విశాఖ దాహార్తి తీర్చడమెలా?
Publish Date:Mar 7, 2012
Advertisement
విశాఖపట్నం: దినదినాభివృద్ధి చెందుతున్న విశాఖ మహానగరాన్ని ఇప్పటికే కాలుష్యభూతం వేధిస్తోంది. ఇప్పుడు తాజాగా అ నగరానికి మంచినీటి సమస్య ఎదురయింది.లక్షలాది నగరవాసులకు అధికారులు సరిపడా మంచినీటిని అందజేయలేకపోతున్నారు. ఈ నగరానికి నీరు అందించాల్సిన ఏలేరు కెనాల్, గోదావరి నది, రైవాడ, ఎమ్ జి ఆర్, తాడిపూడి, గోస్తనీ, ముడసర్లోవా రిజర్వాయర్లలో నీటిమట్టం కనిష్టస్థాయికి చేరుకుంటున్నాయి. ఏలేరు కెనాల్ కనిష్టస్థాయికి చేరుకుంటున్నాయి. ఏలేరు కెనాల్ కనిష్టస్థాయి 68 మీటర్లు ఉండగా, ప్రస్తుతం 72 మీటర్ల వరకూ నీటి నిల్వలున్నాయి. గోదావరిలో కనిష్టస్థాయి 10మీటర్లు కాగా, ప్రస్తుతం 12 మీటర్లు, రైవాడలో కనిష్టనీటి నిల్వల స్థాయి 99మీటర్లు కాగా, ప్రస్తుతం 105 మీటర్లు, తాటిపూడి రిజర్వాయర్ లో కనిష్టస్థాయి 250 అడుగులు కాగా, ప్రస్తుతం 260 అడుగులు, గోస్తనీలో కనిష్టస్థాయి 21 అడుగులు ఉండాల్సి ఉండగా 27 అడుగుల నీళ్ళు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో వర్షాలు కురవకపోతే ఈ నిల్వలు మరింత అడుగంటి విశాఖకు తీవ్ర నీటిఎద్దడి ఏర్పడే ప్రమాదముంది.
http://www.teluguone.com/news/content/visakhapatnam-24-12454.html





