Viveka Murder Case: 40 కోట్ల డీల్‌పై సునీల్ యాదవ్‌ను ప్రశ్నించిన ఈడీ.!

Publish Date:Sep 25, 2026

Advertisement

వివేక హత్య కేసులో సునీల్ యాదవ్‌ను రెండో రోజు ఈడీ అధికారులు నాలుగు గంటల పాటు విచారించారు. హత్య కేసుతో పాటు ఆర్థిక లావాదేవీలు, కాల్స్, గూగుల్ టెక్‌అవుట్ వివరాలపై ఈడీ అధికారులు ప్రశ్న వర్షం కురిపించారు. సునీల్ యాదవ్‌తో A1 నిందితుడు ఎర్ర గంగిరెడ్డి, A3 ఉమాశంకర్ రెడ్డి మధ్య జరిగిన కాల్స్‌పై ఈడీ ఆరా తీసింది. ఉమాశంకర్ రెడ్డితో తరచూ మాట్లాడిన కాల్స్‌పై కూడా ప్రశ్నించింది. గూగుల్ టెక్‌అవుట్ వివరాలను ముందు పెట్టి సునీల్ యాదవ్‌ను ఈడీ అధికారులు విచారించారు. వివేకా హత్య జరిగిన సమయంలో తాను ఇంట్లోనే ఉన్నానని సునీల్ యాదవ్ ఈడీకి వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం.తనకు వైసీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందని కూడా సునీల్ యాదవ్ ఈడీకి వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. రూ.40 కోట్ల ఫండింగ్, హత్య, ఆర్థిక లావాదేవీలు, కాల్స్, గూగుల్ టెక్‌అవుట్ వివరాలపై ఈడీ అధికారులు సునీల్ యాదవ్‌ను ప్రశ్నించారు.

వివేకా హత్య జరిగిన సమయంలో తాను ఇంట్లోనే ఉన్నానని సునీల్ యాదవ్ ఈడీకి వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం.తనకు వైసీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందని కూడా సునీల్ యాదవ్ ఈడీకి వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. రూ.40 కోట్ల ఫండింగ్, హత్య, ఆర్థిక లావాదేవీలు, కాల్స్, గూగుల్ టెక్‌అవుట్ వివరాలపై ఈడీ అధికారులు సునీల్ యాదవ్‌ను ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  తన దర్యాప్తును అత్యంత తీవ్రతరం చేసింది. 

ఈ హైప్రొఫైల్ హత్య వెనుక భారీ ఎత్తున మనీలాండరింగ్ మరియు హవాలా లావాదేవీలు జరిగాయన్న బలమైన ఆధారాలతో రంగంలోకి దిగిన కేంద్ర దర్యాప్తు సంస్థ, ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్‌ను హైదరాబాద్‌లోని ప్రాంతీయ కార్యాలయంలో సుదీర్ఘంగా విచారించింది. హత్య జరిగిన కాలంలో చోటుచేసుకున్న అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలపై ప్రధానంగా దృష్టి సారించిన అధికారులు, సునీల్ యాదవ్‌ను వరుసగా రెండు రోజుల పాటు ఉక్కిరిబిక్కిరి చేశారు. తొలి రోజు ఏకంగా సుమారు 9 గంటల పాటు నిలదీసిన అధికారులు, ఆ తర్వాత రెండో రోజు కూడా మరో నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఈ విచారణలో భాగంగా ప్రధానంగా సుమారు రూ. 40 కోట్ల ఫండింగ్  హవాలా లావాదేవీలకు సంబంధించిన వివరాలను అధికారులు రాబట్టినట్లు సమాచారం.

వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు దారితీసిన పరిస్థితులతో పాటు, ఆ హత్యకు ముందు  ఆ తర్వాత కడప జిల్లా కేంద్రంగా జరిగిన ఆర్థిక ప్రోత్సాహం, నిధుల మళ్లింపుపై ఈడీ అధికారులు కూపీ లాగుతున్నారు. సునీల్ యాదవ్ సమర్పించిన బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్లు, డిజిటల్ ఆధారాలు, ఫోన్ కాల్ డేటాను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. హత్యకు భారీ మొత్తంలో నిధులు చేతులు మారాయన్న కోణంలో సాగుతున్న ఈ మనీలాండరింగ్ దర్యాప్తు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

 సునీల్ యాదవ్ విచారణలో వెల్లడవుతున్న కీలక విషయాలు  సాంకేతిక ఆధారాల ఆధారంగా, ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లు భావిస్తున్న మరికొందరికి కూడా త్వరలోనే ఈడీ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి వంటి ఇతర నిందితులకు కూడా ఈడీ నుంచి నోటీసులు వెళ్లడం విశేషం. ఏదేమైనా, దర్యాప్తు సంస్థల దూకుడుతో వైఎస్ వివేకా హత్య కేసులో త్వరలోనే మరిన్ని సంచలన నిజాలు వెలుగులోకి వచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

 

 

 

 

[ YS Viveka murder case, Sunil Yadav ED interrogation, Rs 40 crore hawala, money laundering probe, Vivekananda Reddy case updates, Enforcement Directorate,  Telugu One, Telugu News ]

By
en-us Political News

  
అనంతపురం జిల్లా రాప్తాడులోని పాఠశాలలో మైనర్ విద్యార్థినిపై జరిగిన ఉన్మాది దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
Nandamuri Balakrishna, Balakrishna Voting, Hindupur MLA, AP Municipal Elections, Andhra Pradesh Politics, Balakrishna Political Comments, Public Welfare, Local Body Elections, Voting Rights, TDP, Hindupur Elections, AP Election News
నిత్యం ప్రజల మధ్య ఉండే చంద్రబాబు నాయుడు 53 రోజులు నిర్బంధంలో ఉండటాన్ని తెలుగువారు జీర్ణించుకోలేకపోయారు. ఆయన ఎప్పుడు బయటకు వస్తారు? ఎలా ఉన్నారు? అనే ఆతృతతో, ఆందోళనతో  ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు.
53 Days Imprisonment Rajahmundry Central,[ CM Chandrababu Naidu, CBN Release, Three Years, TDP, Telugu Desam Party, CBN Gratitude, Gachibowli Stadium, Public Support, Telugu People, Global Telugu Community, 60 Countries, Political Arrest, Nara Bhuvaneswari, Nijam Gelavali, Andhra Pradesh Politics
విద్యార్థినికి అండగా నిలిచిన లోకేష్. గ్రీన్ ఛానల్ ద్వారా మణిపాల్ ఆస్పత్రికి.!
ఓటు వేసిన వెంటనే ఇంటికి వెళ్లాలి.!
గోపిక లక్ష్మి అనే విద్యార్థినిపై   విచక్షణారహితంగా దాడికి  పాల్పడ్డాడు.  చెట్లను కత్తిరించడానికి ఉపయోగించే  ట్రీ కట్టర్ మెషిన్ తో ఆ వ్యక్తి చేసిన దాడి అందరినీ భయాందోళనలకు గురి చేసింది. బెంబేలెత్తించింది.
అయితే, సెక్యూరిటీ నిబంధనలు,  భద్రతా  కారణాలను సాకుగా చూపుతూ షర్మిల సొంత అన్న, వైసీపీ అధినేత జగన్ యలహంక ప్యాలెస్ లో షర్మిల కుమార్తె వివాహవేడుకకు అభ్యంతరం చెప్పారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన షర్మిల అసలు యలహంక ప్యాలెస్ తన ఆస్తి అని కుండబద్దలు కొట్టారు.
పుంగనూరులో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి తనపై మొత్తం నాలుగు కేసులు నమోదు చేశారని, ఒకే ఘటనకు సంబంధించి ఇన్ని కేసులు నమోదు చేయడం చట్టవిరుద్ధమని మిథున్ రెడ్డి తన పిటిషన్ లో పేర్కొన్నారు.
పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు నిశితంగా పర్యవేక్షించాలని అధికారులను. ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ వెబ్ కాస్టింగ్   పక్కాగా ఏర్పాటు చేయాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా,   నిష్పాక్షికంగా   ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పూర్తి కావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ర్షాలు తగ్గడంతో వరద సాధారణ స్థితికి వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ చెప్పారు. ఆయన అంచనా వేసినట్లుగానే బహుదాలో వరద తగ్గుముఖం పట్టింది. నదుల్లో ప్రవాహం ఇంకా కొనసాగుతున్నందున తీర ప్రాంత, లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ కాలువలు, నదుల వద్దకు చేపల వేటకు, స్నానాలకు  వెళ్లరాదని జిల్లా కలెక్టర్ సూచించారు. 
తదుపరి పాలకమండలి సారథి(చైర్మన్) ఎవరు, సభ్యులుగా ఎవరెవరికి స్థానం దక్కుతుంది అన్న అంశంపై పెద్ద ఎత్తున ఊహాగాన సభలు జరుగుతున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు టీటీడీ పాలకమండలిపై ఏపీ సర్కార్ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. స్థానిక సమరం, కోడ్ కారణంగా ప్రకటన చేయలేదు.
పలు గ్రామాలు ఇప్పటికీ జలదిగ్బంధనంలోనే ఉన్నాయ.  రవాణా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. జాతీయ రహదారులతో పాటు అనేక ప్రాంతాల్లో రోడ్లు, రైలు మార్గాలు నీట మునిగి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.