మణిపూర్ లో మళ్లీ ప్రజ్వరిల్లిన హింస.. 20 గృహాలు దగ్ధం

Publish Date:Jul 2, 2026

Advertisement

ఈశాన్య రాష్ట్రమైన  మణిపూర్‌లో  మళ్లీ హింస ప్రజ్వరిల్లింది.   భారత్-మ్యాన్మార్ సరిహద్దు ప్రాంతంలో తెగల మధ్య నెలకొన్న పాత పగలు మళ్లీ  ఒక్క సారిగా భగ్గుమన్నాయి. మణిపూర్‌లోని కమ్‌జాంగ్ జిల్లా సరిహద్దు గ్రామాలు బుధవారం (జులై1)   హింసాత్మక ఘర్షణలు, పరస్పర దాడులలతో  దద్దరిల్లిపోయాయి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.  ఒకవైపు కుకీ వర్గానికి చెందిన గ్రామం, మరోవైపు తంగ్‌ఖుల్ నాగా తెగకు చెందిన ఆవాసాలు లక్ష్యంగా చేసుకుని   దుండగులు జరిపిన   దాడుల్లో  20కి పైగా ఇళ్లు  అగ్నికి ఆహుతయ్యాయి. గత కొంత కాలంగా   ఉన్న ప్రశాంతత ఈ ఘటనతో పటాపంచలైంది.  

  బుధవారం (జులై1)  ఇండో-మ్యాన్మార్ సరిహద్దు పిల్లర్ నంబర్ 113 సమీపంలో ఉన్న ఫైమోల్ అనే కుకీ గ్రామంపై గుర్తుతెలియని సాయుధ మూకలు ఒక్కసారిగా దాడికి తెగబడ్డాయి. చస్సాద్ పోలీస్ స్టేషన్‌కు సమీపంలోని  ఈ గ్రామంలోని ఇళ్లకు దుండగులు నిప్పు పెట్టారు. అయితే..  ఆ ప్రాంతంలో ముందే ఉద్రిక్తతలు ఉండటంతో ఫైమోల్ గ్రామంలోని ప్రజలందరూ ముందే ఇళ్లను ఖాళీ చేసి, 11 అస్సాం రైఫిల్స్ క్యాంప్ రక్షణలో ఉన్న ఐషి గ్రామంలో తాత్కాలిక ఆశ్రయం పొందుతున్నారు. ఈ కారణంగా ప్రాణనష్టం తప్పినప్పటికీ, గ్రామంలో  15 ఇళ్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి.   అస్సాం రైఫిల్స్ తమ భద్రతా పోస్టును అక్కడి నుంచి ఉపసంహరించుకున్న మరుసటి రోజే ఈ దారుణం జరిగిందని కుకీ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

ఈ ఘటన జరిగిన కొద్ది నిమిషాల్లోనే, సరిహద్దు పిల్లర్ నంబర్ 101 సమీపంలోని షాంగ్‌ఖలోక్ అనే తంగ్‌ఖుల్ నాగా గ్రామంపై ప్రతీకార దాడులు ప్రారంభమయ్యాయి.  ఈ క్రమంలో షాంగ్‌ఖలోక్‌తో పాటు సమీపంలోని హుయిమినే థానా అనే నాగా సరిహద్దు గ్రామంలోని 7 ఇళ్లను పూర్తిగా కాల్చివేశారు. షాంగ్‌ఖలోక్ గ్రామంలోని మరో 7 నాగా ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.   

By
en-us Political News

  
సోషల్ మీడియాలో పరిచయం.. ఆ తర్వాత స్నేహం.. వ్యక్తిగత వివరాల సేకరణ.. చివరకు బ్లాక్‌మెయిల్! హైదరాబాదు నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్‌
హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలోని కేబీఆర్ పార్క్ చుట్టూ చేపట్టనున్న అండర్‌పాస్, ఫ్లైఓవర్ నిర్మాణ పనుల నేపథ్యంలో ఈ నెల 18వ తేదీ నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.
వేగవంతమైన డిజిటల్ కనెక్టివిటీ ప్రజల జీవితాలను, వ్యాపార ఆశయాలను ఎలా మారుస్తుందో తెలుసుకోండి. వోడాఫోన్ సర్వేలోని కీలక గణాంకాలు, విజయావకాశాలు మరియు ఎదురవుతున్న సవాళ్లపై ప్రత్యేక కథనం.
పెళ్లైన ఆరు నెలల్లోనే విషాదం..!
ఆస్ట్రేలియా సెన్సస్ 2026 గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి. ఆగస్టు 11 సెన్సస్ నైట్ తేదీ, నిబంధనలు, AU$364 జరిమానాలు, ఎవరు అర్హులు మరియు హెల్ప్‌లైన్ సమాచారం ఇక్కడ చూడండి.
జంతర్ మంతర్‌లో ఓ న్యాయం.. ఝార్ఖండ్‌లో మరో న్యాయమా..!
లీప్ ఇండియా ఐపీఓ LEAP India IPO బిడ్డింగ్ చివరి రోజు సబ్‌స్క్రిప్షన్ స్టేటస్, గ్రే మార్కెట్ ప్రీమియం GMP , ఐపీఓ ధర, లిస్టింగ్ తేదీలు మరియు విశ్లేషకుల సబ్‌స్క్రైబ్ రేటింగ్స్ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం 1.75 లక్షలకు పైగా యూఎస్ వీసాలను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. నేరారోపణలు, బర్త్ టూరిజం, $5 మిలియన్ల ఆర్థిక స్కామ్‌లు మరియు సోషల్ మీడియా పోస్టులే ప్రధాన కారణంగా వీసాల వేటు పడింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
గౌతమ్ అదానీపై అమెరికా కోర్టులో ఉన్న సంచలనాత్మక లంచం మరియు మోసం కేసును యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు శాశ్వతంగా కొట్టివేసింది. ఈ చారిత్రాత్మక తీర్పుతో అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ పోర్ట్స్ షేర్లు భారీగా లాభపడ్డాయి. సంపూర్ణ కథనం కోసం చదవండి!
విశాఖపట్నంలో ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆగస్టు 11న దేశీయంగా బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీలతో సహా ప్రధాన నగరాల్లో 24K, 22K మరియు 18K బంగారం లేటెస్ట్ రేట్లు ఎంత పెరిగాయో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
శ్రీలంకతో జరగబోయే టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టులోకి సర్ఫరాజ్ ఖాన్ పునరాగమనం చేయడంపై మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్పిన్ ట్రాక్‌లపై ధృవ్ జురెల్ కంటే సర్ఫరాజ్ ఖానే ఎందుకు సరైన ఎంపికో కైఫ్ విశ్లేషించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.