11 - 11 -11.. ఒక్క రోజు బాగోతమేనా?

Publish Date:Feb 11, 2026

Advertisement

వైసీపీ వ్రతమూ చెడింది.. ఫలమూ దక్కలేదు!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు గురువారం(ఫిబ్రవరి 12) వైసీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. బడ్జెట్ సమావేశాలకు జగన్ 11 టీమ్ హాజరౌతుందని వైసీపీ ఆర్భాటంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ ప్రకటన మేరకు వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు 11 మంది బుధవారం (ఫిబ్రవరి 11) సభకు హాజరయ్యారు. సరిగ్గా పద కొడు నిముషాలు సభలో ఉండి.. నినాదాలు చేసి వాకౌట్ చేశారు. దీంతో టీమ్ 11 అసెంబ్లీ హాజరు కేవలం అటెండెన్స్ కోసమే అన్న విమర్శలు వెల్లువెత్తాయి. కొందరు ఆ విమర్శలు వాస్తవం కాదని చెప్పడానికైనా జగన్ అండ్ కో అంటే ఆయన, ఆయనతో పాటు 10 మంది వైసీపీ ఎమ్మెల్యేలూ కనీసం 11 నిముషాల సేపు సభలో ఉండేలాగైనా సమావేశాలకు హాజరౌతారని భావించారు. అయితే  వైసీపీకి విమర్శలు పట్టించుకునే అలవాటు లేదనీ, వారు సభకు వచ్చే అవకాశాలు దాదాపు మృగ్యమేననీ పరిశీలకులు విశ్లేషించారు. ఆ విశ్లేషణలకు అనుగుణంగానే వైసీపీ ఎమ్మెల్యేలు గురువారం (ఫిబ్రవరి 12) సభకు గైర్హాజరయ్యారు. 

ఇక అది పక్కన పెడితే ప్రతిపక్ష హోదా డిమాండ్ నుంచి వెనక్కు తగ్గి కేవలం హాజరు కోసం బుధవారం సభకు హాజరైన జగన్ కు, ఆయన పార్టీ ఎమ్మెల్యేలకూ వ్రతమూ చెడింది, ఫలమూ దక్కలేదని అంటున్నారు. ఎందుకంటే బడ్జెట్ సమావేశాల తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఆ రోజు సభా హాజరు లెక్కలోకి రాదని అసెంబ్లీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో వారు బుధవారం (ఫిబ్రవరి 11) సభకు వచ్చినా అది హాజరు కిందకు రాదు. ఇక గురువారం (ఫిబ్రవరి 12) నుంచి హాజరు లెక్కలోకి వస్తుంది. అయితే టీమ్ 11 సభకు హాజరు కాలేదు. మార్చి 7 వరకూ జరిగే ఈ సెషన్ కు ఇక వైసీపీ ఎమ్మెల్యేల హాజరు ఉండదని పరిశీలకులు అంటున్నారు. వైసీపీ వర్గాల నుంచీ అదే వినిపిస్తోంది. ఈ సారి బడ్జెట్ సమావేశాలు మార్చి 7 వరకూ దాదాపు 17 రోజుల పాటు సాగనున్నాయి. ఈ సెషన్ మొత్తానికి గైర్హాజరైతే.. 60 రోజుల గైర్హాజర్ కంప్లీట్ అవుతుంది.. శాసనసభ్యత్వం రద్దౌతుందని అంటున్నారు. గతంలోలా దొంగ చాటుగా రిజిస్టర్ లో సంతకం చేసేసి వెళ్లిపోయే అవకాశం లేకుండా డిజిటల్ హాజరు విధానం అమలులోకి వచ్చింది. దీంతో జగన్ వ్రతమూ చెడింది, ఫలమూ దక్కని పరిస్థితి ఏర్పడుతుందని పరిశీలకులు అంటున్నారు.  

అలా కాకుండా ఒక వేళ.. బుధవారం (ఫిబ్రవరి 11) వైసీపీయులు సభకు హాజరు కావడాన్ని పరిగణనలోనికి తీసుకుంటే.. మళ్లీ 60 పని దినాల వరకూ సభకు హాజరు కాకపోయినా వారిపై అనర్హత వేటు పడే అవకాశం లేదు. కానీ ఇక్కడ వైసీపీ తమ సభా బహిష్కరణకు చెప్పుకోవడానికి కారణం ఉండదు. ఎందుకంటే..  ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తానని జగన్ చేసిన శపథంపై ఆయన నిలబడలేదు. దీంతో ఇక వారి సభా బహిష్కరణ.. పలాయనం కిందకే వస్తుందని పరిశీలకులు అంటున్నారు.   

By
en-us Political News

  
వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరారు. వీరిలో కొందరు తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. అయితే, నిబంధనల ప్రకారం రాజీనామాలు సమర్పించినా.. చైర్మన్ వాటిని ఆమోదించకుండా పెండింగ్‌లో పెడుతున్నారని ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సమర్పించిన రాజీనామాను సరైన ఫార్మాట్‌లో లేదని, సహేతుక కారణాలు చూపలేదని పేర్కొంటూ చైర్మన్ తిరస్కరించడం రాజకీయంగా దుమారం రేపింది.
ఉద్యమ నేత కుమార్తె అన్న ఇమేజ్‌కు తగ్గట్లుగానే తెలంగాణ పాలిటిక్స్‌లో ఆమె ఫైటర్‌లా తన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.