Publish Date:Mar 27, 2025
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం విషయంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో స్వల్ప ఊరట కలిగించింది. మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డిపై ఏప్రిల్ 3వ తేదీ వరకూ ఎటువంటి చర్యలూ తీసుకోవద్దని సీఐడీకి ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ ససింది.
Publish Date:Mar 27, 2025
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుస సంచలన నిర్ణయాలతో ప్రపంచ దేశాలకు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా రెండో సారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ అమెరికా ఫస్ట్ అంటూ వరుస ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లతో ప్రపంచ దేశాలకు షాక్ లు ఇస్తూనే ఉన్నారు.
Publish Date:Mar 27, 2025
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అప్రమత్తమైన పైలెట్ వెంటనే విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.
Publish Date:Mar 27, 2025
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. గురువారం (మార్చి 27) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ ఏటీసీ వరకూ సాగింది.
Publish Date:Mar 26, 2025
ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలో బుధవారం ఘోర విషాదం సంభవించింది. పట్టణంలో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలి ఆరుగురు కూలీలు మృత్యువాత పడ్డారు. భద్రాచలం పట్టణంలోని సూపర్ బజార్ సెంటర్ లో నిర్మాణంలో ఉన్న ఆరంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది.
Publish Date:Mar 26, 2025
బెట్టింగ్ యాప్ లపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఐపిఎస్ అధికారి , ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఈ యాప్స్ పై ఉక్కుపాదం మోపారు. యాంకర్ , ఇన్ ప్లూయెర్స్ పై కేసులు నమోదు చేస్తున్న పోలీసులకు తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీలో బాసటగా నిలిచారు.
Publish Date:Mar 26, 2025
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మార్చి 3వ వారంలోనే తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు మించి నమోదౌతున్నాయి. ఎండకు తోడు వడగాల్పులు జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
Publish Date:Mar 26, 2025
గన్నవరం తెలుగుదేశం కార్యాలయం దగ్థం కేసులో వల్లభనేని వంశీ పూర్తిగా ఇరుక్కున్నట్లే. ఇప్పటికే గన్నవరం తెలుగుదేశం కార్యాలయం దగ్ధం కేసులో ఫిర్యాదు దారుడిని కిడ్నాప్ చేసి బెదరించిన కేసులో అరెస్టై రిమాండ్ ఖైదీగా విజయవాడ జిల్లా జైలులో ఉన్న వంశీ ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశాలు అంతంత మాత్రమేనని అంటున్నారు.
Publish Date:Mar 26, 2025
బిఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పై నల్లొండ జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయి. స్థానిక కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు నల్గొండ జిల్లా కకిరేకల్ పోలీసు స్టేషన్ లో కేటీఆర్ పై రెండు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. కేటీఆర్ తో పాటుగా బీఆర్ఎస్ సోషల్‌మీడియా యాక్టివిస్టులు మన్నె క్రిశాంక్, కొణతం దిలీప్‌పై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు.
Publish Date:Mar 26, 2025
వైసీపీ సీనియర్ నాయకుడు, పుంగనూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆస్పత్రి పాలయ్యారు.
Publish Date:Mar 26, 2025
హైద్రాబాద్ సరూర్ నగర్ కు చెందిన అప్సర అనే యువతిని 2033 జూన్ 3న హత్య చేసిన పూజారీ సాయికృష్ణకు రంగా రెడ్డి కోర్టు సంచలన తీర్పు నిచ్చింది.
Publish Date:Mar 26, 2025
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి భవిష్యత్ ను దర్శించడంలో దిట్ట. ఆయన ఏం చేసినా తరతరాలు నిలబడిపోయేలా ఉంటుంది. సంక్షేమ పథకాలైనా, అభివృద్ధి కార్యక్రమాలైనా అంతే. ఆయన ఒక ట్రెండ్ సృష్టిస్తారు. ముందు విమర్శలు చేసిన వారు కూడా తరువాత ప్రశంసలు గుప్పించేలా ఆయన కార్యక్రమాలు ఉంటాయి. కార్యాచరణ ఉంటుంది.
Publish Date:Mar 26, 2025
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఫార్మ్ డి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం ఘటన తీవ్ర సంచలనం రేకెత్తించింది. రాజమహేంద్రవరంలోని బొల్లినేని ఆస్పత్రిలో క్లినికల్ ట్రయల్ విభాగంలో పని చేస్తున్న అంజలి అనే ఫార్మసీ విద్యార్థిని బలవన్మరణానికి ప్రయత్నించడం సంచలనం రేపింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.