తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెండ్ లోకేష్.. కొత్త సవాళ్లు రెడీ

Publish Date:Apr 15, 2026

Advertisement

తెలుగుదేశం పార్టీ   చరిత్రలో ఒక కీలక అధ్యాయం మొదలైంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్‌కు పార్టీలో ప్రమోషన్ కల్పిస్తూ మరింత  ఉన్నతమైన బాధ్యతలను కట్టబెట్టారు తెలుగుదేశం అధినేత  నారా చంద్రబాబు నాయుడు.  పార్టీలో లోకేష్ పోషిస్తున్న చురుకైన పాత్రను గుర్తిస్తూ, ఆయన్ను టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మార్పు ద్వారా పార్టీలో తదుపరి తరం నాయకత్వానికి బాటలు పరిచినట్లైంది. ముఖ్యంగా యువతలో పార్టీకి ఉన్న పట్టును పెంచడంతో పాటు, క్షేత్రస్థాయిలో కేడర్‌ను మరింత బలోపేతం చేయడమే ఈ నిర్ణయం ఉద్దేశంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

వాస్తవానికి గత దశాబ్ద కాలంగా లోకేష్ చేస్తున్న పని ఇదే. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలో ఆయన విరామమెరుగని కృషి చేస్తున్నారు.  ముఖ్యంగా 2024 ఎన్నికల్లో పార్టీ ఘనవిజయం సాధించడంలో ఆయన చేపట్టిన యువగళం  పాదయాత్ర  కీలక పాత్ర పోషించిందన్నది నిస్సందేహం. దాదాపు 000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి, లక్షలాది మంది ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకున్న లోకేష్‌పై కార్యకర్తల్లో అమితమైన నమ్మకం ఏర్పడింది. ప్రస్తుతం ఆయన రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో పార్టీలోనూ ఆయన అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారు.  ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అధికారిక హోదా లభించడంతో పార్టీ బలోపేతం విషయంలో మరింత క్రియాశీలంగా వ్యవహరిస్తారు.

గతంలో  అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో  తెలుగుదేశం కేడర్ అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. అటువంటి క్లిష్ట సమయంలో పార్టీని నడిపించడంలో లోకేష్ చూపిన తెగువకు కేడర్ నీరాజనాలు పలుకుతోంది. ముఖ్యంగా పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

అదే సమయంలో లోకేష్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చంద్రబాబు నియమించడం అంటే.. మరిన్ని సవాళ్లను ఎదుర్కోవడానికి లోకేష్ ను సిద్ధం చేయడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ముఖ్యంగా ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తూ జాతీయ రాజకీయాలలో తనదైన భూమిక పోషిస్తున్న లోకేష్ ఇప్పుడు అదనంగా రాష్ట్రంలో పార్టీ వ్యవహారాలలో కూడా క్రియాశీలంగా వ్యవహరించడమే కాకుండా, పార్టీని ఏకతాటిపై నడిపించాల్సిన బాధ్యత కూడా చేపట్టాల్సి ఉంటుంది.   ఇక అనుభవం, యువత కలబోతగా చంద్రబాబు కమిటీలను నియమించారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించడం ద్వారా ఉత్తరాంధ్ర రాజకీయాల్లో పార్టీ పట్టును మరింత బలోపేతం లక్ష్యం అని చాటారు.   అలాగే..  ఎంపీ బైరెడ్డి శబరి,   రాజేష్ కిలారు వంటి వారికి కూడా ప్రధాన కార్యదర్శి హోదా ఇచ్చారు. పార్టీ  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావును కొనసాగిస్తూనే, నందమూరి బాలకృష్ణను పొలిట్‌బ్యూరోలో సభ్యుడిగా కొనసాగించడం ద్వారా  సమతూకం పాటించారు.  మొత్తంగా    పార్టీలో తాజాగా జరిగిన  మార్పులు కేవలం పదవుల పంపకం మాత్రమే కాకుండా, పార్టీ భవిష్యత్తు కోసం తీసుకున్న  నిర్ణయంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  బలమైన సామాజిక సమీకరణాలు, యువతకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా టీడీపీ తన పునాదులను మరింత పటిష్టం చేసుకుందంటున్నారు.  

By
en-us Political News

  
ఉద్యమ నేత కుమార్తె అన్న ఇమేజ్‌కు తగ్గట్లుగానే తెలంగాణ పాలిటిక్స్‌లో ఆమె ఫైటర్‌లా తన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.