వైసీపీలో ‘కాపు’ కలవరం.!

Publish Date:Jul 21, 2026

Advertisement

వైసీపీలోని కాపు సామాజిక వర్గ నేతలు తిరుగుబావుటా ఎగుర వేస్తున్నారా? సొంత పార్టీ లైన్ నే దాటుతూ, పార్టీ అధినేతకు తమ ధిక్కార స్వరం వినిపిస్తున్నారా? అంటే జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఔననే సమాధానం వస్తున్నది. పార్టీలో కాపు సామాజికవర్గ నేతల తీరు వైసీపీకి గుబులు పుట్టిస్తోందన్న విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా వైసీసీకి చెందిన   కాపు సామాజికవర్గ  నేత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పార్టీ లైన్ ను ఇసుమంతైనా ఖాతరు చేయకుండా  కాపు ఐక్యత జెండాను భుజానకెత్తుకోవడం పార్టీలో కలకలం రేపింది. ఒక వైపు వైసీపీ అధినేత జగన్..  అంబటి రాంబాబును పార్టీలో కాపు సామాజికవర్గ ఐకాన్ గా ప్రమోట్ చేస్తుంటే..  తోట త్రిమూర్తులు  ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలను వేదిక చేసుకుని పార్టీలతీతంగా కాపు నేతలందరూ ఐక్యం కావాలని పిలుపునివ్వడం పార్టీలో కలకలం రేపింది. 

ఈ క్రమంలోనే టీడీపీకి చెందిన ఎమ్మెల్యే బొండా ఉమ విజయవాడలో నిర్వహించతలపెట్టిన కాపుల ఐక్యత సభకు తాను హాజరవుతానని తోట త్రిమూర్తులు  ప్రకటించడం వైసీపీకి మింగుడు పడటం లేదు.   వైసీపీ అధినేత  జగన్  నిర్ణయాలతో సంబంధం లేకుండా తోట త్రిమూర్తులు  స్వతంత్రంగా కాపు సామాజికవర్గ ఐక్యత నినాదంతో ముందుకు సాగుతుండటంతో  వైసీపీ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడింది. 

అదు విధంగా వైసీపీలో సీనియర్ మోస్ట్ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సైతం కాపు రిజర్వేషన్లు, కాపు సామాజిక వర్గ  హక్కుల విషయంలో ఇండిపెండెంట్ లైన్ తీసుకోవడం కూడా వైసీపీలో కలవరం రేపుతోంది.  కాపు సామాజికవర్గానికి మేలు జరగాలంటే..  హక్కుల కోసం పోరాడాలి అంటూ బొత్స  సంచలన వ్యాఖ్యలు చేశారు. ముద్రగడ సంస్మరణ సభలు వేదికగా తోట త్రిమూర్తులు,  బొత్స సత్యనారాయణ లు   జ్యోతుల నెహ్రూతో వేదిక పంచుకోవడం, తోట త్రిమూర్తులు బోండా ఉమా ఆధ్వర్యంలో కాపు ఐక్యత సభకు హాజరౌతానని ప్రకటించడంతో.. రానున్న రోజులలో కాపు సామాజికవర్గ ఐక్యత రాష్ట్రంలో కొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేపే అవకాశాలున్నాయన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది. ఉన్నట్లుగా కనిపిస్తోంది.

Tense in ycp, botsa, totatrimurthulu, Kapu, Leaders, Cross, Partyline Telugu One

By
en-us Political News

  
అవినాష్ రెడ్డి ఇల్లు, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఇళ్లపై జరిగిన దాడుల్లో కేవలం 24 లక్షల క్యాష్, కొన్ని డాక్యుమెంట్లు మాత్రమే దొరికాయా? లేక ఈ దాడుల వెనుక ఉమ్మడి తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేసే పెద్ద విషయం ఏమైనా జరగబోతోందా? అన్న చర్చ విస్తృతంగా సాగుతోంది.
టీపీసీసీ క్రమశిక్షణా కమిటీకి మంత్రి కొండా సురేఖ లేఖ..!
దాదాపు ఏడేళ్ల తరువాత ఈడీ సోదాలు నిర్వహించిందంటే ఏం జరుగుతోంది?  ఆర్థిక లావాదేవీలు, మనీ ల్యాండరింగ్ కోణంలో ఈడీ ఎలాంటి కీలక ఆధారాలు సేకరించబోతోంది? అన్న విషయంపై ప్రముఖ సామాజిక, రాజకీయ విశ్లేషకుడు, ఏపీ కమ్మకార్పొరేషన్ చైర్మన్ అడుసుమిల్లి శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. 
వివాహ వేదిక దాదాపుగా వైసీపీ మినీ ప్లీనరీ జరుగుతోందా అనిపించేలా ఉంది.  ఈ వివాహ కార్యక్రమం దాదాపుగా పార్టీ అంతర్గత సమావేశాన్ని తలపింప చేసేదిగా మారిపోయింది.  ఇటీవల కాలంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ఈ స్థాయిలో ఒకే వేదికపైకి రావడం ఇదే మొదటి సారి.
ఇప్పటికే టీడీపీ తరఫున సీనియర్ నాయకుడు అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవి దక్కిన సంగతి తెలిసిందే. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలతో పాటు  రాజకీయ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని ఆయనకు ఆ అవకాశం కల్పించారు.
ఈ ఫ్లెక్సీల్లో  జగన్ తో పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ల ఫోటోలు కూడా ఉన్నాయి బేగంపేట, పంజాగుట్ట, రాజ్‌భవన్ రోడ్డు, ఖైరతాబాద్ తదితర కీలక కూడళ్లలో ఇవి దర్శనమిస్తున్నాయి.
యితే లోకేష్ తనను తాను మేకోవర్ చేసుకోవడానికి ఆ ట్రోలింగ్ ను ఉపయోగించుకున్నారు. ఇప్పుడు వైసీపీయులకు లోకేష్ విషయంలో పన్నెత్తి మాట్లాడే అవకాశం కూడా దొరకడం లేదు. అందుకు భిన్నంగా వైసీపీ అధినేత జగన్ తన ప్రెస్ మీట్లలో అడ్డంగా దొరికిపోతూ విపరీతంగా ట్రోల్ అవుతున్నారు.
తమిళనాడు సీఎం విజయ్ కి   సన్నిహితుడు,  ఆయన వ్యక్తిగత జ్యోతిష్యుడు అయిన  రికీ రాధన్ పండిట్ వెట్రివేట్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్ వచ్చిన ఆయన  కవితతో భేటీ అయ్యారు.
ఈ క్రమంలోనే జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తూ సీట్ల సర్దుబాటుపై  కీలక  వ్యాఖ్యలు చేశారు. పొత్తు ధర్మాన్ని కాపాడుకుంటూనే, జనసేన పార్టీకి తగిన ప్రాధాన్యం దక్కేలా  సీట్ల పంపకాల వ్యూహాన్ని అమలు చేయాలని పవన్  నిర్ణయించారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.