జగన్ పాదయాత్ర ముహూర్తం ఖరారు.. ఎప్పటి నుంచంటే?

Publish Date:Sep 4, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత తన పాదయాత్రకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. 2029 ఎన్నికలలో విజయం సాధించి మళ్లీ అధికారంలోకి రావడమనే ఏకైక లక్ష్యంతో ఆయన చేపట్టబోతున్న పాదయాత్ర వచ్చే ఏడాది జులైలో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజున ప్రారంభించనున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఆ పాదయాత్ర కోసం ఇప్పటి నుంచే గ్రౌడ్ వర్క్ మొదలు పెట్టనున్నారు. 

2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు. అయితే 2019 ఎన్నికలలో విజయం తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జనంతో మమేకమై అధికార పగ్గాలు చేపట్టిన జగన్ అధికారం చేజిక్కిన తరువాత జనానికి ముఖం చాటేశారు. రోడ్లకు ఇరు వైపులా పరదాలు కట్టుకుని మరీ పర్యటనలు సాగించారు.

అలాగే పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన వాగ్దానాల అమలు అటుంచి, ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో కూడా పట్టించుకోవడం మానేశారు.   ఈ నేపథ్యంలో  ఈసారి జగన్ పాదాయత్రకు రాజకీయ సమీకరణాలు  భిన్నంగా ఉన్నాయి. గతంలో 2019 ఎన్నికల ముందు చేపట్టిన పాదయాత్ర ద్వారా ప్రజల్లో అపారమైన నమ్మకాన్ని సంపాదించుకున్నప్పటికీ, ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక కొన్ని ఆ నమ్మకాన్ని   నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారని వైసీపీయులే చెబుతున్నారు. రాజకీయ పరిశీలకులు సైతం.. 2017లో పాదయాత్రకు లభించిన ప్రాజాదరణ ఈ సారి అనుమానమేనని విశ్లేషిస్తున్నారు.  

అది పక్కన పెడితే.. సెంటిమెంట్ ప్రకారం వైయస్ఆర్ జయంతి నాడే యాత్రను ప్రారంభించడం ప్రజలకు దగ్గర కావడానికి, వారి విశ్వాసాన్ని తిరిగి పొందడానికి దోహదపడుతుందని జగన్ విశ్వసిన్తున్నారు. వచ్చే ఏడాదిజులై నుంచి జగన్ పాదయాత్రకు సంబంధించిన ప్రకటన ఇంకా అధికారికంగా వెలువడకపోయినా.. పార్టీ వర్గాలు మాత్రం పాదయాత్రకు అదే ముహూర్తం ఖారరైందని గట్టిగా చెబుతున్నాయి.  2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తరువాత ఈ రెండేళ్ల కాలంలో పెద్దగా జనంలోకి వచ్చిన దాఖలాలు లేవు.

జగన్ కూడా చుట్టపు చూపుగా రాష్ట్రానికి రావడం వినా.. ఎక్కువగా బెంగళూరు ప్యాలెస్ కే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో  పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశలో మునిగిపోయాయి. ఇక ఒకరిద్దరు వినా పార్టీ నేతలు కూడా పొలిటికల్గా ఇన్ యాక్టివ్ అయ్యారు. ఈ పరిస్థితుల్లో పార్టీని బలోపేతం చేయాలంటే.. పాదయాత్ర వినా మరో మార్గం లేదని జగన్ భావిస్తున్నారు.  ఈ కారణంతోనే ఎన్నికలకు రెండేళ్లు ముందే పాదయాత్ర చేపట్టడం ద్వారా నిరంతరం జనంలో ఉండేలా పాదయాత్రను ఎంచుకున్నారు.   

[Jagan Padayatra From July 2027, jagan padayatra 2.0, ys jagan mohan reddy, ap politics, ysr jayanthi,, andhra pradesh News, Telugu One]

By
en-us Political News

  
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు.
ఎండిన నదిలో గంగమ్మ పరవళ్లు.. కరువు నేలపై జలకళ.!
చెన్నైలో బీఎస్ఎఫ్ నూతన భవనాలను ప్రారంభించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి
ప్రస్తుత కాలంలో డిజిటల్ మాధ్యమాలు విద్య, విజ్ఞానాన్ని ప్రజలకు మరింత చేరువ చేస్తున్నాయి.
ప్రజాస్వామ్య వ్యవస్థలో   నైతికత, విలువలు పలుచన అయిపోతున్నాయి.   ఏ పార్టీ నుంచి గెలిచామనే అంశంతో సంబంధం లేకుండా, వ్యక్తిగత ప్రయోజనాలు, అధికార కాంక్ష,  రాజకీయ లబ్ధికి మాత్రమే పెద్ద పీట వేస్తున్న నేతలే ఎక్కువగా కనిపిస్తున్నారు
గత కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఒకింత జోరు తగ్గించిన వంగవీటి రాధా.. ఉన్నట్టుండి జనసేనానిని తో భేటీ అవ్వడం, అదీ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల వేడి రగిలిన సమయంలో కలవడం వెనుక పక్కా వ్యూహం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఉద్యోగులను ఉత్సాహపరిచేందుకు ఓ యాజమాన్యం అనుసరించిన సరికొత్త మార్గం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.