పాషన్ ఫ్రూట్ గురించి విన్నారా? దీంతో కలిగే లాభాలేంటంటే..!

Publish Date:Jun 26, 2024

Advertisement

పండ్లలో చాలా రకాలు ఉన్నాయి. అయితే తెలుగు ప్రజలకు కాస్త పరిచయం తక్కువ ఉన్న పండ్లలో పాషన్ ఫ్రూట్ కూడా ఒకటి. ఈ పాషన్ ఫ్రూట్ లోపల గుజ్జు, గింజలతో కూడి ఉంటుంది. దీని తొక్క మాత్రం గట్టిగా  చూడటానికి ఏ మారేడు కాయో అనిపించేలా ఉంటుంది. ఊదా రంగులోనూ, పసుపు రంగులోనూ పాషన్ ఫ్రూట్ లు చాలా ఎక్కువగా కనిపిస్తాయి. దీని గుజ్జుతో వివిధ రకాల పానీయాలు తయారుచేస్తారు.

రోగనిరోధక శక్తికి పాషన్ ప్రూట్ పెట్టింది పేరు. ఈ పండులో అవసరమైన విటమిన్లు,  ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.  ముఖ్యంగా ఇందులో ఉండే  విటమిన్ సి  రోగనిరోధక శక్తిని పెంచుతుంది.  ఆరోగ్యకరమైన చర్మానికి సహాకరిస్తుంది. పాషన్ ఫ్రూట్ లో పెద్ద మొత్తంలో విటమిన్ ఎ, కాల్షియం, పొటాషియం,  మెగ్నీషియం కూడా ఉంటాయి.  ఫైబర్,  యాంటీఆక్సిడెంట్లు కూడా  సమృద్ధిగా ఉంటాయి.

ఆరోగ్య ప్రయోజనాలు..

దీర్ఘకాలిక వ్యాధులను నివారిస్తుంది..

విటమిన్ సి,  పాలీఫెనాల్స్‌తో సహా పాషన్ ఫ్రూట్‌లోని అధిక యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి  ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడటానికి,  దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి.

తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్..

పాషన్ ఫ్రూట్ లో  తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్‌ ఉంటాయి.  ఇవి  రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచవు,  మధుమేహం ఉన్నవారికి  మంచివి. పాషన్ ఫ్రూట్‌లో ఆస్కార్బిక్ యాసిడ్  ఉంటుంది.  రక్తంలో చక్కెరను నియంత్రణలో ఉంచడంలో ఆస్కార్బిక్ ఆమ్లం సహాయపడుతుంది.

బరువు నిర్వహణ..

ఈ పండులో ఉండే  పీచు పదార్ధం  ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. తద్వారా పదే పదే తినడాన్ని నియంత్రిస్తుంది. ఇందులో ఉండే  ఫైబర్ మలబద్ధకం నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.   ప్రేగు కదలికలను  చురుగ్గా ఉంచుతుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది..

విటమిన్ సి,  శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, ఇన్ఫెక్షన్‌తో పోరాడడంలో,  రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ప్యాషన్ ఫ్రూట్ పీల్స్ వల్ల రోగనిరోధక వ్యవస్థ ప్రభావవంతంగా  ఉంటుంది.

 గుండె ఆరోగ్యం..

 ప్యాషన్ ఫ్రూట్‌లోని పొటాషియం కంటెంట్ రక్తపోటును  నియంత్రించడంలో సహాయపడుతుంది.  ఇందులోని ఫైబర్,  యాంటీఆక్సిడెంట్లు ధమనులలో కొలెస్ట్రాల్ ఏర్పడకుండా నిరోధించడంలో సహాయపడతాయి.


 గట్ మైక్రోబయోమ్..

ఒక చిన్న పాషన్ ఫ్రూట్ లో ఉండే   ఫైబర్ ప్రీబయోటిక్‌గా పనిచేస్తుంది.  ఇది  మైక్రోబయోమ్‌ను మంచి బ్యాక్టీరియాతో ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

                                 *నిశ్శబ్ద.

By
en-us Political News

  
మూత్రం పోయే సమయంలో మంట, తరచుగా మూత్రానికి వెళ్లాలనిపించడం, పొత్తికడుపు నొప్పి వంటి సమస్యలను చాలా మంది సాధారణంగా తీసుకుంటారు.
శరీరంలో కొవ్వు పెరగడం అనేది చాలామంది చూస్తూనే ఉంటారు.  కొందరికి శరీరంలో కొన్ని ప్రదేశాలలో కొవ్వు పెరిగి, ఆ ప్రదేశాలు చాలా లావుగా కనిపిస్తూ ఉంటాయి.
బిఎమ్ఐ.. దీన్నే బాడీ మాస్ ఇండెక్స్ అని అంటారు. ఎత్తుకు తగ్గ బరువు  ఉన్నారా లేదా తెలుసుకోవడంలో ఇది సహాయపడుతుంది. నేటి కాలంలో అన్ని వయసుల వారిలో అధిక బరువు , ఊబకాయం సమస్య వేగంగా పెరుగుతోంది.
ఇష్టమైన ఆహారం తింటూనే సులభంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? సీనియర్ న్యూట్రిషన్ కన్సల్టెంట్ డాక్టర్ జానకి శ్రీనాథ్ సూచించిన అట్కిన్స్ డైట్ ప్లాన్ విశేషాలు తెలుగులో తెలుసుకోండి.
రోజంతా అలసటగా, నీరసంగా అనిపిస్తుందా? ఎంత విశ్రాంతి తీసుకున్నా శరీరంలో శక్తి లేకపోతే, అది కేవలం సాధారణ అలసట మాత్రమే కాకుండా Chronic Fatigue Syndrome (CFS) అనే ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు.
టి కాలంలో రోజులో మూడు పూటలా ఆహారం తీసుకోవడం కామన్.  ఉదయం టిఫిన్, మద్యాహ్నం భోజనం, రాత్రి భోజనం తప్పకుండా చేస్తారు.
మధుమేహం అనేది వేగంగా పెరుగుతున్న ఒక  వ్యాధి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, భారతదేశంలో మధుమేహ రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
కొందరికి కాలివేళ్లు , చేతివేళ్ల కీళ్లలో నొప్పి, మోకాళ్లు , చీలమండలలో వాపు, , నడవడంలో ఇబ్బంది వంటివి ఎదురవుతుంటాయి.  ఇవి యూరిక్ యాసిడ్ పెరగడానికి సంకేతాలు కావచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
మినుముల పులగం అనేది మన సంప్రదాయ ఆహారాల్లో ఎంతో విలువైనది. ఇది శరీరానికి అవసరమైన ప్రోటీన్, బలం, శక్తిని అందించే సహజమైన ఆహారం.
వర్షాకాలం వేడి నుండి ఉపశమనం కలిగించినప్పటికీ, వర్షం, నీరు నిలవడం, వరదలు వంటివి  వివిధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి.
రుమటాయిడ్ ఆర్థరైటిస్ (Rheumatoid Arthritis) అనేది పెద్దవారికే వచ్చే వ్యాధి అని చాలామంది అనుకుంటారు. కానీ ఈ సమస్య పిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఉంది.
ధూమపానం ఆరోగ్యానికి హానికరం.  ఈ విషయాన్ని పేపర్ లు,  టీవీ యాడ్స్ మాత్రమే కాకుండా ఏకంగా  సిగరెట్ ప్యాకెట్ ల పైన కూడా రాసి ఉంటుంది. ఇలా ఎవరు ఎంత చెప్పినా సరే..
గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, కడుపు ఉబ్బరం సమస్యలకు ఇంట్లోనే వాము, ధనియాలు, జీలకర్ర, సోంపుతో ఆయుర్వేద చూర్ణం ఎలా తయారు చేయాలో డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ వివరించిన పూర్తి వీడియో.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.