వైసీపీలో పేర్ని నాని సీన్ అయిపోయిందా: కార్యకర్తల సమావేశంలో అసహనం సంకేతం ఏంటి.?

Publish Date:Oct 1, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో  బందర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు పేర్ని నాని ఎప్పుడు వార్తల్లో ఉంటుంటారు. తనదైన వాగ్ధాటితో  ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తూ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చలు రేకెత్తడానికి దోహదపడుతుంటారు. అసలు పేర్ని నాని పరిచయం అక్కర్లేని పేరు.  అయితే తాజాగా ఆయన తన సహజ శైలికి భిన్నంగా ఇటీవల ఎక్కడ లేని అసహనాన్నీ ప్రదర్శించారు.

విషయమేంటంటే..   ఇటీవల బందర్ లో ఆయన నియోజకవర్గ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. నియోజకవర్గ కార్యకర్తలతో పేర్ని నాని భేటీ అవ్వడం కొత్తేం కాదు. చాలా మంది నేతల కంటే చాలా చాలా ఎక్కువ సార్లు ఆయన కార్యకర్తలతో సమావేశం అవుతుంటారు. వారిలో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపుతుంటారు. అలా నింపడానికి ఆయనకున్న వాగ్ధాటి దోహదపడుతుంటుంది. అందుకే పేర్ని నాని సమావేశం ఏర్పాటు చేశారంటే కార్యకర్తలు ఉత్సాహంగా ఆ భేటీకి తరలి వస్తుంటారు. అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 

అందుకు కారణమేంటంటే.. ఐదేళ్ల వైసిపి హయాంలో   తన సొంత సామాజిక వర్గానికి, క్షేత్రస్థాయిలో పార్టీ కోసం కష్టపడిన నాయకులకు, కార్యకర్తలకు ఆశించిన స్థాయిలో న్యాయం చేయలేదంటూ  ఈ సమావేశంలో కార్యకర్తలు పేర్ని నానిని నిలదీశారు. తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నోసార్లు సామాజిక సమీకరణలను తనకు అనుకూలంగా మార్చుకుని లబ్ధి పొందిన పేర్ని నాని.. కార్యకర్తలు నిలదీయడంతో సహనం కోల్పోయారు. పొలిటీషియన్లు, ఎమ్మెల్యేలకు కులాలేంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించిన కార్యకర్తలపై ఒక్క సారిగా సామాజిక సమీకరణాలంటారేంటి అంటూ విరుచుకుపడ్డారు. దీంతో కార్యకర్తలు విస్మయానికి గురయ్యారు. సామాజికవర్గం పేరు చెప్పుకుని ఎదిగిన నాని ఒక్కసారిగా ఇలా రివర్స్ అవ్వడమేంటంటూ విస్తుపోయారు. 

తమ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక దాటవేతకు ప్రయత్నిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను సొంత పార్టీ నేతలకు నిలదీస్తుంటే.. వారిని సముదాయించడం చాతకాక, మంత్రి కొల్లు రవీంద్రపై నోరు పారేశసుకున్నారు.  తెలుగుదేశం పార్టీలో పదవులు అమ్ముకుంటున్నారని, తాను మాత్రం కేవలం విధేయత చూపిన వాళ్లకే పదవులు ఇచ్చాననీ పరోక్షంగా కొల్లును విమర్శిస్తూ పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమౌతోంది. స్థానిక ఎన్నికలు తరుముకొస్తున్న వేళ.. పేర్ని తీరు, వ్యాఖ్యలు.. బందర్ లో వైసీపీ సీన్ అయిపోయిందా? లేక వైసీపీలో పేర్ని నాని సినిమా అయిపోయిందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

 బందర్ నియోజకవర్గంలో తెలుగుదేశం కూటమి బలోపేతం అయ్యిందనీ, ఇందు కోసం మంత్రి కొల్లు రవీంద్ర చురుకుగా వ్యవహరిస్తున్నారనీ, ఈ నేపథ్యంలోనే సొంత పార్టీ కార్యకర్తలతో సమన్వయం చేసుకుని పార్టీని నడిపించడంలో విఫలమైన నాని, డిఫెన్స్ లో పడి.. అసహనంతో రగిలిపోతున్నారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  దానికి తోడు.. తన రాజకీయ వారసుడిగా ఎదుగుతాడని ఆశించిన పేర్ని కిట్టూ కూడా ప్రజాక్షేత్రంలో ఆకట్టుకోవడంలో విఫలం కావడం కూడా పేర్ని నాని అసహనానికి కరాణంగా చెబుతున్నారు.  

[Perni Nani, Machilipatnam, Kollu Ravindra, Y CP , AP Politics, Andhra Pradesh Politics, Restlessness, Telugu One]

By
en-us Political News

  
 సీజేపీ నిరసన తెలిపేందుకు అనుమతి కోరిన తర్వాత, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ ఆర్డర్ ద్వారా జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా డీనోటిఫై చేయడం నుండి నీట్ పేపర్ లీక్ సమస్యల వరకు అన్నామలై కేంద్రాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు.
కాన్వాయ్ భద్రతా సిబ్బంది లేకుండా, ప్రోటోకాల్స్ ను కాదని మరీ సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి చేరుకుని ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ భేటీలో ఇరువురూ, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు  స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగిందని అంటున్నారు.  
పరకాల ప్రభాకర్ మద్దతు కేంద్రానికి ఎందుకు షాక్ గా మారిందంటే.. ఆయన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ భర్త కావడం వల్లనే. . ఈ ఉద్యమానికి ఒక అనూహ్య వ్యక్తి మద్దతు తెలపడంతో దీనికి మరింత బలం చేకూరింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త  పరకాల ప్రభాకర్, అక్టోబర్ 23న జరగనున్న ఈ నిరసనలో పాల్గొంటాననీ, బొద్దింకల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలుపుతాననీ ప్రకటించారు.   
దేశవ్యాప్తంగా లేదా ప్రధాన నగరాల్లో తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి  దీపావళి పండుగ తరువాత నుంచీ ఆందోళనలను పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు.
2021లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జగన్ అధికారంలో ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నా వైసీపీయులు అడ్డుకున్నారు. ఆ విషయాన్ని విస్మరించి.. ఇప్పుడు జగన్ అధికార కూటమి తమను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో సరికొత్త సమీకరణాలకు తెరలేచింది. రాజ్యసభ మాజీ సభ్యుడు, సీనియర్ రాజకీయ నాయకుడు విజయసాయిరెడ్డి త్వరలో సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు సర్వం సిద్ధం చేశారు
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ జోరుగా సాగుతున్న తరుణంలో అధికార తెలుగుదేశం పార్టీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
 గత ఏప్రిల్ లో లోక్‌సభలో ఎదురైన సాంకేతిక రాజ్యాంగ సవరణ లోపాలను పూర్తిగా సరిదిద్ది, ఈసారి ఎటువంటి అవాంతరాలు లేకుండా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని కేంద్ర హోం, న్యాయ మంత్రిత్వ శాఖలు నిర్ణయిచాయి.
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 తిరుపతి, ఏలూరు, శ్రీకాకుళం, సాలూరు,  పిఠాపురం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సీట్ల సర్దుపాట్లు కూటమి శ్రేణుల మధ్య అగాధాన్ని పెంచుతూ ఐక్యతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ అయిన ఉమ్మడి కడప జిల్లాలో ఆ పార్టీకి తీవ్ర రాజకీయ ప్రతికూలత ఎదురౌతోందని చెప్పడానికి స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియే నిలువెత్తు నిదర్శనంగా చెబుతున్నారు.
కమ్మ నాయకుడు ఏబీవీకి స్వతంత్ర అభ్యర్థిగా మద్దతు ఇస్తూ, కాపు నాయకుడు  వంగవీటి రాధను జనసేనలోకి పంపారన్నది విజయసాయి రెడ్డి ఆరోపణ.  కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు ఏబీవీకి మద్దతు ఇవ్వడాన్ని కూడా ఆయన చంద్రబాబు వ్యూహంగానే అభివర్ణిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.