కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిది వ్యూహమా? అహంకారమా?

Publish Date:Sep 3, 2026

Advertisement

తెలంగాణ రాజకీయాల్లో   మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇంత కాలం తనకు కేబినెట్ లో స్థానం కావాలంటూ గళమెత్తిన ఆయన తాజాగా సీఎం పదవే తన లక్ష్యమని ప్రకటించి సంచలనానికి తెరలేపారు. గతంలో కేబినెట్ లో తనకు చోటు దక్కకపోవడంపై బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేసి.. సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా విమర్శలు గుప్పించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తనకు మంత్రిపదవి రాకుండా  అడ్డుకుంటున్నారనీ, హైకమాండ్ తనకు మంత్రిపదవిపై స్పష్టమైన హామీ ఇచ్చిందంటూ రేవంత్ లక్ష్యంగా పలు సందర్భాలలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. 

అయితే ఇప్పుడు ఆయన ఒక అడుగు ముందుకు వేసి.. తాను సీఎంను అవుతానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ఆయన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రాజన్న రాజ్యం అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అన్నిటికీ మించి పార్టీలోకి కొత్తగా వస్తున్న నాయకులు కాంగ్రెస్‌ను కబ్జా చేయాలని చూస్తున్నారంటూ ఆయన చేసిన విమర్శలు, వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. పార్టీలో పాత నేతలకు తీరని అన్యాయం జరుగుతోందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేయడం వెనుక పక్కా వ్యూహం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే కోమటి రెడ్డికి ఏ వ్యూహం లేదనీ, అహంభావంతోనే విమర్శలు గుప్పిస్తున్నారనీ కాంగ్రెస్ లోని ఒక వర్గం అంటున్నది. 

కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది.  ఈ నేపథ్యంలో తాను కేవలం  మంత్రి పదవిని  మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు. అదే సమయంలో పరోక్షంగానైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బయటనుంచి వచ్చి పార్టీని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ పరోక్షంగా విమర్శలు గుప్పిస్తున్నారు.  ఇది పార్టీలో రేవంత్ పట్ల వ్యతిరేకులను ఏకతాటిపైకి తీసుకువచ్చే వ్యూహం ఉందన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతోంది. 

అయితే రేవంత్ మద్దతు దారులు మాత్రం.. కోమటిరెడ్డి రాజకోపాల్ రెడ్డి ఏమీ తొలి నుంచీ పార్టీని అంటిపెట్టుకుని లేరంటున్నారు. గతంలో కాంగ్రెస్ ను వీడి బీజేపీ గూటికి చేరిన కోమటిరెడ్డి, ఆ తరువాత   2023 ఎన్నికలకు ముందు  కాంగ్రెస్‌లోకి తిరిగొచ్చి ఎమ్మెల్యేగా గెలిచారని గుర్తు చేస్తున్నారు. మొత్తం  మీద తెలంగాణ కాంగ్రెస్ లో కోమటిరెడ్డి రాజగెపాల్ రెడ్డి ఎపిసోడ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 

 

[Komatireddy Rajagopal Reddy Comments Create Sensation, Rajanna Rajyam, Telangana Congress, Munugode MLA, Revanth Reddy, Telugu One]

By
en-us Political News

  
శంషాబాద్ వద్ద హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఊహించని ఘటన చోటుచేసుకుంది.
దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్‌ (ULC) దరఖాస్తుల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్‌లో కుటుంబ కలహాలు విషాదాంతమయ్యాయి
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పంజాబ్‌లోని ప్రసిద్ధ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ క్యాంపస్‌లో శనివారం రాత్రి ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు.
ఎండిన నదిలో గంగమ్మ పరవళ్లు.. కరువు నేలపై జలకళ.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.