పీఏసీ కోసం పెద్దిరెడ్డి నామినేషన్.. బలం లేకున్నా పోటీకి తయారు!

Publish Date:Nov 21, 2024

Advertisement

వైసీపీ అధినేత జగన్ కు స్వప్రయోజనాలు తప్ప ప్రజా క్షేమం, ప్రజా ప్రయోజనాలు ఇసుమంతైనా పట్టవని మరో మారు నిర్ద్వంద్వంగా రుజువైపోయింది. ఈ ఏడాది జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా మిగిలింది. ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా దక్కాలంటూ సభ్యుల సంఖ్యను బట్టి కనీసం 18 మంది ఎమ్మెల్యేలుగా గెలివాల్సి ఉండగా జగన్ నాయకత్వంలోని వైసీపీకి కేవలం 11 మంది మాత్రమే ఉన్నారు. దీంతో జగన్ వైసీపీ అధినేతే అయినా విపక్ష నేత హోదా లేకుండా కేవలం పులివెందుల ఎమ్మెల్యేగా మాత్రమే సభలో కూర్చోవలసి ఉంటుంది. దీంతో ఆయన విపక్ష నేత హోదా ఇస్తేనే సభకు వస్తానంటూ అసెంబ్లీని బాయ్ కాట్ చేశారు. తన ఒక్కడికే ఆ బహిష్కరణను పరిమితం చేయకుండా మొత్తం వైసీపీ సభ్యులందరినీ సభకు హాజరు కాకుండా ఆపేశారు.  

అయితే ఇప్పుడు పబ్లిక్ అక్కౌంట్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్ ఎన్నిక  ప్రక్రియ మొదలు కావడంతో వైసీపీ ఆలోచనలో మార్పు వచ్చింది. పీఏసీ చైర్మన్ కు కేబినెట్ హోదా ఉంటుంది. ఆ హోదాతో పాటు వచ్చే సౌకర్యాలూ అందుతాయి. దీంతో  వైసీపీ ఆ పదవిపై కన్నేసింది. సాధారణంగా ప్రతిపక్ష  ఎమ్మెల్యేను పీఏసీగా చేయడం సాంప్రదాయం. అయితే ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షం అనేదే లేదు. దీంతో సాంప్రదాయం ప్రకారం ప్రతిపక్ష సభ్యుడికి పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడమనే ప్రశ్నే తలెత్తదు. కానీ కేబినెట్ ర్యాంక్ కోసం తహతహలాడిపోతున్న జగన్, ఆయన పార్టీ.. ఇప్పుడీ పీఏసీ చైర్మన్ పదవి కోసం అర్రులు చాస్తోంది. ఈ పదవికి నామినేషన్ వేయడానికి రెడీ అయిపోయింది. ఆ పదవి కోసం మాజీ మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ వేశారు. అయితే పీఏసీ సభ్యుడిగా ఎన్నిక కావాలంటే కనీసం 18 మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి. కానీ వైసీపీకి ఆ బలం లేదు. బలం లేకపోయినా వైసీపీ బరిలోకి దిగడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది.

నిబంధనల మేరకు పీఏసీలో మొత్తం 12 మంది సభ్యులలో తొమ్మండుగురు అసెంబ్లీ నుంచీ, ముగ్గురు శాసనమండలి నుంచి ఎన్నికౌతారు. అయితే పీఏసీ చైర్మన్ను మాత్రం ఎమ్మెల్యేల నుంచే ఎన్నుకుంటారు. గత అసెంబ్లీలో తెలుగుదేశం కు ప్రతిపక్ష హోదా ఉంది కనుక పయ్యావుల కేశవ్ కు అప్పుడు పీఏసీ చైర్మన్ పదవి దక్కింది. అయితే ఇప్పుడా పరిస్థితి లేదు. అసెంబ్లీ నుంచి పీఏసీకి వైసీపీ నుంచి ఒక్కరు కూడా ఎన్నికయ్యే అవకాశం లేదు. అయినా తగుదునమ్మా అంటూ పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి చేత నామినేషన్ వేయించడానికి వైసీపీ అధినేత జగన్ తయారైపోయారు. అయితే కేబినెట్ హోదా కోసం వేస్తున్న నామినేషన్ ఆయనే స్వయంగా వేస్తే సరిపోయేదిగా అని తెలుగుదేశం వర్గీయులు ఎగతాళి చేస్తున్నారు.   

By
en-us Political News

  
దీంతో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ ముఖ్యమంత్రి విజయ్ కావేరి వివాదంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. కావేరి జలాలు తమిళనాడుకు అత్యంత కీలకమనీ, ఇతర రాష్ట్రాల వ్యూహాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఏకాభిప్రాయ సాధన అవసరమని అన్నారు.
జగన్‌లో మార్పు వుంటుందా, వుండదా అన్న అయోమయంలో వైసీపీ నేతలు.. ఆయనలో మార్పు వుండదన్న నిశ్చయానికి వచ్చేస్తున్నారు.
రాజకీయాల్లో విజయం అనేది కేవలం నాయకుల ఉపన్యాసాల వల్ల మాత్రమే సాధ్యం కాదు. అధికారం, రాజకీయ వేధింపులు, ఆంక్షలు ఎన్ని ఎదురైనా వెరవక
అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పరిధిలో దాదాపు రూ. 7.5 కోట్ల విరాళాల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలపై పార్లమెంట్‌ ద్వారం వద్ద స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ కాషాయ వస్త్రాలు ధరించి, పూజారి వేషంలో ఒక పెద్ద హుండీతో కూర్చుని సేకరించిన విరాళాలను జేబులో వేసుకుంటూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు.
నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే విశాఖను గ్లోబల్ ఐటీ, ఇండస్ట్రియల్ హబ్‌గా మార్చాలనే ఆలోచనతో ఈ భోగాపురం ప్రాజెక్టుకు చంద్రబాబు బీజం వేశారనీ, అయితే.. కాలక్రమంలో ప్రభుత్వాలు మారాయి, ప్రాజెక్టు ప్రతిపాదనలు మడతపడ్డాయన్నారు.
సిదిరి అప్పలరాజు కుమారుడు బైక్ నిర్లక్ష్యంగా నడిపి ఒకరి మృతికి కారణమయ్యారన్న కేసు దర్యాప్తులో వెలుగు చూసిన అంశాల మేరకు ఇందులో ఎలాంటి రాజకీయ కుట్రలు లేవు. సీదిరి అప్పలరాజు చేసిన అతే.. ఆయనను చట్టపరంగా ఇబ్బందుల్లోకి నెట్టింది.
ఎప్పుడో ఓ సారి జైల్లో ఉన్న నేతకు పరామర్శ పేరుతో బయటకు వచ్చే సందర్భాలలో కూడా సదరు నేతను పరామర్శించడం కంటే.. బల ప్రదర్శనకు, తనకు జనం మద్దతు ఉందని నిరూపించుకునే ప్రదర్శనలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయన అలా బయటకు వచ్చిన ప్రతి సారీ అభాసుపాలౌతూనే ఉన్నారు.
ఢిల్లీ వీధుల్లో రగిలిన ఆగ్రహ జ్వాలలు, పోలీసుల లాఠీఛార్జీలు, కన్నీటి ధారలు, నిర్బంధాలను సైతం లెక్కచేయక హక్కుల కోసం వీధిపోరాటానికి దిగిన యువత ఆక్రందనలు
రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ అమూల్యమైన భూములను ఇవ్వద్దు, భోగాపురం విమానాశ్రయాన్ని అందరం కలిసి అడ్డుకుందాం" అంటూ జగన్ ఇచ్చిన పిలుపుల ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతూ భోగాపురం విషయంలో జగన్ ద్వంద్వ వైఖరిని ఎండగడుతున్నాయి.
తెలుగుదేశం కూమిటికి ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. చంద్రబాబు నాయకత్వంలో కూటమి సర్కార్ సంక్షేమ, అభివృద్ధిని సమాంతరంగా పరుగులు పెట్టిస్తున్నప్పటికీ ఆ స్థాయిలో ప్రజాదరణ పెరగడం అటుంచి.. క్షేత్రస్థాయిలో కూటమి పాలన పట్ల ఒకింత అసంతృప్తి పె రిగిందని సర్వే స్పష్టం చేయడమే.
మొత్తంగా విద్యార్థులు, యువతఉద్యమం.. ఒక స్పష్టమైన సందేశాన్ని అయితేనిస్సందేహంగా ఇచ్చింది. అన్యాయాన్ని ప్రశ్నించడంలో, హక్కుల కోసం పోరాడటంలో , న్యాయం కోసం నినదించడంలో వెనకడుగు వేసే ప్రశ్నేలేదని చాటింది.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కర్నూలు జిల్లా ఆదోని పట్టణ, మండల టీడీపీ నేతలు పని చేయాలని
నీట్ పేపర్ లీక్ ఆందోళనలతో దిల్లీ వీధులను ఊపేసిన బొద్దింకలు ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద రైతు నాయకుడు రాకేష్ తికాయత్‌ను కలిసి సంఘీభావం ప్రకటించాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.