RELATED EVENTS
EVENTS
చార్లెట్‌లో ఆటా రోజు వేడుకులు

ఆటా రోజు వేడుకులు చార్లెట్‌లోని ‘హిందు సెంటర్’లో మే 26న ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో సుమారు 250 మంది పాల్గొన్నారు. ఆటా అద్యక్షులు రాజేందర్ జిన్నా గారు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమ౦ ప్రారంభమయింది. ఆటా సభ్యులు శేషగిరి రావు, వెంకట్ వీరనేని, నంద చాట్ల గారు కూడా ఈ వేడుకలకు హాజరయ్యారు. విజయ లక్ష్మి గారు, వినోద్ బాబు గారు తమ మధుర గానంతో ఈ కార్యక్రమాన్ని ఉత్సాహభరితం చేశారు.

 

ATA Roju Celebrations, Charlotte ATA Roju Celebrations, ATA ROJU 2012, ATA ROJU 2012 TAGCA CTA, Charlotte Hindu Center, ATA event in Greater Charlotte


 
ఆటా అధ్యక్షులు రాజేందర్ జిన్నా గారు మాట్లాడుతూ సంస్కృతి, సాంప్రదాయం, సమాజ సేవ మీద తమ సంస్థ చేస్తున్న కృషిని వివరించారు. జులైలో జరగనున్న ఆటా కార్యక్రమానికి రావలసినదిగా వారు అతిధుల౦దరినీ పేరు పేరునా ఆహ్వానించారు. ఇంతవరకూ ఆటా సాధించిన ప్రగతికి తమ హర్షం వ్యక్తం చేశారు. భవిష్యతులో ఆటా ఎన్నో సేవ కార్యక్రమాలు చేపట్టనున్నట్లుగా వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి తమ సంపూర్ణ సహకారన్నందించిన ‘టిఏజిసిఏ’ మరియు ‘సిటిఏ’ సంస్థలకు తమ కృతజ్ఞత వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమ౦ విజయవంతమవడానికి అహర్నిశలూ కృషి చేసిన సంతోష పసుల (ఆటా రీజినల్ కొ ఆర్డినేటర్), రఘునాధ కొత్త(ఆటా సావనీర్ చైర్),  పురుసోత్తమ గూడె, జయ థక్క,  రమణ కొట్టె, సునీత అనుగు, అశోక చందు, శ్రవణ్ కయాటి, నాగ నల్ల, నవీన్ జలగం, భరత్, ఎడ్మ, శ్రీనివాస్ మర్పడ్గ, సంజీవ్ రెడ్డి రవి వెంకట్ గార్లకు మన కృతజ్ఞతలు తెలియజేశారు.
 
ఈ కార్యక్రమానికి చార్లెట్ వాస్తవ్యులు మరియు చిన్నారులు గాన, నృత్య ప్రదర్శనలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రంలో హాజరైన చార్లెట్ వాస్తవ్యులు సుమారుగా 60,000 డాలర్లు ఆటా కు విరాళాన్ని  అందజేశారు.

 

 

TeluguOne For Your Business
About TeluguOne
;