RELATED EVENTS
EVENTS
ఘనంగా ముగిసిన ఆటా సేవా కార్యక్రమాలు

డిసెంబర్ 10 నుంచి 16 వ తారీకు వరకు ఆటా ( అమెరికా తెలుగు అసోసియేషన్) ఆంధ్ర ప్రదేశ్ లో నిర్వహించిన సేవా కార్యక్రమాలకు మంచి స్పందన లభించింది. ఆటా చేపట్టిన సేవా కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి.

 

ATA Vedukalu Press Meet Event More Photos


ATA Vedukalu - Karimnagar : 10th Dec: కరీంనగర్ జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండలం ప్రభుత్వ ఆసుపత్రి లో "prevention is better than cure" అనే ఉద్దేశం తో నిర్వహించిన హెల్త్ క్యాంపులో ఉచితంగా కంటి చికిత్స, ఆపరేషన్, మందులు, కాన్సర్ screening జరిపారు. తదనంతరం గంగారం గ్రామంలో లైబ్రరీ రూం కొరకు శంకు స్తాపన చేయడం జరిగినది. సాయంత్రం కరీంనగర్ లో విదేశీ విద్య పై అవగాహన సదస్సు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణతో పాటు కవులను, కళాకారులను సన్మానించారు. ఈ కార్యక్రమములకు మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, MP లు రాజయ్య గారు, పొన్నం ప్రభాకర్ గారు, వివేక్ గారు, MLA ప్రవీణ్ రెడ్డి గారు విచ్చేశారు.

 

ata sambaralu, ata 5k run, ata health program mylavaram, ata seminers

 

ATA Vedukalu Karimnagar Event More Photos

 

ATA Vedukalu - 5K Run : 11th Dec: హైదరాబాద్ నేక్లస్ రోడ్ లో traffic బద్రత, కాలుష్య నివారణ, పిల్లలకు పౌష్టిక ఆహరం ఆవశ్యకత మొదలైన విషయాలపై పరిజ్ఞానం కొరకు చేపట్టిన 5K రన్ కు దాదాపు 2500 విద్యార్థులు అత్యుత్సాహంతో పాలుపంచుకున్నారు. హోం శాఖామాత్యులు శ్రీమతి సబితా ఇంద్ర రెడ్డి గారు ఈ 5K రన్ ప్రారంభిచారు. ఈ కార్యక్రమం లో MP హన్మంత్ రావు, ఇంద్రసేనా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు

 

ata sambaralu, ata 5k run, ata health program mylavaram, ata seminers


ATA Vedukalu 5K Run Event More Photos

 

ATA Vedukalu - Mylavaram : 12th Dec: కృష్ణ జిల్లా మైలవరం లో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు రైతు సదస్సు, విదేశీ విద్య పై అవగాహన సదస్సు, విద్యార్థులు ఆటల పోటీలు, ఉచిత నేత్ర చికిత్సలు, మందుల పంపిణి, వృద్దులకు, వికలాంగులకు వస్త్రాలు, పించనులు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా లక్ష్మిరెడ్డి హన్మిరెడ్డి గారి కుటుంబ సేవలను పలువురు కొనియాడారు.

 

ata sambaralu, ata 5k run, ata health program mylavaram, ata seminers

 

ATA Vedukalu Mylavaram Event More Photos

 

ATA Vedukalu - Seminars 15th Dec: హైదరాబాద్ లోని సెంట్రల్ కోర్ట్ హోటల్ లో 1 PM నుండి 4 PM వరకు విదేశీ విద్య పై అవగాహన సదస్సు, Women ఫోరం జరిగింది. IT మంత్రి వర్యులు శ్రీ. పొన్నాల లక్ష్మయ్య గారు ఈ సదస్సులను ప్రారంభించారు. అమెరికన్ Vice Consulate జనరల్ Geremy Jewitt, రేణుక రాజరావు,  Dr. రవి కల్లూర్, Prof. రాజశేఖర్ వంగపాటి, Dr. సురేందర్ రెడ్డి మొదలైన ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సాయంత్రం 6 PM నుంచి 11 PM వరకు రవీంద్ర భారతి లో సాంస్కృతిక కార్యక్రమములు మరియు ఆటా సేవ కార్యక్రమముల recognition awards ల ప్రధానం జరిగింది. సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు శ్రీ. వట్టి వసంత కుమార్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రంలో మంత్రివర్యులు శ్రీమతి గల్లా అరుణకుమారి గారు, సిపిఐ పార్టి నారాయణ గారు , డా. నాగం జనార్ధన్ రెడ్డి గారు, BJP నాయకులు లక్ష్మణ్, కిషన్ రెడ్డి గారు, TRS నుంచి జితేందర్ రెడ్డి, శ్రీమతి కవిత, మరియు PCC సెక్రటరీ వినోద్ రెడ్డి మఖ్య అతిథులు గా పాల్గొన్నారు. డా. లకిరెడ్డి హన్మిరెడ్డి గారు చేసిన సేవలను గుర్తిస్తూ ఆటా తరపున శ్రీ. వట్టి వసంత కుమార్ గారు మరియు శ్రీమతి గల్లా అరుణకుమారి గారు వారిని సన్మానించారు. వివిధ రంగాలలోని ప్రముఖులను కూడా ఈ కార్యక్రమంలో సాన్మానించటం జరిగింది థీమ్ ఆటా ప్రధాన ఉద్దేశ్యం ఐన "సంస్క్రతి, సాంప్రదాయం, సమాజ సేవ" గా రూపొందించిన నాటిక పలువురిని ప్రత్యేకంగా అలరించినది.

ata sambaralu, ata 5k run, ata health program mylavaram, ata seminers

 

ATA Vedukalu Seminars Event More Photos


 

16th Dec: ఆటా ప్రతినిధుల బృందం వర్గల్ సరస్వతి దేవాలయంను సందర్శించి ప్రత్యేక పూజలు చేసారు. స్థానిక MLA నరాసా రెడ్డి గారు ఆటా బృందానికి ఘన స్వాగతం పలికారు. ఆటా స్థాపకులు హన్మంతరెడ్డి గారిని వారి స్వస్తలం లో స్థానికులు గౌరవంగా సన్మానించారు. హన్మంతరెడ్డి గారు అక్కడి అర్హులయిన విద్యార్థులను ఆటా నుండి scholrships ద్వార ప్రోత్సహిస్తామన్నారు. ఈ సందర్భంగా ఆటా అద్యక్షులు రాజేందర్ జిన్నా, ఉపాధ్యక్షులు కరుణాకర్ రావు మాధవరం ఆటా చేసే సేవలను మీడియాకు వివరించారు. అమెరికాలో తెలుగు భాష, సాంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ, తెలుగు వారి సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ఆటా కృషి చేస్తుందని వారు వివరించారు.

ATA Vedukalu - Seminars


ATA College Preparation Workshop Event More Photos

 

ఆంద్రప్రదేశ్ అంతటా నిర్వహించిన సేవా కార్యక్రమములకు గాను ఆటా కార్యవర్గ సభ్యులైన ఆటా అధ్యక్షులు డా. రాజేందర్ జిన్నా,  ప్రెసిడెంట్ ఎలెక్ట్ మరియు ఆటా వేడుకల చైర్ పర్సన్ కరుణాకర్ మాధవరం, ఆట ట్రస్టీ & ఆటా వేడుకలు కోచైర్ బల్వంత్ కొమ్మిడి, Inernational కో ఆర్డినేటర్ రామచంద్ర రెడ్డి, ఆటా ట్రస్టీ & ఆటా కార్యాలయ నిర్వాహకుడు నరేందర్ చేమర్ల, ఆటా మెంబర్‌షిప్ కమిటీ చైర్ KSN రెడ్డి, TAGC అద్యక్షులు & ఆటా వేడుకలు కో ఆర్డినేటర్ కళ్యాణ్ అనందుల, ఆటా PR చలమ బండారు, ఆటా వేడుకలు కరీంనగర్ కో ఆర్డినేటర్ విశ్వేశ్వర్ కలవాల, ఆటా రీజనల్ కో ఆర్డినేటర్ నాగేందర్ మహీపతి, ఆటా ట్రస్టీ & ఎడ్యుకేషన్ సెమినార్ కో ఆర్డినేటర్ డా. రవి కల్లూర్, ఎడ్యుకేషన్ సెమినార్ కో ఆర్డినేటర్ ప్రొఫెసర్. రాజశేఖర్ వంగాపాటి, ఆటా వ్యవస్థాపకులు & past-ప్రెసిడెంట్ హన్మంతరెడ్డి , ఆటా past-ప్రెసిడెంట్ డా. గోపాల్ రెడ్డి, డా. లక్ష్మిరెడ్డి హన్మి రెడ్డి, సిద్ధార్థ్ లకిరెడ్డి, దామోదర్ దోనూర్, శ్రీకాంత్ గుడిపాటి, వేణు సంకినేని, ఆటా ట్రస్టీ & సెక్రటరీ రామ్మోహన్ కొండ మరియు ఆంధ్రప్రదేశ్ తరపున ఆటా కార్యవర్గ సభ్యులు డా. పద్మజా రెడ్డి, దేవేందర్ కాసిరెడ్డి, నరోత్తం రెడ్డి, సతీష్, డా. సురేందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సురేష్ కాలేరు మరియు భూపాల్ సత్తు గార్లను పలువురు ప్రశంసించారు 

 

ATA Vedukalu - Seminars

 

ATA Vedukalu at Ravindra Bharathi Event More Photos

 

ఆటా వేడుకలు కార్యక్రమములు ఇంత విజయవంతంగా జరుగడానికి సహాయం చేసిన దాతలు డా. లక్ష్మిరెడ్డి హన్మి రెడ్డి , రవీందర్ & ఉమ గునుగంటి, Phoenix builders , MyHome builders, డా. గురవ రెడ్డి, వసుధ ఫౌండేషన్ లకు, ఆంధ్రప్రదేశ్ ప్రబుత్వానికి, పోలీసు శాఖకు, మీడియాకు ఆటా తరపున అధ్యక్షులు డా. రాజేందర్ జిన్నాగారు మరియు ప్రెసిడెంట్ ఎలెక్ట్ & ఆటా వేడుకల చైర్ పర్సన్ కరుణాకర్ మాధవరం గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసారు.

 

 

 

 


 

 

 

 

 

 

 

 

 

 

 

TeluguOne For Your Business
About TeluguOne
;