బీఆర్ఎస్ బ్యాక్ టు టీఆర్ఎస్!

Publish Date:Apr 13, 2026

Advertisement

 భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) మళ్లీ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వైపు మొగ్గు చూపుతోందా? బీఆర్ఎస్ పేరును మళ్లీ టీఆర్ఎస్ గా మార్చే విషయంలో మల్లగుల్లాలు పడుతోందా? అంటే కవిత వ్యాఖ్యలను బట్టి చూస్తే ఔనన్న సమాధానమే వస్తున్నది. కల్వకుంట్ల కవిత  తాజాగా  పాత పేరుతోనే కొత్త అజెండాను ప్రకటించబోతున్నట్లు ఇచ్చిన సంకేతాలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారాయి. 

బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా..  కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది. టీఆర్ఎస్ పేరు ఇప్పుడు ఎవరికీ సొంతం కాదు, అది ఖాళీగా ఉంది అని ఆమె వ్యాఖ్యానించడంతో కవిత కొత్త పార్టీ పేరు టీఆర్ఎస్ అని దాదాపుగా ఖరారైపోయిందన్న భావన సర్వత్రా వ్యక్తం అయ్యింది.   గతంలో టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చినప్పుడు, పాత పేరు కేంద్ర ఎన్నికల సంఘం వద్ద ఫ్రీజ్ అయిందని, నిబంధనల ప్రకారం ఆ గడువు ముగిసిన తర్వాత ఎవరైనా ఆ పేరును దక్కించుకోవచ్చని కూడా కవిత చెబుతున్నారు. దీంతో ఆమె తన కొత్త పార్టీకి టీఆర్ఎస్ అని నామకరణం చేస్తారని పరిశీలకులు కూడా అంటున్నారు. 

 ఇవన్నీ పక్కన పెడితే  తెలంగాణ సెంటిమెంటుతో ముడిపడి ఉన్న టీఆర్ఎస్ ను మళ్లీ తెరమీదకు తీసుకురావడం ద్వారా.. ప్రజలను, బీఆర్ఎస్ శ్రేణులనూ తన కొత్త పార్టీ వైపు ఆకర్షించేందుకు కవిత వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులు బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. డిఫెన్స్ లో పడేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు.. పార్టీ పేరు మార్పుపై అత్యంత కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పేరు వల్ల  పార్టీకి ప్రజలతో ఉన్న అనుబంధం ఒకింత దెబ్బతిన్న మాట వాస్తవమేనన్న ఆయన.. పార్టీ క్యాడర్ కూడా తిరిగి పాత పేరే పార్టీకి పెట్టాలన్న ఒత్తిడి పెరుగుతోందన్నారు. ఇప్పుడు ఆ విషయంపై ఆలోచన జరుగుతోందనీ, బీఆర్ఎస్ బ్యాక్ టు టీఆర్ఎస్ దిశగా పార్టీ అధినేత కేసీఆర్ ఆలోచించి తుది నిర్ణయం తీసుకుంటారని కేటీఆర్ చెప్పారు.  

కేటీఆర్ వ్యాఖ్యలతో టీఆర్ఎస్ పేరు విషయంలో బీఆర్ఎస్, కవిత కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు అర్ధమౌతోంది. అన్నిటికీ మించి టీఆర్ఎస్ చుట్టూ సాగుతున్న రాజకీయం అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ పేరు కోసం పోటీలో  ఎవరు గెలుస్తారన్న ఆసక్తి కూడా సర్వత్రా వ్యక్తం అవుతోంది.  

By
en-us Political News

  
ఇటీవలి కాలంలో కాపు సామాజికవర్గం కేంద్రంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఉదహరిస్తూ.. జగన్ బోత్సనుపక్కన పెట్టడానికి అనారోగ్యం ఒక్కటే కారణం కాదని విశ్లేషిస్తున్నారు. తమ విశ్లేషణకు రుజువుగా, బీజేపీ సీనియర్ నాయకుడు సోము వీర్రాజు ఇటీవల ఒక సందర్భంలో వైసీపీలో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత తగ్గుతోందంటూ చేసిన వ్యాఖ్యలను చూపుతున్నారు. ఇక బొత్స స్థానంలో మండలిలో విపక్ష నేత పదవిని ఒక మహిళా నేతకు కట్టబెట్టాలన్న ఉద్దేశంతో జగన్ ఉన్నట్లు వైసీపీ వర్గాలలో టాక్ నడుస్తోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమై అధికారానికి దూరమవ్వడమే కాకుండా, కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోని సంగతి తెలిసిందే. అంతటి ఘోర పరాభవం ఎదురైనా జగన్ తీరులో మార్పు రాలేదన్న అసంతృప్తి వైసీపీ నేతలలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
ప్రకృతి గర్భంలో దాగి ఉన్న కొన్ని రహస్యాలు సైన్స్‌కు కూడా సవాల్ విసురుతుంటాయి.
భవిష్యత్ లో జగన్.. సపోజ్ ఫర్ సపోజ్ అధికారంలోకి వస్తే.. అమరావతిలో ప్రస్తుత ప్రభుత్వం నిర్మించిన భవనాలను వినియోగంలోకి తీసుకువచ్చే అవకాశాలు లేవని విశ్లేషిస్తున్నారు.
మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలుపుతూ ఈ సరికొత్త రాజధాని నమూనాను ఆయన తొలిసారి ప్రస్తావించినప్పుడు.. అన్ని వర్గాల నుంచీ తీవ్ర వ్యతిరేకత రావడమే కాకుండా, నెటిజనులు జనగ్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. అయినా తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్నట్లుగా జగన్ మావిగన్ ను వదల లేదు.
పెద్దిరెడ్డి కి వ్యతిరేకంగా చెవిరెడ్డి పావులు కదుపుతున్నట్లు వైసీపీలోనే ప్రచారం నడుస్తోంది. కుప్పంలో చంద్రబాబుని, హిందూపురంలో బాలకృష్ణని ఓడించడానికి అప్పట్లో పెద్దిరెడ్డి చేయని ప్రయత్నం లేదు. జగన్ ఫుల్ సపోర్ట్ ఆయనకి ఉండటంతో అప్పట్లో జిల్లా నేతల్లో ఎవరూ అయన్నివ్యతిరేకించే సాహసం చేయలేకపోయారు.
తాజాగా కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మోడీ కేబినెట్ ప్రక్షాళనలో డీకే అరుణకు మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశం ఉందని కిషన్ రెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం వైసీపీ తరపున గవర్నర్ కోటాలో నామినేట్ అయిన జకియా ఖానం, పందుల రవీంద్రబాబుల పదవీ కాలం నెల రోజుల్లో ముగియనుంది. దీనితో ఖాళీ అవుతున్న ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాలను తెలుగుదేశం కూటమి దక్కించుకోనుంది.
ఆంధ్రప్రదేశ్‌లోనే ఎన్నో ఆలయాలు నిధులు లేక, ధూపదీప నైవేద్యాలు కరవై శిథిలావస్థకు చేరుకుంటుంటే.. పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఆలయాలకు శ్రీవాణి నిధులు కేటాయించడమేంటన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. గతంలో కొండగట్టు వంటి తెలంగాణ ఆలయాలకు టిటిడి నిధులు ఇవ్వడంపై అక్కడి కొందరు మంత్రులు చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తెలంగాణ ఆలయాల అభివృద్ధికి ఏపీ నిధులు ఎందుకు కేటాయించాలంటూ సోషల్ మీడియాలో విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి.
ముఖ్యంగా తెలుగుదేశం కూటమి భాగస్వామ్య పక్షమైన జనసేన రాష్ట్రంలో మరింత బలోపేతం కావడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తోంది. ప్రణాళికా బద్ధంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే గత ఎన్నికలలో ఘోర పరాజయంతో కుదేలై ఉన్న వైసీపీని మరింత బలహీన పరిచే దిశగా వ్యూహాలు రచిస్తోంది.
పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాలు పార్టీ శ్రేణులతో పాటు.. ఆయన పార్టీకే చెందిన సొంత సామాజిక వర్గ నేతలు కూడా తీవ్ర అసంతృప్తి అసహనం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్‌లో బసవతారకం ఆస్పత్రి రజతోత్సవాలు
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కావేరి నదిపై నిర్మించ తలపెట్టిన మేకేదాటు డ్యామ్ ప్రతిపాదనను విజయ్ వ్యతిరేకించారు. తమిళనాడుకు వచ్చే నీటి ప్రవాహాన్ని నియంత్రించే ఏ ప్రాజెక్టునైనా సహించేది లేదని ఆయన శాసనసభ వేదికగా కుండబద్దలు కొట్టారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.