన్నారు. ఈసారి చికాగో వేదికగా జరిగే అమెరికా తెలుగు సంబరాల్లో ఏం ప్రత్యేకతలున్నాయనేది సంబరాల కమిటీ కన్వీనర్  రవి అచంట వివరించారు. సేవే గమ్యం అనేది మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తూ.. నాట్స్ తెలుగువారి గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించిందని న్యూజెర్సీలో తెలుగు ప్రముఖుడు.. న్యూ జెర్సీ పబ్లిక్ యుటిలిటీ కమిషనర్ ఉపేంద్ర చివుకుల అన్నారు. ముఖ్య అతిధి ఉపేంద్ర చివుకులను నాట్స్ న్యూయార్క్ కోఆర్డినేటర్ శ్యాం నాళం, నాట్స్ మీడియా కోఆర్డినేటర్ మురళీకృష్ణ మేడిచెర్ల, పుష్ప గుచ్చం, శాలువాతో సత్కరించారు. తెలుగువారిని ఏకం చేయడంలో నాట్స్ కీలక పాత్ర పోషిస్తుందని ఉపేంద్ర కొనియాడారు. ఉపేంద్ర చివుకుల మాట్లాడుతూ తాను అమెరికా వచ్చిన తొలి రోజుల్లోనే ఈ బోన్ మారో కార్యక్రమాల్లో పాల్గొన్న విషయాన్ని గుర్తుచేసుకొంటూ యువత ఇటువంటి వాటి కి తమవంతు సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపు నిచ్చారు. 

నాట్స్ శ్రేయోభిలాషి, సప్పోర్టర్ ఏ.వి.ఆర్.చౌదరి , రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న అనేక అంశాల గురించి వివరిస్తూ , పెట్టుబడులు ఎలా పెట్టాలి, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ప్రెజంటేషన్ ద్వారా వివరించారు. దేశ వ్యాప్తంగా ఉన్న అవకాశాలను వివరిస్తూ , ఇంతకుముందు తమ జి & సి సంస్థ ద్వారా పెట్టుబడులు పెట్టినవారి లాభాలు ఎలా ఉన్నాయో తదితర విషయాలు తెలియచేశారు.

 


నాట్స్ చేపట్టిన సంబరాల సన్నాహాక కార్యక్రమానికి నాట్స్ తో పాటు స్థానిక తెలుగు సంఘం టీఏజీడీవీ ప్రతినిథులు, సభ్యులు కూడా విచ్చేశారు. శ్రీకాంత్, ప్రసాద్, అదితి భావరాజు, రాజీవ్ తదితర గాయనీ గాయకులు ఈ కార్యక్రమంలో హుషారైన తెలుగు పాటలు పాడి జోష్ నింపారు. ఇమిటేషన్ రాజు చేసిన మిమిక్రీ అందరినీ అలరించింది. సంబరాలకు నాట్స్ ఇచ్చిన పిలుపుకు మంచి స్పందన లభించింది. దాదాపు 800 మందికి పైగా నాట్స్ అభిమానులు, సపోర్టర్స్ పాల్గొన్న ఈ కార్యక్రమం లో 500,000 డాలర్లు డొనేషన్ ప్లడ్జ్ లు వచ్చాయి.. అమెరికా తెలుగు సంబరాల్లో మేముసైతమంటూ తెలుగువారి నుంచి వస్తున్న స్పందనపై నాట్స్ హర్షం వ్యక్తం చేసింది. నాట్స్ సంబరాల సన్నాహాక కార్యక్రమంలో నాట్స్ జాతీయ నాయకత్వంతో పాటు.. న్యూజెర్సీ,న్యూ యార్క్, పెన్సిల్వేనియా  నాట్స్ సభ్యులు..వాలంటీర్లు.. ఇతర తెలుగు సంఘాల  సభ్యులు కూడా భారీ ఎత్తున తరలివచ్చారు.

ఈ కార్యక్రమం విజయవంతమవటానికి  నాట్స్ సెక్రటరీ రమేష్ నూతలపాటి, నార్త్ ఈస్ట్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి, న్యూ జెర్సీ చాప్టర్ కోఆర్డినేటర్ వంశీకృష్ణ వెనిగళ్ల, రాజ్ అల్లాడ  తమ మిత్ర బృందాలతో కలసి ఎంతగానో సహాయ పడ్డారు.

TeluguOne For Your Business
About TeluguOne
;