పంజాబ్‌లో కాంగ్రెస్‌కు బిగ్ షాక్..
Publish Date:Feb 16, 2022
Advertisement
ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్రంుత పంజాబ్ ఒక్కటే. సో .. పంజాబ్’లో అధికారాన్ని నిలబెట్టుకోవడం కాంగ్రెస్ పార్టీ ముందన్న మొదటి సవాల్. అందుకు అదనంగా బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరాఖండ్, గోవాలను కూడా కాంగ్రెస్ గెలుచుకుంటే, అది బోనస్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ రాజకీయాలలో మళ్ళీ మరోమారు ప్రతిపక్ష రాజకీయాలకు పెద్దన్నగా నిలిచే అవకాశం ఏర్పడుతుంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకు కేంద్ర బిందువుగా నిలుస్తుంది. పంజాబ్ కోల్పోయి గోవా, ఉత్తరాఖండ్’లో గెలిచినా (ఆ రెండు రాష్ట్రాలలోనో కలిపి ఉన్నది ఏడే లోక్ సభ స్థానాలు) జాతీయ స్థాయిలో చక్రం తిప్పడం, అయ్యే పని కాదు. అయితే పంజాబ్’ లో పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్ గెలుపుకు దారులు ముసుకు పోతున్నాయి,అనిపిస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చన్నీ, పీసీసీ చీఫ్ నవజ్యోతి సింగ్ సిద్దు మధ్య రాహుల్ గాంధీ కుదిర్చిన సంధి మూడు నాళ్ళ ముచ్చటగానే తేలిపోయింది. సిద్దు మౌనంగా ఉన్నా, ఆయన వర్గం, ముఖ్యంగా ఆయన భార్య, కుమార్తె ముఖ్యమంత్రి చన్నీపై నిప్పులు చేరుగుతున్నారు. అవినీతి సహా అన్ని రకాల ఆరోపణలు చేస్తున్నారు. నిజానికి, చాలా కాలంగా, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఉన్నా, ఎన్నికల సమయానికి అయినా వేడి తక్కుతుందని భావించారు.కానీ, పోలింగ్’కు ఇంకా పట్టుమని పదిరోజులు అయినా లేక పోయినా ఈరోజుకు కూడా కుమ్ములాటలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవంక తాజాగా, పంజాబ్’కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి అశ్వనీకుమార్ పార్టీకి రాజీనామా చేశారు.ఈ మేరకు పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి రాజీనామా లేఖను పంపారు. పార్టీని వీడాలనే నిర్ణయం బాధాకరమన్నారు. ఆలోచనాత్మకంగా పరిశీలించిన తరువాత.. ‘ప్రస్తుత పరిస్థితుల్లో‘వ్యక్తిగత గౌరవార్థం’ ‘పార్టీని వీడివెళ్లడమే ఉత్తమంగా భావించానని తెలిపారు. ఆయన మర్మగర్భంగా ‘వ్యక్తిగత గౌరవార్థం’ అనే పదం వాడినా, కాంగ్రెస్’లో సేనియర్లకు గౌరవం లేదనే బాధతోనే ఆయన పార్టీని వదిలి వెళ్ళినట్లు భావిస్తున్నారు. ఇప్పటికీ, పంజాబ కాంగ్రీస్’లో సీనియర్ నాయకులు చాలా వరకు పార్టీని వదిలి పోయారు.మనీష్ తివారీ వంటి వారు మౌనంగ ఉండిపోయారు. కాగా,నాలుగు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న అశ్వనీకుమార్, పార్టీ అధ్యక్షరాలు సోనియా గాంధీకి విధేయుడిగా, ఉన్నారు. ఆయన తొలుత 1976లో గురుదాస్‌పూర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా పార్టీలో చేరారు. ఆ తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ ఆఫీస్ బేరర్‌గా పని చేశారు. 1990లో చంద్రశేఖర్ ప్రభుత్వంలో అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా నియామకమయ్యారు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి, స్పీకర్‌గా పని చేశారు. అశ్వనీకుమార్ 2002లో రాజ్యసభకు ఎన్నికవగా.. 2016 వరకు కొనసాగారు. మాజీ ప్రధాని మన్మోహన్‌కు ఆయన అత్యంత సన్నిహితుడు. 2006లో కేంద్ర మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత 2011లో మళ్లీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్ మంత్రి, అనంతరం 2009 - 2014 మధ్య కాలంలో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయ మంత్రిగా పనిచేశారు. తాజాగా మాజీ మంత్రి సైతం గుడ్‌బై చెప్పడం పెద్ద దెబ్బగానే రాజకీయ విశ్లేషకులుభావిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/big-shock-to-punjab-congress-39-131849.html





