RELATED EVENTS
EVENTS
ఆమెరికాన్ తెలుగు అసోసియేషన్ ప్రవాసంద్రుల దసరా మరియు బతుకమ్మ ఉత్సవాలు

ఆమెరికాన్ తెలుగు అసోసియేషన్ (ఆట) మరియు తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ చికాగో(టి. ఏ. జి. సి) వారి ఆద్వర్యములో ప్రవాసంద్రులు దసరా ఉత్సవాలు మరియు బతుకమ్మ కనుల పండుగను ఘనం గా జరుపుకున్నారు. ఇల్లినొఇస్ రాష్ట్రం నలుమూలల నుండి అమెరికా వలసవచ్చిన 500 పైగా తెలుగువారు అంతా కలిసి చికాగో లోని ఆరోర వెంకటేశ్వరా స్వామి ఆలయ ప్రాంగణం లో బతుకమ్మ మరియు దసరా పండుగలను శనివారం రోజు (09/10/11) చేసుకున్నారు. ఈ వేడుకలు శనివారం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు అత్యంత ఉత్సాహం తో ఘనం గా జరిగాయి.

మధ్యాన భోజనం ఆరగించిన తరువాత, మహిళలు సాంప్రదాయ బద్దంగా రంగు రంగుల పట్టువస్త్రాలు దరించి, అందంగా అలంకరించిన రంగు రంగుల బతుకమ్మలతో చికాగో వాసుల కన్నుల విందు చేసారు. పిల్లలు, పెద్దలు చేరి బతుకమ్మ పాటలతో సాయంత్రము వరకు ఆడి, గౌరమ్మ తల్లికి పూజ చేసి తరువాత వారి వారి బతుమ్మలను మేలా తాళాలు, భజంత్రి లతో గుడి కొలనులో ఒదిలారు.

ఈ పండుగల సందర్బంగా పిల్లలకు పరి విదాల ఆటల పోటీలు నిర్వహించారు, గెలిచినా పిల్లల అందరికి ఆట వ్యవస్త్హపకులు హన్మంత్ రెడ్డి, GLN రెడ్డి గార్లు బహుమతులను అంద చేసారు. సాయంత్రము గుడి పూజారి సుభద్రా చార్యులు గారు వచ్చిన వారందరితో దస్తూరి వ్రాయించి, జమ్మి వృక్షానికి మరియు ఆయుధ పూజ చేసారు. వచ్చిన వారందరకి పూజ చేసిన కంకణాల కట్టి ఆశీర్వదించి, ప్రసాదం పంచారు. పిల్లలు జమ్మి ఆకులను పంచి పెద్దల నుండి ఆశీర్వాదం తీసు కొన్నారు. వచిన వారందరూ జమ్మి ఆకులను పంచి పరస్పరం ఆశీర్వాదం తీసు కొన్నారు. ఈ వేడుకలు భారత దేశం లోని దసరా ఉత్సవాలని మరిపించాయని పలువురు ప్రశంసించారు.

ఆట ప్రెసిడెంట్ ఎలెక్ట్ కరుణాకర్ మాధవరం, TAGC ప్రెసిడెంట్ ఎలెక్ట్ కల్యాణ్ అనందుల, బతుకమ్మ కార్య నిర్వాహకుడు శ్రీనివాస్ సరికొండ ఈ వేడుకకు విచ్చేసిన ఆతిథులకు, ధాతలకు, కార్యకర్తల కు ధన్యవాదాలు తెలిపారు.

TeluguOne For Your Business
About TeluguOne
;