వల్లభనేని వంశీ అరెస్టు ఓకే.. కొడాలి నాని వంతెప్పుడు?

Publish Date:Feb 13, 2025

Advertisement

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని అరెస్టు వార్త గురువారం (ఫిబ్రవరి 13) ఉదయమే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆయన ముందస్తు బెయిలు కోర్టులో పెండింగ్ లో ఉండగా ఎలా అరెస్టయ్యారన్న అనుమానాలు వ్యక్తమైనా, గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో కాకుండా మరో కేసులో వల్లభనేని వంశీ అరెస్టయ్యాడని తెలియడంతో ఆ కేసేమిటా అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అయ్యింది. అనుమానాలన్నీ వల్లభనేని అరెస్టు వార్త వాస్తవం కాదేమోనన్న సంశయంతోనే తప్ప ఆయన అరెస్టుకు నిరసనగా కాదని, ఆ తరువాత ఆయన అరెస్టుపై జనస్పందన చూసిన తరువాత అర్ధమైంది.

ఇంతకీ వల్లభనేని వంశీ  గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి జరిగిందంటూ ఫిర్యాదు చేసిన తెలుగుదేశం కార్యాలయంలో డీటీపీ ఆపరేటర్ గా పని చేసిన సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదరించిన కేసులో పోలీసులు వంశీని హైదరాబాద్ లో అరెస్టు చేసి విజయవాడకు తరలించారు. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు చేసిన సత్యవర్థన్ ను కిడ్నాప్ చేసిన వల్లభనేని వంశీ, ఆ కేసు వెనక్కు తీసుకోవాలని బెదరించారన్నది పోలీసుల అభియోగం. ఈ విషయంలో  వల్లభనేని వంశీ అడ్డంగా దొరికిపోయాడు. దాడి కేసులో ఫిర్యాదు ఉపసంహరణకు సత్యవర్ధన్ ను వంశీ స్వయంగా కారులో తీసుకువచ్చిన ఫుటేజీలు ఉన్నాయి. దీంతో క్షణం ఆలస్యం చేయకుండా పోలీసులు వంశీని అరెస్టు చేశారు.

దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ఒక ప్రశ్న వినిపిస్తోంది. వల్లభనేని వంశీ అరెస్టు సరే.. మరి గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని వంతు ఎప్పుడన్నదే ఆ ప్రశ్న. ఈ ప్రశ్న ఉత్పన్నం కావడానికి కారణం ఉంది. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఈ ఇరువురికీ ఓ ప్రత్యేకత ఉంది. ఇద్దరూ మంత్రి మిత్రులు. ఇద్దరి రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభమైంది. అంతకు ముందు ఇద్దరూ తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతలు.  కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇద్దరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ కు మంచి మిత్రులు. ఇద్దరూ కూడా చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో పని చేశారు. కొడాలి నాని గుడివాడ నియోజకవర్గం నుంచి 2004లో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.

వల్లభనేని వంశీ 2009లో విజయవాడ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో  పరాజయం పాలయ్యారు.  కొడాలి నాని మాత్రం 2009లో కూడా గుడివాడ నుంచే పోటీలో నిలిచి తెలుగుదేశం తరఫున విజయం సాధించారు.  ఆ తరువాత రాష్ట్ర విభజన జరిగింది.  2014 ఎన్నికలు వచ్చే సరికి కొడాలి నాని తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీ గూటికి చేరారు. 2014 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా గుడివాడ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. వంశీ మాత్రం తెలుగుదేశం పార్టీలోనే కొనసాగారు. 2014 ఎన్నికలలో గన్నవరం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.  2019 ఎన్నికలో కూడా అదే జరిగింది. కొడాలి నాని గుడివాడ నుంచి వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. గన్నవరం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా వల్లభనేని వంశి గెలుపొందారు. ఇరువురూ పార్టీలు వేరైనా మంచి మిత్రులుగా కొనసాగారు.  2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలై.. రాష్ట్రంలో వైసీపీ అధికార పగ్గాలు చేపట్టింది. దీంతో వల్లభనేని వంశి జగన్ కు మద్దతు తెలుపుతూ  వైసీపీ గూటికి చేరారు. కొడాలి నాని జగన్ తొలి కేబినెట్ లో  మంత్రి పదవి దక్కించుకున్నారు.  

అప్పటి వరకు వేరే పార్టీలో ఉంటున్నా.. కొనసాగిన వంశీ, నానిల స్నేహబంధం, వంశీ తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరడంతో మరింత గట్టి పడింది. వాస్తవానికి కొడాలి నాని ప్రభావంతోనే వంశీ వైసీపీ గూటికి చేరారు.  ఆ తరువాత వల్లభనేని వంశీ, కొడాలి నాని తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ టార్గెట్ గా ఇష్టారీతిగా విమర్శలు వ్యాఖ్యలూ చేస్తూ పెట్రేగి పోయారు. లోకేష్ పై అయితే ఆయన వ్యక్తత్వ హననమే లక్ష్యమన్నట్లుగా విమర్శలు, వ్యాఖ్యలూ చేశారు.  అక్కడితో ఆగకుండా చంద్రబాబు భువనేశ్వరిపైనా అనుచిత వ్యాఖ్యలు చేశారు.  

ఆ తరువాత 2024 ఎన్నికలో వైసీపీ ఘోరంగా ఓడిపోయి అధికారాన్ని కోల్పోయింది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబుబు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. అప్పటి నుంచీ విరిద్దరినీ అరెస్టు చేయాలి అన్న డిమాండ్ తెలుగుదేశం వర్గాల నుంచే కాకుండా, వీరి దాష్టికాల కారణంగా బాధితులుగా మారిన ప్రజల నుంచి కూడా గట్టిగా వినిపించింది. అయినా గత ఎనిమిది నెలలుగా అదిగో, ఇదిగో అనడం తప్ప వీరి అరెస్టు జరగలేదు. ఒక దశలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేతకాని తనం వల్లనే కొడాలి నాని, వల్లభనేని వంశీ స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారని తెలుగుదేశం శ్రేణుల నుంచే విమర్శలు వినవచ్చాయి.  తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వీరిద్దరి మీద కేసులు తెరపైకి తెచ్చారు.  అయితే అరెస్టు మాత్రం చేయలేదు. ఈ నేపథ్యంలోనే వల్లభనేని అరెస్టు పట్ల తెలుగుదేశం వర్గాలలోనే కాకుండా గన్నవరం నియోజకవర్గ ప్రజలలో కూడా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. అదే సమయంలో వల్లభనేని వంశీ అరెస్టు సరు.. కొడాలి నాని వంతెప్పుడు అన్న ప్రశ్నలూ వినవస్తున్నాయి. 

By
en-us Political News

  
కాపు సామాజికవర్గ నేత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పార్టీ లైన్ ను ఇసుమంతైనా ఖాతరు చేయకుండా కాపు ఐక్యత జెండాను భుజానకెత్తుకోవడం పార్టీలో కలకలం రేపింది. ఒక వైపు వైసీపీ అధినేత జగన్.. అంబటి రాంబాబును పార్టీలో కాపు సామాజికవర్గ ఐకాన్ గా ప్రమోట్ చేస్తుంటే.. తోట త్రిమూర్తులు ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలను వేదిక చేసుకుని పార్టీలతీతంగా కాపు నేతలందరూ ఐక్యం కావాలని పిలుపునివ్వడం పార్టీలో కలకలం రేపింది.
ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేతగా, చంద్రబాబు ఇప్పుడు హస్తిన పర్యటనలో పార్లమెంటులో ఈ బిల్లుల ఆమోదానికి అవసరమైన మెజారిటీ కూడగట్టడం కోసం.. వివిధ పార్టీల నాయకులతో చర్చలు జరిపేందుకు ఆయన హస్తినకేగుతున్నారన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
మాస్కుల కొరతపై మాట్లాడిన కొద్ది రోజులకే విశాఖపట్నంలోని అక్కయ్యపాలెం రహదారిపై డాక్టర్ సుధాకర్‌ను పోలీసులుఆయనను అదుపులోనికి తీసుకుని, చొక్కా లేకుండా ఉన్న ఆయన చేతులను వెనక్కి విరిచి కట్టడం, వీధిలో ఈడ్చుకెళ్లి ఆటోలో పడేయడం వంటి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి జాతీయ స్థాయిలో నిరసనలకు దారితీశాయి.
సదరు వివాదాస్పద ఏఈఈ స్థాయి అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, ఇటీవల నిర్వహించిన అంతర్గత సర్దుబాట్లు, పోస్టింగ్‌లలో ఆయనకు కీలక స్థానం దక్కింది. ప్రస్తుతం ఆయన టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో ఏఈఈ హోదాలోనే అత్యంత కీలకమైన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
చట్టపరమైన విచారణ ఎదుర్కొంటున్న నేతలకు రాజకీయ అభయం ఇస్తూ, వారిపై విచారణ అధికార తెలుగుదేశం కూటమి కక్షసాధింపుగా అభివర్ణించే ప్రయత్నం చేయడం జగన్ కు రివాజుగా మారిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రగతి ప్రకటనలో భాగంగా ప్రభుత్వం మొత్తం 10 ప్రధాన అంశాలపై ప్రత్యేక నివేదికలు సిద్ధం చేస్తున్నది. గతంలోని అంటే రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రబుత్వం కొలువుదీరిన తొలి నాళ్లలో విడుదల చేసిన 7 శ్వేతపత్రాల యాక్షన్ టేకెన్ నివేదికలతో పాటు, అభివృద్ధి , సుపరిపాలన, సంక్షేమం, సాధికారత విభాగాలపై సమగ్ర నివేదికలు విడుదల చేయనుంది. అభివృద్ధి నివేదికలో వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక వసతులు, పర్యాటక రంగాల పురోగతిని పొందుపరచగా, సుపరిపాలన నివేదిక ద్వారా నూతన విధానాలు, డిజిటల్ విప్లవం, వాట్సాప్ గవర్నెన్స్ వంటి సేవల వివరాలను అందించనుంది.
అమర రాజా వంటి గ్లోబల్ టెక్నాలజీ సంస్థ వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఏపీలో కాకుండా పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో పెట్టడం ఆంధ్రప్రదేశ్ ఒక గోల్డెన్ ఆపర్చునిటీని చేజార్చుకోవడమేనని ప్రముఖ విశ్లేషకుడు సువేరా అన్నారు. తెలుగువన్ న్యూస్ చానల్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన రాజకీయం, కులం, ప్రాంతీయ విద్వేషాల కారణాలతో ఇటువంటి పారిశ్రామిక దిగ్గజం రాష్ట్రం వీడాల్సి రావడం వల్ల యువతకు రావలసిన ఉపాధి అవకాశాలు చేజారిపోయాయన్నారు.
ఆ నక్కల కారణంగానే తాను తన మార్గాన్ని ఎంచుకుని బయటకు రావాల్సి వచ్చిందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలోని తన మాజీ సహచరులపై తీవ్ర విమర్శలు గుప్పించిన కవిత.. బీఆర్ఎస్‌లోని కొందరు గుంటనక్కల వంటి నేతల బృందం తనను ఒంటరిని చేసి, పక్కన పెట్టడానికి పద్ధతి ప్రకారం పనిచేశారని కవిత చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియ అత్యంత కీలకమైన మలుపుగా మారబోతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు అత్యంత ఉత్కంఠభరిత వాతావరణంలో ప్రారంభం కానున్నాయి.
శాంతిభద్రతల విఘాతం కలగకుండా ఉండేందుకు భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందస్తు భద్రతా వ్యూహంలో భాగంగా సెంట్రల్ ఢిల్లీని దాదాపు తమ అధీనంలోకి తీసుకున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ఈ చలో పార్లమెంట్ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.
తెలంగాణ రాజకీయాల్లో తనదైన విలక్షణ శైలితో నిత్యం వార్తల్లో నిలిచే బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేసినట్లేనా.. అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. గత కొంతకాలంగా ఆయన కారు దిగిపోనున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక వీడియో ఆ ప్రచారానికి బలం చేకూర్చింది. సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్న వేదికపై ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా ఉన్నారు. ఆ వేదికపై ప్రసంగిస్తున్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్నా.. మల్లారెడ్డి పట్టించుకోకుండా చిరునవ్వులు చిందిస్తూ ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు. సొంత పార్టీ అధినేతను అంతగా విమర్శిస్తున్నా మల్లారెడ్డిలో స్పందన లేకపోవడంతో ఆయన కారు దేగేయడం ఖాయమన్న ప్రచారానికి బలం చేకూర్చింది. అలాగే ఇటీవలే.. ఆయన ఒక ప్రైవేటు కార్యక్రమంలో కూడా తాను బీఆర్ఎస్ ను వీడనున్నట్లు సంకేతాలిచ్చారు. వాస్తవానికి.. గత ఎన్నికలలో పరాజయం పాలై బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన నాటి నుంచీ కూడా మల్లారెడ్డి పొలిటికల్ గా ఒకింత ఇనాక్టివ్ అయ్యారనే చెప్పారు. చాలా కాలంగా మల్లారెడ్డి అధికార కాంగ్రెస్ లేదా కమలం గూటికి చేరే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా తన వ్యాపార, విద్యారంగ సంస్థల పరిరక్షణతో పాటు నియోజకవర్గంలో రాజకీయ ఉనికి కోసం ఆయన అధికార పార్టీతో సత్సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నారని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. ఒకప్పుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించిన చామకూర మల్లారెడ్డి.. ఇప్పుడు ఆయన ప్రసంగిస్తున్న వేదికపై కనిపించడం పట్ల కమలం శ్రేణుల్లో కూడా ఆగ్రహం వ్యక్తమౌతోంది. మొత్తం మీద మల్లారెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పడం ఖాయమన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతోంది. అయితే ఆయన కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారా? కాషాయ తీర్థం పుచ్చుకుంటారా అన్న విషయంపై అయితే రాజకీయవర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికే అనేకమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కీలక నేతలు హస్తం గూటికి చేరిన నేపథ్యంలో, మల్లారెడ్డి కూడా అదే బాట పడతారన్న అభిప్రాయమే పరిశీలకులలో కూడా వ్యక్తమౌతోంది. chamakura malla reddy latest news, medchal mla malla reddy, telangana political updates
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.