"భీమ్లా నాయక్" వర్సెస్ "జగన్ నాయక్"
Publish Date:Feb 16, 2022
Advertisement
భీమ్లా నాయక్. పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ క్రేజీ మూవీ. ఇప్పటికే పాటలు, ఫైటింగ్‌లు దుమ్ము రేపుతున్నాయి. పీకే మేనరిజం అదరగొడుతోంది. అప్పుడూఇప్పుడూ అంటూ ఇన్నాళ్లూ ఊగిసలాడిన భీమ్లా నాయక్ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఫిబ్రవరి 25న థియేటర్లలో అదరగొట్టేందుకు భీమ్లా నాయక్ వచ్చేస్తోంది. పవన్, రాణాల డబుల్ ధమాకాతో.. బాక్సులు బద్దలు కావడం ఖాయమంటున్నారు. ఇంత వరకూ అంతా బాగుంది. అయితే, జగన్‌రెడ్డి రూపంలో భీమ్లా నాయక్ దూకుడుకు ఓ చెక్‌పోస్ట్ ఉంది. ఈ మూవీ రిలీజ్ డేట్ ఫిబ్రవరి 25న కావడమే అందుకు కారణం. ఈ లోపు పెద్ద సినిమాలు ఏవీ లేకపోవడంతో.. భీమ్లా నాయక్ వచ్చేసరికి సినిమా టికెట్ ధరలు పెంచే నిర్ణయం ప్రభుత్వం నుంచి వస్తుందా? రాదా? అనే ఆసక్తి నెలకొంది. ఎందుకంటే.. ఇది జనసేనాని సినిమా. అక్కడుండి జగన్‌రెడ్డి. అందుకే, ఈ క్యూరియాసిటీ. వకీల్ సాబ్‌ను దెబ్బకొట్టేందుకే సినిమా టికెట్ ధరల తగ్గింపు జీవో తీసుకొచ్చారని అప్పట్లో గోలగోల జరిగింది. ఆ రచ్చ ఇప్పటి వరకూ కంటిన్యూ అవుతోంది. వకీల్ సాబ్ సూపర్ హిట్‌తో జగన్‌రెడ్డికి షాక్ తప్పలేదు. అఖండ, పుష్పలు సైతం బంపర్ కలెక్షన్స్‌తో జగనన్నకు ఝలక్ ఇచ్చాయి. ఆ టికెట్ల ఇష్యూ అలా అలా కంటిన్యూ అవుతూ.. చిరంజీవి అండ్ కో తో భేటీ వరకూ వచ్చింది. ఆ మీటింగ్‌లో ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయిందని ఆ భేటీకి వెళ్లొచ్చిన పెద్దలు చెప్పారు. త్వరలోనే మంచి నిర్ణయం వస్తుందని చెప్పేశారు కానీ.. ఆ త్వరలో ఎప్పుడు అనేదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎందుకంటే త్వరలోనే భీమ్లా నాయక్ వస్తున్నాడు కాబట్టి. చిరంజీవి చెప్పిన మాటల ప్రకారం ఫిబ్రవరి చివరి వారంకల్లా ప్రభుత్వం నుంచి. సినిమా టికెట్ ధరల పెంపు నిర్ణయం రావాలి. సరిగ్గా ఆ ఫిబ్రవరి 25న భీమ్లా నాయక్ రిలీజ్ డేట్ ప్రకటించేశారు. మరి, పవర్ స్టార్ సినిమా విడుదలకు ముందే ప్రభుత్వం నుంచి టికెట్ ధరల పెరుగుదల ప్రకటన వస్తుందా? భీమ్లా నాయక్ వచ్చే నాటికి సవరించిన జీవో వస్తుందా? లేదంటే.. వకీల్ సాబ్ మాదిరే భీమ్లా నాయక్ కలెక్షన్లపైనా దెబ్బకొట్టేందుకు జగన్‌రెడ్డి ఆ ప్రకటనను కావాలనే ఆలస్యం చేస్తారా? లేక, చిరు టీమ్ దగ్గర ఒప్పుకున్న మేరకు ఫిబ్రవరి మూడో, నాలుగో వారానికల్లా.. అంటే భీమ్లా నాయక్ రిలీజ్‌కు ముందే టికెట్ ధరలు పెంచుతారా? అనేది ఆసక్తితో పాటు ఉత్కంఠ రేపుతోంది. జగన్‌రెడ్డి.. పవన్ కల్యాణ్ సినిమాలపై కత్తికట్టారా లేదా? అనేది ఈ ఎపిసోడ్‌తో తేలిపోనుంది..అంటున్నారు.
http://www.teluguone.com/news/content/what-is-jagan-effect-on-bheemla-nayak-39-131851.html





