RELATED EVENTS
EVENTS
అమెరికా తెలుగు సంఘం (అట) ఆధ్వర్యంలో క్రికెట్

విల్మింగ్టన్ , డెలావేర్: సెప్టెంబర్ 11:

అమెరికా తెలుగు సంఘం (అట) ఆధ్వర్యంలో డెలావేర్, ఫిలడెల్ఫియా ఏరియాలో అట ప్రతినిధులు వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. సెప్టెంబర్ 10, 11 తేదిలలో క్రికెట్ మ్యా చ్ లు, విందు కార్యక్రమాలు మొదలగు వంటి కార్యక్రమాలను చేపట్టారు. ఈ ప్రాంతంలో అట కార్యక్రమాలను ఇప్పటి వరకు ఎప్పుడు నిర్వహించలేదు. 20 సంవత్సారాలలో ఇదే మొదటి సారిగా నిర్వహిస్తున్నారు.

విల్మింగ్టన్ లోని బొంసాల్ పార్క్ లో నిర్వహించిన ఈ క్రికెట్ మ్యాచ్ లలో 14 టీంలు పాల్గొన్నాయి. దాదాపు 300 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొని క్రీడ కారులని ఉత్తేజపరిచారు. వీరికి తోడుగా చిన్నారులు కూడా పాల్గొని వాళ్ళ తండ్రులకు సపోర్ట్ గా చప్పట్లు చరిచారు. మొత్తం 20 టీంలు రిజిస్టర్ చేసుకున్నప్పటికి, సమయం లేనందువల్ల 6 టీంలు వెనుతిరగలవసి వచ్చింది. అట నిర్వాహకులు వీరికి మల్లి నిర్వహించే మ్యాచ్ లలో స్థానం కలిపిస్తామనడంతో కథ సుఖాంతం అయ్యింది. శనివారం సాయంత్రం, మేరియాట్ హోటల్లో జరిగిన విందుకు స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అట కార్యవర్గ సభ్యులను మరి ఇతర కమిటీ మెంబర్స్ ను కలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అట ప్రెసిడెంట్ డాక్టర్ రాజేందర్ జిన్నా, సెక్రటరీ రామ్మోహన్ కొండ, ఇతర కార్యవర్గ సభ్యులు పర్మేష్ భీంరెడ్డి, సుధాకర్ పెర్కారి, బలవంత్ కొమ్మిడి, సురేష్ జిల్లా, వినోద్ కోడూర్, భువనేశ్ బూజల, రాజేష్ మాదిరెడ్డి పాల్గొన్నారు.

అట ప్రెసిడెంట్ రాజేందర్ జిన్నా గారు, అట చేస్తున్న సేవలను, కార్యక్రమాలను స్థానిక ప్రజలకు వివరిస్తు ప్రజలను కూడా అందులో భాగస్వాములు కావాలని కోరారు.

ఆదివారం జరిగిన క్రికెట్ ఫైనల్స్ లో చాలెంజర్ టీమ్ చాంపియన్ షిప్ దక్కించుకుంది. చేజ్ ఎలెవన్ టీం ద్వీతీయస్థానం దక్కించుకుంది. మొదటి స్థానం దక్కించుకున్న టీంకు డాక్టర్ రాజేందర్ జిన్నా, మరియు రెండో స్థానం దక్కించుకున్న టీంకు స్థానిక ప్రముఖ హార్ట్ సర్జన్ చంద్రశేఖర్ రెడ్డి బీసం ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమం అట ప్రాంతీయ సమన్వయకర్తలు ఉదయ కిరణ్ కొమ్మిరెడ్డి, మాధవ మోసర్గ ఆధ్వర్యంలో, స్థానిక ఆట బోర్డు మెంబర్ పర్మేష్ భీం రెడ్డి సూచనలతో విజయవంతంగా నిర్వహించారు.

ఉదయ, మాధవ్ తనకు సహాయ సహకారాలు అందించిన కార్యకర్తలు ప్రశాంత్ గుడుగుంట్ల, కిరణ్ అలా, శ్రీనివాస్ కేశవరావు, శ్రీధర్ బోల్లెద్దుల, కమల్ నెల్లుట్ల కు ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా అన్ని రకాల సహాయ సహకారాలను అందించిన వెంకటరావు మదిపగాడను అట ప్రెసిడెంట్ జిన్నా ప్రత్యేకంగా అభినందించారు.

 

Email: info@ataworld.org website:http://www.ataworld.org

TeluguOne For Your Business
About TeluguOne
;