జూపల్లి ఓట్లకు జబ్బార్ గండి?

Publish Date:Mar 7, 2012

Advertisement

మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లా కొల్హాపూర్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న జూపల్లి కృష్ణారావు ఓట్లకు సిపిఎం అభ్యర్ధి జబ్బార్ గండికొట్టే ప్రమాదం ఉన్నట్లు తెలిసింది. తెలంగాణా వాదం పేరుతో జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీకి, మంత్రి ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు సిద్దమయ్యారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మామిళ్ళపల్లి విష్ణువర్దన్ రెడ్డి, టిడిపి నుంచి ముష్టిపల్లి జగదీశ్వరరావు, సిపిఎం తరపున జబ్బార్ పోటీ చేస్తున్నారు. జబ్బార్ కు ఈ నియోజకవర్గంలో బలహీన, బడుగు వర్గాల్లో మంచి పేరుంది. ఈ నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా సంబంధిత అధికారులతో మాట్లాడి పనులు జరిగేలా చూస్తారన్న పేరుంది. అనేకమంది పేదలకు పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్ళు ఆయన ఇప్పించగలిగాడు. ఈయన గెలిచే అవకాశం లేకపోయినప్పటికీ గణనీయంగా ఓట్లుపొందే పరిస్థితి నియోజకవర్గంలో ఉంది. జూపల్లికి ఖాయంగా పడతాయనుకుంటున్న ఓట్లతో కొన్ని జబ్బార్ చీల్చుకునే ప్రమాదం ఉందని స్వయంగా జూపల్లి అనుయాయులే అంగీకరిస్తున్నారు. జబ్బార్ ఎన్ని ఓట్లు ఎక్కువగా పొందితే జూపల్లికి అంత ఎక్కువ నష్టం జరుగవచ్చునని వారు భయపడుతున్నారు. జబ్బార్ కు ఓటు వేసినా ఆయన గెలవదని, ఆయనకు వేసే ఓటు వ్యర్ధమవుతుందని టిఆర్ఎస్ నాయకులు ప్రచారం చేస్తున్నారు. అయినా పెద్దగా ఫలితం కనిపించడం లేదు.

By
en-us Political News

  
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.
కనీస నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించకుండా, పరిశుభ్రత, నాణ్యత గురించి పట్టించుకోకుండా నడుపుతున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవలి కాలంలో  దాడులు నిర్వహించి, నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలను బేఖాతరు చేసి మరీ నడుపుతున్న పలు హోటళ్లు రెస్టారెంట్లను సీజ్ చేసి, వాటి లైసెన్సులను రద్దు చేశారు.   
గత కొన్ని నెలల తో పోలిస్తే.. ఇప్పుడు న్యూ రిక్రూట్ మెంట్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రధానంగా  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, బ్యాంకింగ్, ధ సేవా రంగాల్లో ఉద్యోగాల భర్తీ ఓ రేంజ్ స్పీడ్ లో సాగుతోంది. 
రాష్ట్ర రాజధాని నగరంలోని ప్రముఖ నియోజకవర్గాల్లో ఒకటైన ఖైరతాబాద్‌లో జరగబోయే రాజకీయ పోరుపై గులాబీ పార్టీ శిబిరంలో సర్వత్రా ధీమా వ్యక్తమవుతోంది.
హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించి ఏనుగు దంతాల అక్రమ విక్రయాల వ్యవహారాన్ని గుట్టురట్టు చేశారు.
హైదరాబాద్‌ నగరంలోని పాతబస్తీ అంటేనే చరిత్రకు చిరునామా.... నగర నిర్మాణం, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు శతాబ్దాల నాటి జలవనరులు కూడా నేటికీ ఆనాటి వైభవాన్ని గుర్తు చేస్తుంటాయి.
హైదరాబాద్ రాజకీయాల్లో ఓట్ల తొలగింపు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.
ఏడడుగులు కలిసి నడిచిన నాటి నుంచి ఒకే బాటగా జీవన పయనం సాగించిన ఆ వృద్ధ దంపతులు..   అంతిమ అడుగు కూడా కలిసే వేశారు. కలిసి బతికిన వారు కలిసే తనువు చాలించారు.
గతంలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన కొందరి వ్యక్తుల పేర్లపై ఉన్న ఆస్తులు, ఇటీవల  కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట బదిలీ అయ్యాయన్న రేవంత్ రెడ్డి..  హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఖరీదైన ఆస్తులు, ఫైవ్ స్టార్ హోటళ్లు, అపార్ట్‌మెంట్లు, సర్వీస్ ప్రాపర్టీల వివరాలను వెల్లడించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. జిల్లాలో మొత్తం రూ.345.78 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఉపాధి కోసం రష్యా వెళ్లిన తెలంగాణకు చెందిన నలుగురు యువకులు అనూహ్యంగా అక్కడి మిలిటరీ క్యాంపులో చిక్కుకున్నారని వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త చర్చకు తెరలేచింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.