Publish Date:Oct 10, 2019
వాల్తేరు డివిజన్ కోసం విశాఖలో పోరాటాలు ఉధృతం అవుతున్నాయి. ఎంతో సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ డివిజన్ ను రద్దు చేయడం పట్ల ఆందోళన వ్యక్తం అవుతోంది. వాల్తేరు డివిజన్ లేకుండా రైల్వే జోన్ ప్రకటించినప్పట్నుంచి అసంతృప్తి కనిపిస్తోంది. ప్రజల మనోభావాలకు అనుగుణంగా కొన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు వాల్తేరు డివిజన్ పునరుద్దరణ కోసం ఉద్యమ బాట పట్టాయి.ఎన్నికల ముందు విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటించిన ఆంధ్ర ప్రజలు సంతోషంగా లేరు. అందులోనూ ఉత్తరాంధ్ర వాసులైతే తీవ్ర అసంతృప్తి తో ఉన్నారు. అందుకు ప్రధాన కారణం ఎంతో చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్ లేకుండా జోన్ ప్రకటించటమే.వాల్తేరు డివిజన్ ను పునరుద్దరించాలని జోన్ ప్రకటించినప్పట్నుంచి డిమాండ్ లు ఎక్కువయ్యాయి. దీనిని గమనించిన కొన్ని వామపక్షాలు, ప్రజా సంఘాలు వాల్తేరు డివిజన్ పునరుద్ధరణ కోసం తరచూ రౌండ్ టేబుల్ సమావేశాలు ధర్నాలు చేస్తూ ప్రజాభిష్టం మేరకు పోరాటాలు చేస్తున్నాయి. తాము నిర్వహించే సమావేశాలకు పలు రాజకీయ పార్టీలను మేధావులను ప్రజా సంఘాలను ఆహ్వానిస్తున్నాయి. వారి సలహాలు సూచనలు తీసుకుని పోరాటాలను ఉధృతం చేస్తున్నాయి.
వాల్తేరు డివిజన్ ను కొనసాగించాలని సీఐటీయూ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించింది. దీనికి అనూహ్యమైన స్పందన లభించింది. దీంతో మిగిలిన రాజకీయ పార్టీ లలో కదలిక ఏర్పడింది. ఉత్తరాంధ్ర ప్రజల సెంటిమెంటును గౌరవించకపోతే తాము వెనకబడిపోతామేమోనని ప్రధాన పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. దీంతో రేపో మాపో ప్రధాన పార్టీలు కూడా ఉద్యమంలోకి వచ్చే అవకాశముంది. వాల్తేరు డివిజన్ లేకుండా ప్రత్యేక రైల్వే జోన్ ఇవ్వడం ప్రజలనూ వంచించడమేనని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింగ రావు విమర్శించారు.చిత్రమేంటంటే ప్రత్యేక రైల్వే జోన్ కావాలని వాల్తేరు డివిజన్ పునరుద్ధరణ చెయ్యాలని గతంలో ఆందోళన చేసిన టిడిపి, వైసిపి ఇప్పుడు మౌనం వహిస్తున్నారు. బిజెపి నేతలు మాత్రం ప్రత్యేక రైల్వే జోన్ ఇచ్చారు కదా వాల్తేరు డివిజన్ లేకపోతే ఏమవుతుంది అన్నట్లు వ్యవహరిస్తున్నారు. కానీ వామపక్షా లు, ప్రజా సంఘాలు, కళాకారుడు మాత్రం వాల్తేరు డివిజన్ పునరుద్ధరణ చెయ్యా లని బలంగా కోరుకుంటున్నారు.ప్రత్యేక రైల్వే జోన్ ఉత్తరాంధ్ర లో చిరకాల వాంఛ అని ప్రత్యేక రైల్వే జోన్ ఇస్తామ ని విభజన చట్టం లో కూడా చెప్పార ని నేతలు గుర్తు చేస్తున్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న ఆశతో వాల్తేరు డివిజన్ ను ఎత్తేసి రైల్వే జోన్ ను కేంద్రం ప్రకటించిందని విమర్శిస్తున్నారు.భారతదేశ చరిత్ర లోనే డివిజన్ ఎత్తేసి జోన్ ఇచ్చే ఘటనే లేదని గుర్తు చేస్తున్నారు. ప్రజల మనోభావాలను గుర్తించి వాల్తేరు డివిజన్ ను పునరుద్ధరణ చెయ్యాలని విశాఖ నగర వాసులు డిమాండ్ చేస్తున్నారు.ఇంతకు వాల్తేరు డివిజన్ పునరుద్ధరణ చేస్తారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/waltair-division-25-89919.html
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
This special article looks at Dr. Sarvepalli Radhakrishnan not simply as a philosopher and former President, but as a teacher whose ideas remain deeply relevant today. What would he ask us about education, technology, our children, teachers and the kind of India we are building?
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈరోజు మనకు గురువుగా ఉంటే ఏం చెప్పేవారు? విద్య, విలువలు, టెక్నాలజీ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, దేశ భవిష్యత్తుపై ఆయన ఆలోచనలు ఈరోజు భారతదేశానికి ఎలా మార్గదర్శకంగా నిలుస్తాయి?
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.