యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటే పప్పు ధాన్యాలు తినకూడదా..!

Publish Date:Jul 22, 2026

Advertisement

యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటే పప్పు ధాన్యాలు తినకూడదా..!

కొందరికి కాలివేళ్లు , చేతివేళ్ల కీళ్లలో నొప్పి, మోకాళ్లు , చీలమండలలో వాపు, , నడవడంలో ఇబ్బంది వంటివి ఎదురవుతుంటాయి.  ఇవి యూరిక్ యాసిడ్ పెరగడానికి సంకేతాలు కావచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. యూరిక్ యాసిడ్ అనేది మన శరీరంలో సహజంగా ఉత్పత్తి అయ్యే ఒక వ్యర్థ పదార్థం. శరీరం ప్యూరిన్స్ అనే పదార్థాలను విచ్ఛిన్నం చేసినప్పుడు యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. సాధారణ పరిస్థితులలో, మూత్రపిండాలు దీనిని వడపోసి మూత్రం ద్వారా విసర్జిస్తాయి. అయితే, శరీరం దీనిని అధిక మొత్తంలో ఉత్పత్తి చేసినప్పుడు లేదా మూత్రపిండాలు దీనిని సరిగ్గా విసర్జించలేనప్పుడు, ఇది రక్తంలో పేరుకుపోవడం మొదలవుతుంది. శరీరంలో  యూరిక్ యాసిడ్ అధికంగా ఉంటే అనేక రకాల సమస్యలకు దారితీయవచ్చు. క్రమంగా, దాని స్ఫటికాలు కీళ్లలో పేరుకుపోయి, నొప్పి, వాపు , గౌట్ వంటి సమస్యలను కలిగిస్తాయి. సాధారణంగా యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగితే, పప్పుధాన్యాలు తినడం మానేయాలని  కొందరు చెబుతూ ఉంటారు. అసలు యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగితే పప్పు ధాన్యాలు తినడం మానేయాలా? యారిక్ యాసిడ్ స్థాయిలు తగ్గించుకోవడానికి ఏం చేయాలి?  తెలుసుకుంటే..

యూరిక్ యాసిడ్ ఎలా పెరుగుతుంది?

 ఆహారపు అలవాట్లు ఆరోగ్యకరంగా లేకపోవడం,  బరువు పెరగడం, శారీరక శ్రమ తగ్గడం వల్ల యూరిక్ యాసిడ్ సమస్య గణనీయంగా పెరిగిందని వైద్యులు చెబుతున్నారు. గతంలో వృద్ధులకు వచ్చే వ్యాధిగా భావించిన ఈ సమస్య, ఇప్పుడు 30 ఏళ్లలోపు యువతలో కూడా బయటపడుతోంది. . కిడ్నీ వ్యాధులు,  డయాబెటిస్ మందులు,  మెటబాలిక్ సిండ్రోమ్,  కొన్ని రకాల మందులు కూడా ఈ ప్రమాదాన్ని పెంచుతాయి.

యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు పప్పు ధాన్యాలు తినకూడదా?

 యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువగా ఉంటే పప్పుధాన్యాలు తినడం మానుకోవాలా అని చాలామంది గందరగోళానికి గురవుతుంటారు. కానీ పూర్తీగా మానేయడం అవసరం లేదని ఆహార నిపుణులు చెబుతున్నారు.

 యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పటికీ,  పప్పుధాన్యాలు తినడం ఆపాల్సిన అవసరం లేదు.  సరైన పప్పుధాన్యాలను ఎంచుకుని, వాటి పరిమాణం విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుందట. ఇది  యూరిక్ యాసిడ్ స్థాయిపై కూడా ఆధారపడి ఉంటుందట. 8 కంటే ఎక్కువ యూరిక్ యాసిడ ఉంటే, తక్కువ ప్యూరిన్ ఉన్న పప్పు ధాన్యాలు తినడం మంచిది.

పప్పుధాన్యాలు ప్రోటీన్, ఫైబర్ తో పాటు అనేక ముఖ్యమైన పోషకాలకు మంచి వనరు. పచ్చ పెసలు యూరిక్ యాసిడ్  ఉన్నవారికి చాలామంచివి.   అవి పోషకాలను అందించి, యూరిక్ యాసిడ్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.  వారానికి 3-4 సార్లు పెసరపప్పు, ఎర్ర కందిపప్పు తినడం ఆరోగ్యానికి మంచిది.

యూరిక్ యాసిడ్ ఉన్నవారు ఏవి తినకూడదు?

యూరిక్ యాసిడ్ అధికంగా ఉంటే, సముద్రపు ఆహారం, ఎర్ర మాంసం , మద్యం మొదలైనవి మానేయాలి.
 
తీపి పానీయాలు, అధిక ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ కలిగిన పానీయాలు , అధిక చక్కెర వినియోగాన్ని తగ్గించుకోవాలి.

తగినంత నీరు త్రాగడం, సమతుల్య ఆహారం తీసుకోవడం మరింత ప్రయోజనకరం.

 

                                   *రూపశ్రీ.


 

By
en-us Political News

  
గుడ్లు పోషకాహారం యొక్క పవర్హౌస్.  ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, అవసరమైన విటమిన్లు గుడ్డులో పుష్కలంగా ఉంటాయి.
కాళ్లు, చేతులు తిమ్మిరిగా అనిపించడం, జలదరింపు రావడం చాలామందికి అప్పుడప్పుడు ఎదురయ్యే సమస్య. ఎక్కువసేపు ఒకే పొజిషన్‌లో కూర్చోవడం లేదా నరాలపై ఒత్తిడి పడటం వల్ల తాత్కాలికంగా తిమ్మిర్లు రావచ్చు.
స్ట్రెస్, ఆందోళన, బీపీ వంటి సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. రోజువారీ జీవితంలో ఒత్తిడి పెరగడంతో మనసుతో పాటు శరీరంపై కూడా ప్రభావం పడుతుంది. ఇలాంటి సమయంలో శ్వాసపై దృష్టి పెట్టే ప్రాణాయామాలు కొంతమందికి రిలాక్సేషన్‌కు సహాయపడవచ్చు.
మన శరీరం సరిగ్గా పనిచేయడానికి అవసరమైన ముఖ్యమైన ఖనిజాల్లో పొటాషియం (Potassium) ఒకటి. శరీరంలో పొటాషియం స్థాయి సరైన మోతాదులో ఉండటం చాలా ముఖ్యం.
సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని అంటారు. కంటి ఆరోగ్యం మెరుగ్గా ఉంటే జీవితం చాలా వరకు దిగులు లేకుండా ఉంటుంది.   కంటికి ఏదైనా సమస్య వస్తే.. దాని ప్రభావం జీవితం మీద చాలా ప్రస్పుటంగా కనిపిస్తుంది.
కాల్షియం, ఐరన్ లోపం ఉందా? పాలు, పాల ఉత్పత్తుల విషయంలో కల్తీపై ఆందోళన ఉందా? అయితే మన ఇంట్లోనే సులభంగా లభించే ఒక ఆకుకూర మీ ఆహారంలో మంచి పోషక వనరుగా ఉపయోగపడవచ్చు.
ఐస్ క్రీమ్.. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టంగా తింటారు. చాలామంది వర్షాకాలంలో కూడా ఐస్ క్రీమ్ తింటే ఆ కిక్కే వేరు అంటారు.  కాలం ఏదైనా ఐస్ క్రీమ్ పట్ల చాలా ఇష్టం ఉంటుంది.
చండీపురా వైరస్ (Chandipura Virus) ప్రస్తుతం ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్న వైరస్‌లలో ఒకటి. ముఖ్యంగా 15 సంవత్సరాల లోపు పిల్లల్లో ఈ వైరస్ తీవ్రమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. వర్షాకాలంలో దీని ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది.
మనిషి  మెదడు చాలా శక్తివంతమైనది.  మనిషి మనుగడ సాగుతున్నది మెదడు పనితీరు మీదనే.. మెదడు ఎంత ఆరోగ్యంగా ఉంటే మనిషి జీవితం అంత బాగుంటుంది.
మధుమేహం అనేది ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఒక ఆరోగ్య సమస్య, ఇది అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తుంది. జీన్స్ ప్రభావం, ఊబకాయం , జీవనశైలిలో మార్పులు వంటి కొన్ని ప్రమాద కారకాలు ఈ వ్యాధి వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి.
అవిసె గింజలు (Flax Seeds) చిన్నవైనా ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో గొప్పది. ఆయుర్వేద నిపుణులు డా. చిట్టిభొట్ల మధుసూదన శర్మ ఈ వీడియోలో అవిసె గింజల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను సులభంగా వివరించారు.
ప్రతిరోజూ ఉదయం కేవలం 5 నుంచి 10 నిమిషాల పాటు భస్త్రిక ప్రాణాయామం చేస్తే శరీరానికి, మనసుకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.
పిల్లలు తమ మనసులో ఉన్న ప్రతి విషయాన్ని తల్లిదండ్రులతో స్వేచ్ఛగా పంచుకుంటున్నారా? లేక కొన్ని విషయాలను దాచిపెడుతున్నారా? పిల్లలు తమ సమస్యలు, భయాలు, సందేహాలు, విజయాలు, అపజయాలు అన్నింటినీ తల్లిదండ్రులతో నమ్మకంగా చెప్పుకోవడం వారి మానసిక ఎదుగుదలకు ఎంతో అవసరం. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.