RELATED EVENTS
EVENTS
జూలై లో జరిగే ఆటా వేడుకల కోసం న్యూజెర్సీ లో నిధుల సేకరణ

న్యూజెర్సి మార్చ్ 5: అమెరికా తెలుగు సంఘం (ATA) 12 వ మహాసభలు జూలై 6 , 7 , 8 తేదీలలో అట్లాంటా లో జరుగుతున్న సందర్బంగా నిధులసేకరణ లో భాగంగా ఆటా న్యూయార్క్ , న్యూజెర్సీ అధ్వర్యంలో మార్చ్ 4 న అక్బర్ రెస్టారెంట్ (న్యూజెర్సి) లో ATA ఫండ్ రైసింగ్ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బోగా పలువురు ప్రము ఖులు మట్లాడుతూ ఆటా తెలుగు సంస్కృతినీ సంప్రదాయాలనూ కాపడుతున్నదని తెలియచేసారు.ఈ కార్యక్రమానికి తెలుగు వారు అధిక సంఖ్యలో పాల్గొని భారీ విరాళాలు ఇచ్చారు.

 

 

ఈ సందర్భముగా కళాకారులు ఆటపాటలతో అతిధులను అలరించారు . వేణు సంకినని స్వాగతోపన్యాసం చేస్తు అతిథులను ఆహ్వానించారు. బోర్డ్ మెంబెర్ బల్వంత్ కొమ్మిడి మాట్లాడుతూ ఆటా మహాసభలను అట్లాంటా లో విజయవంతం చేయాలని కోరారు. ఆటా అధ్యక్షులు జిన్నా రాజేందేర్ మాట్లాడుతూ కార్యక్రమానికి విచ్చేసిన అతిధులకు, మరి కార్యక్రమ నిర్వాహనకు విశేషంగా కృషిచేసిన రీజినల్ కోఆర్డినేటర్లు ఏనుగు లక్ష్మణ్ , వేణు సంకినని , భగవాన్ పింగిలి, మధుసూదన్ రెడ్డి , రాంరెడ్డి లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమములో ఆటా కార్యవర్గ సభులు మరియు కాన్ఫరెన్స్ సెక్రటరీ పరమేష్ భీంరెడ్డి ,సుధాకర్ పెర్కారి, పరశు రామ్ రెడ్డి, కృష్ణ ద్యాప, వినోద్ కోడూర్, సురేష్ జిల్లా మరియు స్టాండింగ్ కమిటీ చైర్స్ విజయ్ కుందూర్ , రవి పట్లోల పాల్గొన్నారు. ఈ సందర్బంగా దాదాపు రెండు లక్షలా యాబై వేల డాలర్లు దాతలనుండి విరాళాలను సేకరించారు.

TeluguOne For Your Business
About TeluguOne
;