వాట్సప్‌లో దివ్య మెసేజ్.. రూ. 21 కోట్లు పోగొట్టుకున్న సీనియర్ సీఏ!

Publish Date:Jul 15, 2026

Advertisement

"హలో... నేను దివ్య మాట్లాడుతున్నాను" అంటూ వాట్సాప్‌లో వచ్చిన ఒకే ఒక్క పరిచయ సందేశం, ఒక సీనియర్ చార్టర్డ్ అకౌంటెంట్‌ జీవితాంతం సంపాదించిన సొమ్మును నిలువునా ముంచేస్తుందని ఎవరూ ఊహించలేదు. సాధారణంగా చదువుకోని వారు లేదా ఆర్థిక విషయాలపై అవగాహన లేని వారే సైబర్ మోసాల బారిన పడతారని చాలామంది అనుకుంటారు. కానీ గ్వాలియర్‌కు చెందిన 70 ఏళ్ల సీనియర్ చార్టర్డ్ అకౌంటెంట్ (CA) అశోక్ విజయవర్గియా విషయంలో జరిగింది చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. డిసెంబర్ 2025 నుండి జూలై 2026 మధ్యకాలంలో జరిగిన ఈ నకిలీ క్రిప్టోకరెన్సీ ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్, దేశంలోనే అత్యంత పెద్ద సైబర్ మోసాలలో ఒకటిగా నిలిచింది. కేవలం ఒకే ఒక్క నకిలీ వాట్సప్ సందేశంతో మొదలైన ఈ కథ, చివరికి రూ. 21.06 కోట్ల భారీ దోపిడీకి దారితీసింది.

ఈ కథలోకి వెళ్తే, మోసగాళ్లు అమ్మాయి పేరుతో అశోక్ విజయవర్గియాకు వాట్సాప్‌లో పరిచయమయ్యారు. ఆపై నమ్మకం కుదిరేలా మాట్లాడి, యూఎస్‌డీటీ (USDT-టెథర్) క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ ద్వారా భారీగా లాభాలు సంపాదించవచ్చని నమ్మించారు. ఇందులో భాగంగా ఒక నకిలీ వెబ్‌సైట్ లింక్‌ను పంపి అందులో ఇన్వెస్ట్ చేయాల్సిందిగా కోరారు. మొదట్లో దీనిపై నమ్మకం కలగని విజయవర్గియా, ప్రయోగాత్మకంగా డిసెంబర్ 25, 2025న యూపీఐ (UPI) ద్వారా నాలుగు సార్లు రూ. 10 వేల చొప్పున బదిలీ చేశారు. ఆ తర్వాత ఒక స్నేహితుడి యూపీఐ ద్వారా మరో రూ. 1 లక్ష పంపించారు. వీటికి ప్రతిఫలంగా జనవరి 7వ తేదీన ఆయన హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) బ్యాంక్ ఖాతాలో తొలి రాబడిగా రూ. 1.88 లక్షలు జమ అయింది. తాను పెట్టిన పెట్టుబడికి వెంటనే భారీ లాభం రావడంతో, ఆ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌పై ఆయనకు పూర్తి నమ్మకం ఏర్పడింది.

ఆ నమ్మకమే ఆయన పాలిట శాపమైంది. దీనికంటే ముందే డిసెంబర్ 31 నాటికి తన యూనియన్ బ్యాంక్ ఖాతా నుండి ఆర్‌టీజీఎస్ (RTGS) ద్వారా రూ. 15 లక్షలు బదిలీ చేసిన ఆయన, ఆ తర్వాతి నెలల్లో మోసగాళ్లు సూచించిన వివిధ బ్యాంకు ఖాతాలకు కోట్ల రూపాయలను గుడ్డిగా బదిలీ చేస్తూ పోయారు. బాధితుడు డబ్బు జమ చేస్తున్న కొద్దీ, సదరు నకిలీ ట్రేడింగ్ పోర్టల్ ఆయన పెట్టుబడి వేగంగా పెరుగుతున్నట్లు తప్పుడు గ్రాఫ్‌లను చూపిస్తూ ఊరించింది. చివరికి ఆ పోర్టల్‌లో ఏకంగా రూ. 33.25 కోట్ల భారీ బ్యాలెన్స్‌ ఉన్నట్లు ప్రదర్శించింది. తన ఖాతాలో అంత డబ్బు ఉండటం చూసి నిజమేనని నమ్మిన విజయవర్గియా, ఆ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు మోసగాళ్లు అసలు రంగు బయటపెట్టారు.

అంత భారీ సొమ్మును విత్ డ్రా చేయాలంటే ముందుగా రూ. 10.84 కోట్ల ఆదాయపు పన్ను (Income Tax) చెల్లించాలని కేటుగాళ్లు డిమాండ్ చేశారు. ఆ తర్వాత విత్‌డ్రా మొత్తం ఎక్కువగా ఉన్నందున రిస్క్ మార్జిన్ కింద మరో రూ. 1 కోటి కట్టాలంటూ కొత్త వంకలతో మరింత డబ్బు లాగారు. ఈ విధంగా మొత్తం రూ. 21.06 కోట్లు పోగొట్టుకున్నాక గానీ ఆయనకు తాము మోసపోయామనే విషయం బోధపడలేదు. చివరకు ఈ వ్యవహారమంతా మోసమని గ్రహించిన బాధితుడు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ మరియు 1930 హెల్ప్‌లైన్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

gwalior ca whatsapp crypto fraud,online trading scam 21 crores.
 

By
en-us Political News

  
అలాగే బహ్రెయిన్‌లోని దిగ్గజ సంస్థ అయిన అమెజాన్ ప్రధాన డేటా సెంటర్‌ను కూడా ధ్వంసం చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. తమ దేశ పౌర వసతులపై అమెరికా దళాలు జరిపిన దాడులకు తగిన రీతిలో జవాబు చెప్పడానికే ఈ సాంకేతిక కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది. అయితే ఈ ఆరోపణలు, క్షిపణి దాడి ఘటనను అమెజాన్ కానీ, బహ్రెయిన్ ప్రభుత్వం కానీ ధ్రువీకరించలేదు.
బాబాయ్ త్వరగా కోలుకోవాలంటూ జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో చేసిన పోస్టు క్షణాల్లో వైరల్ అయ్యింది. బాబాయ్ పట్ల ఎన్టీఆర్ చూపించిన ఈ ప్రేమాభిమానాల పట్ల నందమూరి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాది దావోస్ లోని ప్రపంచ ఆర్ధిక సదస్సులో కుదుర్చుకున్న మరో ఒప్పందం ఇవాళ సాకారమైంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో గత కొన్ని నెలలుగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ముంబై నటి కాదంబరి జత్వాని వ్యవహారం
తన ఆరోగ్యం, ఆసుపత్రి అనుభవాల గురించి తాజాగా నెట్టింట షేర్ చేసిన పోస్టు ఆయన అభిమానులను, సినీ వర్గాలనూ కలవరానికి గురి చేసింది. ఆసుపత్రి వాతావరణం, శస్త్రచికిత్స, అనంతరం ఐసీయూలో వైద్యుల నిరంతర పర్యవేక్షణ వంటి కష్టతరమైన దశలను ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో జరుగుతున్న శ్రీ జగదాంబికా అమ్మవారి బోనాల మహోత్సవాల సందర్భంగా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు విస్తృత స్థాయిలో ట్రాఫిక్ బందోబస్తు చేపట్టారు.
ప్రధాని ఇంటి ఎదుట బైఠాయించిన రాహుల్, ఖర్గే..!
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో జాతీయ రాజకీయం అత్యంత ఆసక్తికరమైన మలుపు తిరిగింది.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఛలో సంసద్ పార్లమెంట్ మార్చ్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
ఉత్తరాంధ్ర ప్రాంత ప్రగతికి ఊపిరి పోసేందుకు తమ జీవనాధారమైన భూములను ప్రభుత్వం సేకరించడానికి సహకరించిన రైతులకు కృతజ్ఞతగా, గౌరవంగా భోగాపురం విమానాశ్రయం నుంచి ఉచితంగా ఒకసారి విమానంలో ప్రయాణించే అవకాశం కల్పించారు. ఈ మేరకు ఆయన అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలిచ్చారు.
కాకినాడలో జరుగుతున్న NBK111 సినిమా షూటింగ్ సందర్భంగా గాయపడిన ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నంద మూరి బాలకృష్ణను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఫోన్‌లో పరామర్శిం చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పొగాకు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముడి పొగాకు (HSN 2401)పై ప్రస్తుతం అమలులో ఉన్న 40 శాతం జీఎస్టీని 28 శాతానికి తగ్గించాలని
ట్రైనీ ఐపీఎస్‌కి న్యాయం జరగాలి..విచారణ పూర్తికాకముందే దోషిగా ప్రకటించడం సరికాదు..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.