రెండేళ్ల పాలనపై చంద్రబాబు సర్కార్ ప్రోగ్రస్ రిపోర్టులు.!

Publish Date:Jul 20, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లు అయిన సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నరు.   ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో ఆర్థిక వ్యవస్థ, పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని, విద్యుత్ రంగం, శాంతిభద్రతలు, మైనింగ్ మరియు ఎక్సైజ్ విధానాలపై విడుదల చేసిన 7 కీలక శ్వేతపత్రాలకు   కొనసాగింపుగా, ఇప్పుడు సమగ్ర ప్రగతి నివేదికలను విడుదల చేయాలని నిర్ణయించారు.    వైసీపీ ప్రభుత్వ హయాంలో తీవ్రంగా దెబ్బతిన్న వ్యవస్థలను గాడిన పెట్టడమే కాకుండా, సంస్కరణలు, పారదర్శక పాలన,  సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ఎలా నడిపించామో ఈ నివేదికల ద్వారా ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే అన్ని శాఖలకు సంబంధించిన ప్రగతి నివేదికలను ఒకే చోట చేర్చి ప్రచురించాలని సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.  

ఈ  ప్రగతి ప్రకటనలో భాగంగా ప్రభుత్వం మొత్తం 10 ప్రధాన అంశాలపై ప్రత్యేక నివేదికలు సిద్ధం చేస్తున్నది.  గతంలోని అంటే రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రబుత్వం కొలువుదీరిన తొలి నాళ్లలో విడుదల చేసిన 7 శ్వేతపత్రాల యాక్షన్ టేకెన్ నివేదికలతో పాటు,  అభివృద్ధి  , సుపరిపాలన,  సంక్షేమం, సాధికారత   విభాగాలపై సమగ్ర నివేదికలు విడుదల చేయనుంది.  అభివృద్ధి నివేదికలో వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక వసతులు,  పర్యాటక రంగాల పురోగతిని పొందుపరచగా, సుపరిపాలన నివేదిక ద్వారా నూతన విధానాలు, డిజిటల్ విప్లవం,  వాట్సాప్ గవర్నెన్స్ వంటి  సేవల వివరాలను అందించనుంది.   ఆర్థిక, అభివృద్ధి, సంక్షేమ, పాలనా నివేదికలను స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేస్తారు. మిగిలిన నివేదికలను సంబంధిత శాఖల మంత్రులు ప్రజా సమక్షంలో ఆవిష్కరిస్తారు. 

 రెండేళ్ల పాలనలో కూటమి ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రికార్డు స్థాయి నిధులను పంపిణీ చేసింది. ముఖ్యంగా పేదలు, వృద్ధులు,  వికలాంగులకు ఆర్థిక భద్రత కల్పిస్తూ  ఏడాదికి సగటున రూ. 33,000 కోట్లకు పైగా కేవలం పెన్షన్ల కోసమే వెచ్చించడం దేశ సంక్షేమ చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయం. అదే విధంగా, పేదవారి ఆకలి తీర్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా 269 అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తెచ్చి, ఇప్పటివరకు రూ. 230 కోట్ల నిధులను కేటాయించింది. దీనివల్ల ప్రతి నెలా వేలాది మంది నిరుపేదలు, ఆటో డ్రైవర్లు,  కూలీలు భోజన ఖర్చులలో రూ. 2,500 నుండి రూ. 3,000 వరకు పొదుపు చేయగలుగుతున్నారు.

మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ చేపట్టిన  స్త్రీశక్తి  ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ పథకం రాష్ట్రంలో ఊహించని విజయాన్ని సాధించింది. ఈ ఉచిత ప్రయాణ సదుపాయం కోసం ప్రభుత్వం  రూ. 2,565 కోట్ల సబ్సిడీ భార భారాన్ని  భరించి మహిళల ఉపాధి, విద్య,  ప్రయాణ స్వేచ్ఛకు ఊతమిచ్చింది.   అమరావతి ప్రాజెక్టు పనులతో పాటు పోలవరం నిర్మాణం, రహదారుల అభివృద్ధి మరియు డ్రోన్ నిఘా ద్వారా  నిర్మూలన వంటి చర్యలతో రాష్ట్రంలో శాంతిభద్రతలు, ఆర్థిక స్థిరత్వం  నెలకొన్నాయి. ఈ నివేదికలు,  డేటా పాయింట్లు ప్రతి పౌరుడికి ప్రభుత్వ పనితీరుపై పూర్తి అవగాహనను, భరోసాని కలిగిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. 

AP Govt White Papers, Chandrababu Naidu 2 Years Governance, AP Coalition Govt Progress Report, NTR Bharosa Pension Scheme

By
en-us Political News

  
నూకరాజు కుటుంబం ఆత్మహత్య వెనుక లవ్ జిహాదీ, మత మార్పిడికి ఒత్తిడి చేసిన సాధిక్ ఖాన్ అనే వ్యక్తికి కూడా వైసీపీతో అనుబంధం సంబంధం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్  అవుతున్నాయి. 
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయంలో అధికార పార్టీ నేతల మధ్య చోటుచేసుకుంటున్న పరిణామాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
సాధారణంగా స్థానిక ఎన్నికలలో అధికార పక్షం హవా నడుస్తుంది. అయితే విపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత పులివెందుల విషయంలో మాత్రం మిగిలిన ప్రాంతాలలోలా  అధికార పార్టీ హవా అని టేకిట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోవడానికి లేదు. అందుకే అధికార తెలుగుదేశం కూటమి వ్యూహాత్మకంగా పులివెందులలో పాగా వేయడానికి ప్రణాళికలు రచిస్తోంది. 
తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అసలైన బలమని, కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు, గౌరవం కల్పించడమే తమ లక్ష్యమని
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ప్రస్తుతం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల (ముఖ్యంగా పట్టణ, నగర పాలక సంస్థల) చుట్టూ తిరుగుతోంది.
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయ ఉత్కంఠ నెలకొంది.
అవినాష్ రెడ్డి ఇల్లు, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఇళ్లపై జరిగిన దాడుల్లో కేవలం 24 లక్షల క్యాష్, కొన్ని డాక్యుమెంట్లు మాత్రమే దొరికాయా? లేక ఈ దాడుల వెనుక ఉమ్మడి తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేసే పెద్ద విషయం ఏమైనా జరగబోతోందా? అన్న చర్చ విస్తృతంగా సాగుతోంది.
టీపీసీసీ క్రమశిక్షణా కమిటీకి మంత్రి కొండా సురేఖ లేఖ..!
దాదాపు ఏడేళ్ల తరువాత ఈడీ సోదాలు నిర్వహించిందంటే ఏం జరుగుతోంది?  ఆర్థిక లావాదేవీలు, మనీ ల్యాండరింగ్ కోణంలో ఈడీ ఎలాంటి కీలక ఆధారాలు సేకరించబోతోంది? అన్న విషయంపై ప్రముఖ సామాజిక, రాజకీయ విశ్లేషకుడు, ఏపీ కమ్మకార్పొరేషన్ చైర్మన్ అడుసుమిల్లి శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. 
వివాహ వేదిక దాదాపుగా వైసీపీ మినీ ప్లీనరీ జరుగుతోందా అనిపించేలా ఉంది.  ఈ వివాహ కార్యక్రమం దాదాపుగా పార్టీ అంతర్గత సమావేశాన్ని తలపింప చేసేదిగా మారిపోయింది.  ఇటీవల కాలంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ఈ స్థాయిలో ఒకే వేదికపైకి రావడం ఇదే మొదటి సారి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.