కొండాపై పోటీకి సిద్ధమవుతున్న గండ్ర
Publish Date:Mar 17, 2012
Advertisement
వరంగల్ జిల్లా పరకాల అసెంబ్లీ నియోజకవర్గానికి జరగబోయే ఎన్నికల్లో తాజా మాజీ కొండా సురేఖపై పోటికి గండ్ర జ్యోతిని నిలపాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. గండ్ర జ్యోతి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సతీమణి. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న గండ్ర జ్యోతి కొంతకాలం క్రితం వరకు వరంగల్ నగరపాలక సంస్థతో కార్పోరేటర్ గా బాధ్యతలు నిర్వహించారు. భూపాలపల్లి నియోజకవర్గం పక్కనే ఉండటం, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి స్వగ్రామం పరకాల కావడంతో ఆయన సతీమణి గండ్ర జ్యోతి పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ రాజకీయాల్లో అడుగుపెట్టేందుకు దోహదపడింది. ఈ నియోజకవర్గంలో పోటికి ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలు సిద్ధమయ్యాయి. తెలుగుదేశం పార్టీ, తెలంగాణా రాష్ట్ర సమితి అభ్యర్ధులకోసం అన్వేషిస్తున్నాయి. టిడిపి తరపున ఇక్కడ చల్లా ధర్మారెడ్డి పోటీచేసే అవకాశాలు ఉన్నాయి. టిఆర్ఎస్ టిక్కెట్ రేసులో మొలుగూరి భిక్షపతి ముందున్నారు. అయితే ఇక్కడ పోటికి మాజీ ఎంపి వినోద్ కుమార్ పేరు కూడా వినిపిస్తోంది. బిజెపి కూడా ఇక్కడ తన అభ్యర్ధిని రంగంలోకి దింపిబోతోంది. ఆ పార్టీ తరపున రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పోటీ చేయవచ్చునని తెలుస్తోంది.
http://www.teluguone.com/news/content/warangal-dist-parakala-constituency-konda-surekha-bypoll-24-12722.html





