కోర్టులు ఎవరి పక్షం? కులమేలా? కుతంత్రమేలా?
Publish Date:Apr 9, 2021
.jpg)
Advertisement
సుప్రీంకోర్టు జస్టిస్ రమణపైనా పక్షపాత ముద్ర వేసిన ఘనుడు జగన్మోహనుడు. చంద్రబాబుకు అనుకూలమంటూ.. ఓకే కులమంటూ.. కోర్టులను మేనేజ్ చేస్తున్నారంటూ.. ఇలా నోటికొచ్చిన అబాంఢాలు వేశారు. హైకోర్టు తీర్పులు చంద్రబాబుకు ఫేవర్‌గా వస్తున్నాయంటూ వక్రీకరించారు. న్యాయం ఎటువైపు ఉంటే.. న్యాయ దేవత తరాజు అటువైపు మొగ్గుతుంది. అంతేకానీ, కులాన్ని చూసో, చంద్రబాబును చూసో.. తీర్పులు తయారవవు. హైకోర్టు, సుప్రీంకోర్టు, సింగిల్ జడ్జి, డివిజన్ బెంచ్, ధర్మాసనం ఇలా అందరినీ, అన్నిటినీ మేనేజ్ చేయగల సత్తా భారతదేశంలో ఎవరికీ లేదు. అదే మన న్యాయ వ్యవస్థ గొప్పతనం. ఇంత తెలిసీ, చంద్రబాబుకు కోర్టులు, జడ్జీలు అనుకూలమంటూ అపవాదు మోపడం జగన్‌రెడ్డికే చెల్లిందనే విమర్శలు ఉన్నాయి.
బట్ట కాల్చి మీద వేయడమే వైసీపీ పని. చంద్రబాబు తనకు అనుకూలమైన వారిని, కమ్మ కులస్తులను న్యాయవ్యవస్థలో చొప్పించి, కోర్టుల్ని ప్రభావితం చేసాడు, చేస్తుంటాడు అనేది వైసీపీ ఆరోపణ. ఒకటికి పదిసార్లు ఇదే మాట అంటే.. అది నిజమై పోతుందనే కుతంత్రం. అందుకే, వైసీపీ నేతల నోటి నుంచి, ఆ పార్టీ మీడియా నుంచి నిత్యం ఇలాంటి కామెంట్లో వస్తుంటాయి. చంద్రబాబుకు, కోర్టులకు, జడ్జిలకు అక్రమ సంబంధం అంటగట్టే దుర్నీతి ఏళ్లుగా సాగుతోంది. చంద్రబాబును, కమ్మ కులాన్ని దోషులుగా చూపించే కుట్ర జరుగుతోంది. ఏకంగా న్యాయవ్యవస్థకే కులగజ్జిని అంటగట్టే కుత్రంతం నడుస్తోంది.
పేర్లు, లెక్కలు ఒకలా ఉంటే.. విషప్రచారం మరోలా ఉంది. ఉమ్మడి ఏపీ హైకోర్టు ఏర్పడిన నాటి నుంచి 1985 వరకూ తెలుగువారే ఎక్కువగా ప్రధాన న్యాయమూర్తులుగా ఉన్నారు. 1985 తర్వాత ఇంతవరకూ ఏపీ హైకోర్టుకు తెలుగువ్యక్తి చీఫ్ జస్టిస్ అవనేలేదు. 1985కు ముందు మొత్తం 17మంది చీఫ్ జస్టిస్‌లుగా ఉంటే అందులో ఐదుగురు రెడ్డి కులస్తులు. అంటే ప్రతి ముగ్గురు చీఫ్ జస్టిసుల్లో ఒకరు రెడ్డి. ఈ ఐదుగురూ గొప్ప న్యాయకోవిదులు. రాజ్యాంగ నిపుణులు, చరిత్రాత్మక తీర్పులు వెలువరించినవారే. ఆ ఐదుగురు చీఫ్ జస్టిసులుగా నియమితులైన కాలంలోనే రాష్ట్రానికి ఐదుగురు రెడ్లు ముఖ్యమంత్రులుగా పని చేశారు. మరి, వారిపై ఆనాడు ఎవరూ రెడ్డి పక్షపాత ముద్ర వేయలేదే. వారందరినీ న్యాయమూర్తులుగా మాత్రమే చూశారు కానీ రెడ్డి జడ్జిలుగా చూడలేదు. అయితే, చంద్రబాబు హయాం వచ్చే సరికి న్యాయవ్యవస్థకు కుల ముద్ర ఆపాదించే హీన సంస్కృతి తెరమీదకు వచ్చింది.
హైకోర్టుకు ఇప్పటివరకూ 177మంది జడ్జీలు నియమితులయ్యారు. ఇందులో 32 మంది రెడ్లే. ఇందులో పది మంది రెడ్డి న్యాయమూర్తులు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నియమించబడిన వారే. ముఖ్యమంత్రిగా చంద్రబాబు కమ్మవారిని చొప్పించాడు అనేది నిజమైతే, అంతకు ముందున్న రెడ్డి సీఎంలు ఇంత మంది రెడ్డి జడ్జిలను చొప్పించారని ఎవరైనా అనగలరా? అది తప్పు కానప్పుడు.. ఇది తప్పెలా అవుతుంది? అయినా, న్యాయమూర్తులకు కులం ఆపాదించడమేంటి? సీనియారిటీ, కొలిజియం లాంటి పద్దతుల్లో హైకోర్టు జడ్జిల నియామకం ఒక పద్దతి ప్రకారం జరుగుతుంటుంది. ఎవరో చెబితే, ఎవరో ఇరికిస్తే.. జడ్జిల నియామకం జరిగే అవకాశమే లేదు. న్యాయమూర్తి పక్షపాత పూర్వకంగా తీర్పులు ఇవ్వడానికి లేదు. చట్టాలు, న్యాయ సూత్రాలు, సెక్షన్లు, సాక్షుల ప్రకారమే జడ్జిమెంట్ ఉంటుంది. అంతేకాని తమ వారే కదాని తోచిన విధంగా తీర్పు ఇవ్వడం కుదరదు. ఒకవేళ ఆ జడ్జి ఇచ్చిన తీర్పు సరిగా లేదనుకుంటే, అప్పీల్‌కు వెళ్లొచ్చు. డివిజన్ బెంచ్, సుప్రీంకోర్టు ఇలా ఇంకా అనేక స్థాయిలు ఉన్నాయి. అన్నిటినీ మేనేజ్ చేయడం ఇంపాజిబుల్. ఇంత చిన్న లాజిక్ మరిచి.. చంద్రబాబు, కమ్మ కులం అంటూ వైసీపీ నేతలు నోటికొచ్చినట్టు కూతలు కూస్తుంటారు. ఆఖరికి, సుప్రీంకోర్టు జస్టిస్ ఎన్వీ రమణపైనా ఫిర్యాదు చేయడం జగన్‌రెడ్డి దిగజారుడు తనానికి నిదర్శనం అంటున్నారు. నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్నట్టు ఉంది వైసీపీ తీరు ఉందంటున్నారు.
http://www.teluguone.com/news/content/ycp-dirty-game-on-judiciary-and-chandrbabu-on-judges-issue-39-113418.html












