అసలు నరాల సమస్యలు ఎందుకు వస్తాయ్..  రాకూడదంటే ఏం చేయాలి?

Publish Date:Oct 25, 2025

Advertisement

ప్రస్తుతకాలంలో చాలామందిలో న్యూరోపతి సమస్య కనిపిస్తోంది. శరీరంలోని నరాలు బలహీనంగా మారడం, శరీరంలో పట్టు తగ్గడం, కాళ్లూ చేతులు మొదలైన ప్రాంతాలలో చీమలు పాకినట్టు అనుభూతి కలగడం, చేతులు వనకడం ఇలా చాలా లక్షణాలు న్యూరోపతి సమస్యలో కనిపిస్తాయి. ఈ న్యూరోపతి సమస్యను మొదట్లోనే గుర్తించి దాన్ని పరిష్కరించడం ఎంతో అవసరం. లేకపోతే ఇది మొత్తం శరీరం మీద చాలా దారుణమైన ప్రభావం చూపిస్తుంది. అయితే అసలు ఈ న్యూరోపతి సమస్య ఎందుకు వస్తుంది? ఇది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

న్యూరోపతి ఎందుకు వస్తుంది?

శరీరంలో ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా ఉత్పత్తి అయితే అది న్యూరోపతి సమస్యకు దారితీస్తుంది. జంక్ ఫుడ్,  నూడిల్స్, బర్గర్లు, పిజ్జా, బేకింగ్ ఆహారాలు, చక్కెర అధకంగా ఉన్న ఆహారాలు తింటుంటే న్యూరోపతి సమస్య వచ్చే  అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ప్రతి ఒక్కరూ ఆహారం తిన్న ప్రతిసారి లేదా అనారోగ్యం చేసినప్పుడు, శరీరంలో నొప్పులు, వాపులు వంటివి సంభవించినప్పుడు శరీరంలో ఫ్రీరాడికల్స్  తయారవుతాయి. ఇవి శరీరానికి హాని కలిగిస్తాయి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఆహారం తిన్న తరువాత శరీరంలో రెండు రకాల అణువులు ఏర్పడతాయి. వాటిలో ఒకటి  ఫ్రీరాడికల్స్ కాగా.. రెండవది యాంటీ ఆక్సిడెంట్లు. కానీ ఆహారం తిన్న తరువాత ఫ్రీరాడికల్స్ ఎక్కువగా ఏర్పడినా,  అవి యాంటీఆక్సిడెంట్లను కూడా డామినేట్ చేసినా ఫ్రీరాడికల్స్ ప్రభావం శరీరం మీద ఎక్కువ ఉంటుంది.  సాధారంగా వచ్చే దగ్గు, జలుబు, ఫ్లూ వంటి సమస్యలు ఈ ఫ్రీ రాడికల్స్ వల్లే వస్తాయి. ఆహారం విషయంలో మార్పులు చేసుకోకపోతే ఇది క్రమంగా న్యూరోపతి సమస్యకు దారితీస్తుంది.

న్యూరోపతి సమస్య రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే..

న్యూరోపతీ సమస్య రాకుండా ఉండాలంటే  ప్రతి రోజూ కనీసం 1 గంట శారరీక శ్రమ అవసరం. ఇందులో చురుకైన నడక, యోగా, వ్యాయామం, ఇతర పనులు కూడా ఉండవచ్చు. వీటి వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది.

యాంటీఆక్సిడెంట్ల కంటే శరీరంలో ఫ్రీ రాడికల్స్ ఎక్కువ ఉండటం వల్ల నరాల సమస్య వస్తుంది కాబట్టి దీన్ని అరికట్టడానికి  యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, ఆకుపచ్చ ఆకుకూరలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్న ఇతర ఆహారాలు తీసుకోవాలి.  సాధారణంగా న్యూరోపతి సమస్య ఉందని అనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వీలైంత తొందరగా న్యూరోపతీ వైద్యుడిని కలవడం ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.

                                              *నిశ్శబ్ద.


గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

By
en-us Political News

  
రోజంతా అలసటగా, నీరసంగా అనిపిస్తుందా? ఎంత విశ్రాంతి తీసుకున్నా శరీరంలో శక్తి లేకపోతే, అది కేవలం సాధారణ అలసట మాత్రమే కాకుండా Chronic Fatigue Syndrome (CFS) అనే ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు.
టి కాలంలో రోజులో మూడు పూటలా ఆహారం తీసుకోవడం కామన్.  ఉదయం టిఫిన్, మద్యాహ్నం భోజనం, రాత్రి భోజనం తప్పకుండా చేస్తారు.
మధుమేహం అనేది వేగంగా పెరుగుతున్న ఒక  వ్యాధి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, భారతదేశంలో మధుమేహ రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
కొందరికి కాలివేళ్లు , చేతివేళ్ల కీళ్లలో నొప్పి, మోకాళ్లు , చీలమండలలో వాపు, , నడవడంలో ఇబ్బంది వంటివి ఎదురవుతుంటాయి.  ఇవి యూరిక్ యాసిడ్ పెరగడానికి సంకేతాలు కావచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
మినుముల పులగం అనేది మన సంప్రదాయ ఆహారాల్లో ఎంతో విలువైనది. ఇది శరీరానికి అవసరమైన ప్రోటీన్, బలం, శక్తిని అందించే సహజమైన ఆహారం.
వర్షాకాలం వేడి నుండి ఉపశమనం కలిగించినప్పటికీ, వర్షం, నీరు నిలవడం, వరదలు వంటివి  వివిధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి.
రుమటాయిడ్ ఆర్థరైటిస్ (Rheumatoid Arthritis) అనేది పెద్దవారికే వచ్చే వ్యాధి అని చాలామంది అనుకుంటారు. కానీ ఈ సమస్య పిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఉంది.
ధూమపానం ఆరోగ్యానికి హానికరం.  ఈ విషయాన్ని పేపర్ లు,  టీవీ యాడ్స్ మాత్రమే కాకుండా ఏకంగా  సిగరెట్ ప్యాకెట్ ల పైన కూడా రాసి ఉంటుంది. ఇలా ఎవరు ఎంత చెప్పినా సరే..
గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, కడుపు ఉబ్బరం సమస్యలకు ఇంట్లోనే వాము, ధనియాలు, జీలకర్ర, సోంపుతో ఆయుర్వేద చూర్ణం ఎలా తయారు చేయాలో డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ వివరించిన పూర్తి వీడియో.
మోకాళ్ల నొప్పి ప్రస్తుతం అన్ని వయస్సుల వారిలో కనిపిస్తున్న సాధారణ సమస్యగా మారింది. మెట్లు ఎక్కడం, నడవడం, ఎక్కువసేపు నిలబడటం వంటి రోజువారీ పనులు కూడా కష్టంగా అనిపిస్తాయి. ఈ వీడియోలో యోగా ఆచార్య ధాకారం గారు మోకాళ్ల నొప్పిని తగ్గించడంలో సహాయపడే ...
గాలి కాలుష్యం, ఆహార కాలుష్యం, నీటి కాలుష్యం.. ఇలా ప్రతిదీ కాలుష్యం కోరల్లో చిక్కుకుని ఉన్నాయి.  బయటకు వెళ్లినప్పుడు వాహనాల పొగతో పాటు ఎన్నో కారణాల వల్ల గాలి కాలుష్యం అవుతుంది.
రోజుకు కేవలం 5 నిమిషాలు ఉద్గీత ప్రాణాయామం చేస్తే శరీరం, మనసుకు కలిగే ప్రయోజనాలు ఏమిటి? సరైన విధానం, శాస్త్రీయ ప్రయోజనాలు, ఎవరు చేయాలి? ఎవరు చేయకూడదు? అనే వివరాలను సీనియర్ యోగా థెరపిస్ట్ శ్రీమతి శ్రావంతి రఘు ఈ వీడియోలో వివరించారు.
Black Spots on Onions,Are They Safe to Eat,Black Mold on Onions,What Black Spots on Onions Really Mean
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.