RELATED EVENTS
EVENTS
నాట్స్ ఫ్రీ ఫ్లూ వాక్సినేషన్ కు సెయింట్ లూయిస్ లో మంచి స్పందన

 

నాట్స్ ఫ్రీ ఫ్లూ వాక్సినేషన్ కు సెయింట్ లూయిస్ లో మంచి స్పందన

 


అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలిచే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అనేక సేవ కార్యక్రమాలను చేపడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా సెయింట్ లూయిస్ లోని హిందు టెంపుల్, అవర్ అర్జంట్ కేర్ సంస్థలతో కలిసి అక్టోబర్ 8 వ తేదీ శనివారం నాడు నాట్స్ మిస్సోరి ఛాప్టర్ ఉచిత ఫ్లూ వాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించింది. నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్ డా.అట్లూరి సుధీర్, హిందు టెంపుల్ ట్రస్టీ జీవీ నాయుడు నేతృత్వంలో జరిగిన ఫ్లూ వాక్సినేషన్ కు మంచి స్పందన లభించింది. ముఖ్యంగా 150మందికి పైగా తెలుగు ప్రజలు దీనిని చక్కగా వినియోగించుకున్నారు. డాక్టర్లు అట్లూరి రమ, కనకదండెల కృష్ణమోహన్, వెంకటేశ్వరరావు ధర్మవరపు, జీవీనాయుడు ఈ వాక్సినేషన్ లో తమ విలువైన సేవలను అందించారు. గరిమెళ్ళ హరీంద్ర, ముచ్చెర్ల చిన్న, శిష్టల నాగశ్రీనివాస్, మామిళ్లపల్లి శ్రీనివాస్ ,గుందేటి పరం, వల్లూరు కృష్ణ తదితరులు, హిందూ టెంపుల్ నుండి హేమ వాలంటీర్లుగా,  ఈ వాక్సినేషన్ కార్యక్రమంలో సేవలందించారు. ముమ్మనగండి నాగ సతీష్ ఈ కార్యక్రమాన్ని సమన్వయపరిచారు. సేవే గమ్యం నాట్స్ నినాదమే కాదు తమ విధానం కూడా అని  నాట్స్ జాతీయ కోశాధికారి మంచికలపూడి శ్రీనివాస్ అన్నారు. సెయింట్ లూయిస్ చేపట్టిన ఈ వాక్సినేషన్ అక్టోబర్ 15 వ తేదీన మరోసారి కూడా నిర్వహించనన్నుట్టు  ఆయన తెలిపారు. వాక్సినేషన్  విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి శ్రీనివాస్ మంచికలపూడి ధన్యవాదాలు తెలిపారు..  సెయింట్ లూయిస్ లో నాట్స్ తెలుగు ప్రజలు అందిస్తున్న మద్దతు వల్లే అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్టు  ఆయన తెలిపారు. అక్టోబర్ 21వ తేదీన నాట్స్ మిస్సోరి మహిళా విభాగం వుమెన్ అండ్ టీన్ నైట్ కార్యక్రమం జరగనుందని మంచికలపూడి అన్నారు. యలమంచిలి విజయ , యలమంచిలి శిరీష ల నాయకత్వంలో జరిగే ఈ కార్యక్రమాన్ని స్థానిక తెలుగు మహిళలంతా హాజరుకావాలని ఆయన కోరారు. నాట్స్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను  శ్రీనివాస్ మంచికలపూడి వివరించారు.



TeluguOne For Your Business
About TeluguOne
;