RELATED EVENTS
EVENTS
"దేవాలయం" గీతాలను అభినందించిన పురందేశ్వరి

లాస్ ఎంజేలేస్ : దేవాలయ పరిరక్షణ గీతాల మాలిక "దేవాలయం" ఆడియో సిడి ని  కేంద్ర మానవ వనరుల శాఖా మాత్యురాలు డాక్టర్ దగ్గుబాటి పురందేశ్వరి ప్రత్యేకం గా అభినందించారు. లాస్ ఏంజలెస్ లో NATS  నిర్వహించిన నందమూరి తారకర రామారావు ఎనభై ఆరవ జన్మ దినోశ్చవ వేడుకలలో పాల్గొని  "దేవాలయం" సిడి ని ఆత్మీయులకు అందించారు. దేవాలయ పరిరక్షణ సంస్థ డాక్టర్ గజల్ శ్రీనివాస్ సంగీత గాన ప్రతిభతో రూపొందిన చైతన్య గీతాలు భారతీయ సంస్కృతి, దేవాలయాల ప్రాముఖ్యతను తెలిపే విధంగా వున్నాయని, అన్న దానం, గోమాత పవిత్రత పై పాటలు గొప్పగా వున్నాయని అభినందించారు. గీత రచయతలు  సిరాశ్రీ, డాక్టర్ తటవర్తి రాజగోపబాలం, శ్రీ రసరాజు లను ప్రత్యేకంగా అభినందించారు. చారిత్రక కట్టడాలను, మన సంస్కృతి ప్రతి బింబించే  దేవాలయాలను అందరమూ కాపాడుకోవాలని, చిన్నారులలో అద్యామికత విలువలను పెంపోదించాలని అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ NTR నటించిన పౌరాణిక పాత్రలను ఆర్ద్ర్రంగా గురుతు చేసుకున్నారు. దేవాలయ పరిరక్షణ గీతాల సిడి ని రూపొందించిన డాక్టర్ వెలగపూడి ప్రకాశ రావు గారి సేవలను అభినందించారు. అనంతరం డాక్టర్ గజల్ శ్రీనివాస్ గజల్ గీతాలు   ఆహుతుల్నిఅలరించాయి. 

 

purandeswari nats, ghazal srinivas ats brand ambassador, los angeles purandeshwari ghazals, ntr 86th birthday celebrations nats, telugu nri news

 

 

TeluguOne For Your Business
About TeluguOne
;