RELATED EVENTS
EVENTS
ఆటా వారి ఆధ్యర్యంలో వీలునామా మరియు ఎస్టేట్ ప్లానింగ్ సెమినార్

26. 2011 న “Do I still need a Will even though I don’t have a lot of money’’ అనే థీమ్ తో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో విచ్చేసిన వారికి స్వాగతం పలుకుతూ ఆటా డల్లాస్/ఫోర్ట్ వర్త్ రీజనల్ కొ-ఆర్డినేటర్ అరవింద్ రెడ్డి ముప్పిడి వారంతారాలలో ఎంతో బిజీగా ఉండి, ఇతర కార్యక్రమాలు వున్నా ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారికి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఆటా వారు చేపట్టబోయే ఇతర కార్యక్రమాల గురించి, వీలునామా-ఎస్టేట్ ప్లానింగ్ గురించి అవగాహన ఉండాలని, కుటుంబాలలో ఇది ఒక ముఖ్యమైన పని అని చెప్పారు. టాన్ టాక్స్ ప్రెసిడెంట్ ఎన్,ఎం.ఎస్, రెడ్డి మాట్లాడుతూ ఆటా వారి సామాజికసేవ, కమ్యూనిటికి అవసరమైన పనులపట్ల వారి దృఢసంకల్పాన్ని వివరించారు. టాన్ టాక్స్ వారు తెలుగు కమ్యూనిటీలో పెరుగుతున్న అవసరాలు, అలాగే జులై లో జరిగే టాన్ టెక్స్ వారి సిల్వర్ జూబ్లీ వేడుకల సన్నాహాలను గురించి వివరించారు. ఆటా స్టాండింగ్ కమిటీ సభ్యుడు, తెలుగు కన్యూనిటీ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి ముస్కు, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కవిత ఆకుల గురించి వివరిస్తూ కవిత ఆకుల చాలా కాలంగా డల్లాస్/ఫోర్ట్ వర్త్ లోని కమ్యూనిటీకి సేవలను అందిస్తున్నారని తెలిపారు.

కవిత ఆకుల సభను ఉద్దేశించి మాట్లాడుతూ పకడ్భందీగా, గణాంక వివరాలతో వీలునామాను ఎలా తయారు చేయాలో వివరించారు. ఎస్టేట్ ప్లానింగ్, వీలునామా, జీవన సౌఖ్యం, ఎస్టేట్ తాక్సాస్ గురించి ఎంతో విలువైన సమాచారాన్ని ఆమె ఈ సందర్భంగా వివరించారు. వీలునామా వల్ల ఉపయోగాలు, లేనప్పటి నష్టాల గురించి కూడా వివరించారు. వీలునామా లేనివారు ప్రాక్టికల్ గా ఎదుర్కొనే ఇబ్బందుల గురించి, ప్రేక్షకుల నుంచి వచ్చిన ప్రశ్నలకు కవిత ఆకుల వివరంగా వారికి అర్థమయ్యే విధంగా వివరించారు.

వివిధ రకాల వీలునామాలు, ఎస్టేట్ ప్లానింగ్ పై ఒక క్తి నుండి మరో వ్యక్తికి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంటుందని ఆవిడ తెలిపారు. ఆటా డల్లాస్/ఫోర్ట్ వర్త్ రీజనల్ కొ-ఆర్డినేటర్ సురేష్ జి. రెడ్డి వోట్ ఆఫ్ థాంక్స్ చెప్పి సభను ముగించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసి ప్రేక్షకులకు ఎంతో విలువైన సమాచారాన్ని అందించిన కవిత ఆకుల, కార్యక్రమానికి విచ్చేసిన వారికి, విలువైన తమ కాలాన్ని వ్యయపరిచిన వాలంటీర్లకు, పసందైన విందును సమకూర్చిన రుచి ప్యాలెస్ ఇండియన్ క్యుసిన్ వారికి తమ ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమ స్పాన్సరర్లు ఆకుల అసోసియేట్స్, మసల వాక్, మిర్చి స్పైసెస్ కేఫ్, క్విక్ ఛాయిస్ త్రావల్స్, స్వదేశీ ప్లాజా, మీడియా పార్టనర్ లైన ఏక్ నజర్, దేశి ప్లాజా (అమెరికా), TV9 యివ మీడియా వారు ఈ కార్యక్రమాన్ని కవర్ చేసినందుకు తమ ప్రత్యెక ధన్యవాదాలు తెలిపారు.

డల్లాస్/ఫోర్ట్ ఫోర్త్ ఆటా సభ్యలు అనంత్ రెడ్డి పైజుర్, సతీష్ రెడ్డి, అజయ్ రెడ్డి, రాజ్ ఆకుల, అరవింద్ రెడ్డి ముప్పిడి, సురేష్ రెడ్డి, భాను చౌదరి, సుధీర్ గుడ, మహేంద్ర గణపురం, వెంకట్ ముస్కు, శశి కనపర్తి, రవి వెనిశెట్టి, చంద్ర బండర్. మహేష్ మెరెడ్డి, రఘువీర్ బండారు, తాన టాక్స్ సభ్యులు ఎన్.ఎం.ఎస్. రెడ్డి, డాక్టర్ ఉరిమింది రెడ్డి, పూర్ణ వేములపల్లి వారు కార్యక్రమానికి విచ్చేసిన మొదటి 25 మందికి “Will & Estate Planning Serivce’’ కూపన్లు అందించారు.

గత 25 సంవత్సరాలుగా నార్త్ అమెరికా తెలుగు కమ్యూనిటీకి సేవలందిస్తున్న అమెరికా తెలుగు అసోసియేషన్ లాభాక్ష లేని సంస్థ. ఆటా వారి గురించిన మరిన్ని వివరాలు, మరియు వారు చేపట్టే వివిధ కార్యక్రమాల గురించి తెలుసుకోవాలంటే http://www.ataworld.org

1986లో స్థాపించిన తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వారు కూడా లాభాక్ష లేని, కులమతాలకు అతీతంగా ఇక్కడి తెలుగు మాట్లాడుతున్నా వారికి వివిధ రకాలుగా సేవలను అందిస్తున్న వారి గురించి మరిన్ని వివరాలకు http://www.tantex.org వెబ్ సైట్ ను క్లిక్ చేయండి

TeluguOne For Your Business
About TeluguOne
;