కేసీఆర్‌కు ఎదురు దెబ్బ.. నమ్మలేమబ్బా..!
Publish Date:Feb 16, 2022
Advertisement
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్’ కేంద్ర ప్రభుత్వం పై యుద్ధం ప్రకటించారు. జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పేందుకు సిద్దమై పోయారు.అంతే కాదు, దేశం మొత్తం ఆయన రాకకోసం వేయి కళ్ళలో ఎదురుచూస్తోందని స్వయంగా, ఆయనే ప్రకటించుకున్నారు. ఒకటి రెండు రోజుల్లో ముంబై వెళ్లి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ థాకరేను కలుస్తున్నానని, ఒకటి రెండు వారాలుగా చెపుతూనే ఉన్నారు కానీ, ఎందుకనో ముంబై వెళ్ళలేదు థాకరేను కలవ లేదు.అయితే ఇప్పుడ తాజాగా, ఈ నెల 20 న ఉద్దవ్ థాకరే ఈనెల ఫిబ్రవరి 20న కేసీఆర్’ కు అప్పాయింట్మెంట్ ఇచ్చి నట్లు సమాచారం. అయితే, చెన్నై ట్రిప్ లానే ముంబై ట్రిప్ కూడా ఉంటుందో లేక అందుకు భిన్నంగా ఉంటుందో చూడ వలసి ఉంది. అయితే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మతతత్వ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సర్వత్రా మద్ధతు లభిస్తున్నదని తెరాస నాయకులు పోటాపోటీగా ప్రకటనలు చేస్తున్నారు. మాజీ ప్రధాని, జనతాదళ్ (సెక్యులర్) జాతీయ అధ్యక్షుడు హెచ్‌డీ దేవేగౌడ కూడా కేంద్రం పై కేసీఆర్ చేస్తున్న, ‘యుద్ధా’ నికి ముగ్ధుడై, ముచ్చట పడి మద్దతు ప్రకటించారని, తెరాస నాయకులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. అది నిజం అవునో కాదో తెలియదు కానీ, దేవేగౌడ లేదా జేడీఎస్ అధికారికంగా అలాంటి ప్రకటన ఏదీ చేయలేదు. అయినా, జేడీఎస్ పేరుకు జాతీయ పార్టీనే అయినా, కర్ణాటకలోనే జేడీఎస్ ప్రాంతీయ పార్టీకి తక్కువ ఉప ప్రాంతీయ పార్టీ ఎక్కువగా అన్నట్లుగా ఉంటుంది. లోక్ సభలో ఉన్న సింగిల్ మెంబెర్ పార్టీలలో జేడీఎస్ కూడా ఒకటి. నిజానికి గత ఎన్నికల్లో దేవే గౌడ్ ఓడి పోయారు. ఆయన కుమారుడు రేవన్న ఒక్కరే గెలిచారు. అదలా ఉంటే, కేసీఆర్’ను జాతీయ, ప్రాంతీయ పార్టీల నాయకులు ఎవరూ విశ్వసించడం లేదని, విశ్వసనీయ సమాచారం. అంతే కాదు, ఎక్కడో ఉన్న మమత, ఇంకెక్కడో ఉన్న స్థాలిన్, ఉద్దవ్ థాకరే, నవీన్ పట్నాయక్ మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాలలో ఏ ఒక్క పార్టీ,ఏ ఒక్క పార్టీ కూడా కేసీఆర్’ ను నమ్మేందుకు సిద్దంగా లేదు.నిజానికి తెలంగాణ ఉద్యమంలో ఆయన వెంటవున్న, ప్రొఫెసర్ కోదండరామ్ వంటి వారే ఆయన్ని విశ్వసించడం లేదు. బయటకు వెళ్లి సొంత పార్టీలు పెట్టుకుని, ఆయనకు వ్యతిరేకంగా కాంగ్రెస్, బీజేపీలతో జట్టు కడుతున్నారే కానీ, కేసీఆర్’ను నమ్మేందుకు మాత్రం సిద్దంగా లేరు. తెలంగాణ ఉద్యమమంలో ఆయనతో కలిసి పనిచేసిన వారే, ఆయన్ని నమ్మనప్పుడు, పొరుగు రాష్ట్రాల వారు ఎలా కేసీఆర్’ ను నమ్ముతారని తెరాస నాయకులే గుస గుసలు పోతున్నారు. నిజానికి, విశ్వసనీయ సమాచారం మేరకు గతంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్’లోనే కాకుండా, జాతీయ స్థాయిలోనూ చక్రం తిప్పిన, ఓ ముఖ్య నేతతో కేసీఆర్ రాయబారం నడిపారు. అయిందేదో అయింది, మళ్ళీ మనం కలిసి పని చేద్దామని, స్వయంగా ఆయనే ఆ నేతకు ఫోన్ చేసి, ‘ప్రపోజ్’ చేశారు. అయితే, సదరు నేత, సున్నితంగా తిరస్కరించదమే కాకుండా, ‘యు లాస్ట్ యువర్ క్రెడిబిలిటీ’ అని ముఖం మీదనే చెప్పినట్లు సమాచారం. క్రెడిబిలిటీ కోల్పోయిన తర్వాత మనుగడ కష్టమని, ఎవరూ నిన్ను నమంరు , నీతో రారు అని సదరు నేత స్పష్టం చేసినట్లు సమాచారం. అదలా ఉంటే, ఇంతవరకు జాతీయ స్థాయిలో గుర్తింపుకోసం కేసీఆర్ చేసిన ప్రయత్నాలు ఏవీ ముందుకు సాగలేదని, పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. గతంలో ఒక సారి ఫెడరల్ ఫ్రంట్ అన్నారు.. ఇంకొక సారి ఇంకేదో ఫ్రంట్ అన్నారు. హైదరాబాద్’లో కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీల నాయకులతో మహా సమ్మేళనం (కాంక్లేవ్) అన్నారు, ఇప్పుడు ఊరూ పేరూ లేకుండా, అయితే ఫ్రంటు కాదంటే టెంటు (పీకేసేందుకు వీలుగా కావచ్చు) అంటున్నారు. ఆవెంటనే, జాతీయ పార్టీ అంటున్నారు. అందుకే తెరాస నాయకులు కూడా జాతీయ రాజకీయాల విషయంలో ఆయనకే స్పష్టత లేదని, ఎక్కడో, ఎదో కొడుతోందని అంటున్నారు. నిజానికి గతాన్ని పక్కన పెట్టి ప్రస్తుతానికి వచ్చినా, దైవ దర్శనం పేరున, కుటుంబ సమేతంగా చెన్నై వెళ్లి, డిఎంకే అధినేత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్’ ను కలిసి వచ్చారు. స్టాలిన్ పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రికి ఇవ్వవలసిన గౌరవం ఇచ్చారు. మంచి విందు ఇచ్చారు. కానీ, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, కేసీఆర్’తో రాజకీయ చెలిమి గురించి ఒక్క మాట మాట్లాడలేదు. ఇప్పుడు, కూడా గవర్నర్ వ్యవస్థకు సంబందించిన వివాదం, కేంద్ర రాష్ట్ర సంబంధాల పై చర్చించేందుకు, బీజేపీ యేతర ముఖ్యమంత్రుల సమావేశం అంటున్నారే, కానీ, జాతీయ కూటమి ఏర్పాటు ప్రస్తావన స్టాలిన్ ఇంతవరకు చేయలేదు. అలాగే, నవీన్ పట్నాయక్, ఉద్దవ్ థాకరే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసేఆర్’ వస్తానంటే రమ్మన్నారే కానీ, ఆయనతో కలిసి పనిచేసే ప్రశ్నే ఉత్పన్నం కాదని, అటు శివసేన, ఇటు బిజూ జనతా దళ్ వర్గాల సమాచారంగా చెపుతున్నారు. కేసీఆర్’ ఎవరు మహా రాష్ట్రలో ఆయన్ని ఎవరు గుర్తు పడతారు, అని సేన నాయకులు ఎదురు ప్రశ్నిస్తున్నారు. బిజు జనతాదళ్ నాయకులూ అయితే, ఇంకొక సాఐ ఆ ప్రస్తవన తమ వద్ద తేవద్దని, మీడియా మిత్రులను కోరుతున్నారు. దీని బట్టి చూస్తే, కేసీఆర్’ ‘క్రెడిబిలిటీ’ విశ్వసనీయత విషయంలో ఎవరకీ ఎలాంటి అనుమానాలు లేవు.సిపిఐ నారాయణ అన్నట్లుగా, ఆయన్ని ఎవరు నమ్మరు. నమ్మడం లేదు. అయినా ఇంట గెలిచి రచ్చ గెలవలంటారు, కేసీఆర్ వెంట నడిచేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉన్నా ప్రాంతీయ పార్టీలలో ఏ ఒక్క పార్టీ ముందుకు రాలేదు. అందుకే, ఆయన తనను తానూ గొప్పగా ఉహించుకుంటూ, ఇలాంటి టక్కుటమార గజకర్ణ గోకర్ణవిధ్యలన్నీ ప్రదర్శిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/credibility-problem-with-kcr-national-politics-39-131853.html





