డెంగ్యూ బాధలకు చెక్..వ్యాక్సిన్ వచ్చేసింది..! 

Publish Date:Jul 20, 2026

Advertisement

డెంగ్యూ బాధలకు చెక్..వ్యాక్సిన్ వచ్చేసింది..! 

వర్షాకాలం వేడి నుండి ఉపశమనం కలిగించినప్పటికీ, వర్షం, నీరు నిలవడం, వరదలు వంటివి  వివిధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. ఈ సమయంలో దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల ప్రమాదం కూడా గణనీయంగా పెరుగుతుంది. ప్రతి సంవత్సరం వర్షాకాలం రాగానే చాలామంది  డెంగ్యూ గురించి  భయపడతారు.  జూలై - అక్టోబర్ నెలల మధ్య ఆసుపత్రులలో డెంగ్యూ రోగుల సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది. డెంగ్యూ సమస్య చాలా తీవ్రంగా మారితే అంతర్గత రక్తస్రావ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది, ఇది ప్రాణాంతకం కూడా కావచ్చు. ఈ ప్రమాదాల మధ్య, డెంగ్యూ విషయంలో భారతదేశంలో ఒక పెద్ద పురోగతి సాధించబడింది. జపాన్‌కు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ టకేడా ఫార్మాస్యూటికల్ అభివృద్ధి చేసిన డెంగ్యూ వ్యాక్సిన్, క్యూడెంగా, భారత ఔషధ నియంత్రణ సంస్థ నుండి ఆమోదం పొందింది. ముఖ్యంగా, భారతదేశంలో ఆమోదం పొందిన మొట్టమొదటి డెంగ్యూ వ్యాక్సిన్ ఇదే. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..

భారతదేశంలో డెంగ్యూ వ్యాక్సిన్..

ఇప్పటివరకు  డెంగ్యూకు ఎలాంటి సరైన చికిత్స లేదు.. రోగి లక్షణాలను తగ్గించడానికి సహాయక చికిత్స అందించబడేది.  కానీ ఇప్పుడు వ్యాక్సిన్ ను కనుగొన్నారు.  నివేదికల ప్రకారం నాలుగు రకాల డెంగ్యూ వైరస్‌ల నుండి రక్షణ కల్పించేలా ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. ఇదే  దీనిలో ప్రత్యేకత. అంతేకాకుండా, ఈ వ్యాక్సిన్ ఇచ్చే ముందు డెంగ్యూ వచ్చిందో లేదో పరీక్షించాల్సిన అవసరం ఉండదట.
 

గత 20 ఏళ్లుగా భారతదేశంలో డెంగ్యూ కేసులు చాలా రెట్లు పెరిగిన కారణంగా ఈ వ్యాక్సిన్ కు  ఆమోదం లభించింది. ప్రతి సంవత్సరం వేలాది మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు , చాలా మంది రోగులను ఆసుపత్రిలో చేర్చవలసి వస్తోంది. సమర్థవంతమైన వ్యాక్సిన్ ఉంటే మంచిదని ఎంతో కాలంగా వైద్యుల నుండి ప్రజల వరకు అందరూ ఎంతో ఎదురుచూశారు.  

భారతీయ కంపెనీ బయోలాజికల్-ఇ సహకారంతో టకేడా ఈ వ్యాక్సిన్‌ను భారీ స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు సన్నాహాలు కూడా ప్రారంభించింది.

కుడెంగా టీకా..

కంపెనీ ప్రకారం క్యూడెంగా ఒక టెట్రావాలెంట్ లైవ్-అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్. సులభంగా చెప్పాలంటే, ఈ వ్యాక్సిన్‌ను నాలుగు రకాల డెంగ్యూ వైరస్‌ల నుండి రక్షణ కల్పించేలా రూపొందించారు. ఇందులో బలహీనంగా ఉన్న వైరస్ ఉంటుందట.. దీన్ని శరీరంలో ప్రవేశపెడితే..   శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థ వ్యాధిని కలిగించకుండానే వైరస్‌ను గుర్తించి, పోరాడుతుందట.  

భారతదేశంలో డెంగ్యూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, ఈ వ్యాక్సిన్ ను ఆమోదించడం  చాలా మేలైందని అంటున్నారు.  అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, గత రెండు దశాబ్దాలలో భారతదేశంలో డెంగ్యూ కేసులు దాదాపు 11 రెట్లు పెరిగాయి.
 
టకేడా 2024 సంవత్సరంలో భారతీయ వ్యాక్సిన్ తయారీ సంస్థ బయోలాజికల్-ఇతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, బయోలాజికల్-ఇ ప్రతి సంవత్సరం సుమారు 50 మిలియన్ డోసులను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తుంది.  ఈ దశాబ్దం చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏటా 100 మిలియన్ డోసులను ఉత్పత్తి చేయాలన్న  లక్ష్యాన్ని సాధించడానికి ఇది టకేడాకు సహాయపడుతుందట.

 

                                       *రూపశ్రీ.

 

By
en-us Political News

  
గుడ్లు పోషకాహారం యొక్క పవర్హౌస్.  ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, అవసరమైన విటమిన్లు గుడ్డులో పుష్కలంగా ఉంటాయి.
కాళ్లు, చేతులు తిమ్మిరిగా అనిపించడం, జలదరింపు రావడం చాలామందికి అప్పుడప్పుడు ఎదురయ్యే సమస్య. ఎక్కువసేపు ఒకే పొజిషన్‌లో కూర్చోవడం లేదా నరాలపై ఒత్తిడి పడటం వల్ల తాత్కాలికంగా తిమ్మిర్లు రావచ్చు.
స్ట్రెస్, ఆందోళన, బీపీ వంటి సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. రోజువారీ జీవితంలో ఒత్తిడి పెరగడంతో మనసుతో పాటు శరీరంపై కూడా ప్రభావం పడుతుంది. ఇలాంటి సమయంలో శ్వాసపై దృష్టి పెట్టే ప్రాణాయామాలు కొంతమందికి రిలాక్సేషన్‌కు సహాయపడవచ్చు.
మన శరీరం సరిగ్గా పనిచేయడానికి అవసరమైన ముఖ్యమైన ఖనిజాల్లో పొటాషియం (Potassium) ఒకటి. శరీరంలో పొటాషియం స్థాయి సరైన మోతాదులో ఉండటం చాలా ముఖ్యం.
సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని అంటారు. కంటి ఆరోగ్యం మెరుగ్గా ఉంటే జీవితం చాలా వరకు దిగులు లేకుండా ఉంటుంది.   కంటికి ఏదైనా సమస్య వస్తే.. దాని ప్రభావం జీవితం మీద చాలా ప్రస్పుటంగా కనిపిస్తుంది.
కాల్షియం, ఐరన్ లోపం ఉందా? పాలు, పాల ఉత్పత్తుల విషయంలో కల్తీపై ఆందోళన ఉందా? అయితే మన ఇంట్లోనే సులభంగా లభించే ఒక ఆకుకూర మీ ఆహారంలో మంచి పోషక వనరుగా ఉపయోగపడవచ్చు.
ఐస్ క్రీమ్.. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టంగా తింటారు. చాలామంది వర్షాకాలంలో కూడా ఐస్ క్రీమ్ తింటే ఆ కిక్కే వేరు అంటారు.  కాలం ఏదైనా ఐస్ క్రీమ్ పట్ల చాలా ఇష్టం ఉంటుంది.
చండీపురా వైరస్ (Chandipura Virus) ప్రస్తుతం ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్న వైరస్‌లలో ఒకటి. ముఖ్యంగా 15 సంవత్సరాల లోపు పిల్లల్లో ఈ వైరస్ తీవ్రమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. వర్షాకాలంలో దీని ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది.
మనిషి  మెదడు చాలా శక్తివంతమైనది.  మనిషి మనుగడ సాగుతున్నది మెదడు పనితీరు మీదనే.. మెదడు ఎంత ఆరోగ్యంగా ఉంటే మనిషి జీవితం అంత బాగుంటుంది.
మధుమేహం అనేది ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఒక ఆరోగ్య సమస్య, ఇది అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తుంది. జీన్స్ ప్రభావం, ఊబకాయం , జీవనశైలిలో మార్పులు వంటి కొన్ని ప్రమాద కారకాలు ఈ వ్యాధి వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి.
అవిసె గింజలు (Flax Seeds) చిన్నవైనా ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో గొప్పది. ఆయుర్వేద నిపుణులు డా. చిట్టిభొట్ల మధుసూదన శర్మ ఈ వీడియోలో అవిసె గింజల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను సులభంగా వివరించారు.
ప్రతిరోజూ ఉదయం కేవలం 5 నుంచి 10 నిమిషాల పాటు భస్త్రిక ప్రాణాయామం చేస్తే శరీరానికి, మనసుకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.
పిల్లలు తమ మనసులో ఉన్న ప్రతి విషయాన్ని తల్లిదండ్రులతో స్వేచ్ఛగా పంచుకుంటున్నారా? లేక కొన్ని విషయాలను దాచిపెడుతున్నారా? పిల్లలు తమ సమస్యలు, భయాలు, సందేహాలు, విజయాలు, అపజయాలు అన్నింటినీ తల్లిదండ్రులతో నమ్మకంగా చెప్పుకోవడం వారి మానసిక ఎదుగుదలకు ఎంతో అవసరం. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.