చంద్రబాబు అరెస్ట్‌ అయినప్పుడు స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్న వ్యక్తికి టీటీడీలో కీలక పదవి.!

Publish Date:Jul 21, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనాపరంగా చక్కటి పని తీరు కనబరుస్తోంది.  వివిధ శాఖల్లో ప్రక్షాళన చర్యలు చేపడుతున్నది. అయితే  కొన్ని విషయాలలో మాత్రం పార్టీగా తప్పుటడుగులు వేస్తున్నదని పరిశీలకులు అంటున్నారు.  తిరుమల తిరుపతి దేవస్థానం  లో జరిగిన  ఒక నియామకం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోనూ, దేవస్థాన వర్గాల్లోనూ తీవ్ర సంచలనంగా మారింది.  జగన్ హయాంలో  అప్పటి ప్రతిపక్ష నేత అంటే ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్కిల్ కేసులో అక్రమంగా అరెస్టైన సంగతి తెలిసిందే. ఈయన అరెస్ట్   హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ స్వీట్లు పంచి మరీ సంబరాలు చేసిన ఒక వ్యక్తిని ఇప్పుడు తెలుగుదేశం కూటమి సర్కార్ టీటీడీలో కీలక పోస్ట్ లో నియమించడం కలకలం రేపుతోంది.   2023లో స్కిల్ డెవలప్‌మెంట్ కేసు నెపంతో అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడిని సిఐడి అధికారులు  అరెస్ట్ చేసిన సంగతి విదితమే. ఆ సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) హోదాలో విధులు నిర్వర్తిస్తున్న ఒక అధికారి.. అత్యుత్సాహం ప్రదర్శించారు. చంద్రబాబు అరెస్టును పురస్కరించుకుని స్వీట్లు పంచారు. అక్కడితో ఆగకుండా చంద్రబాబు జైలులోనే మరణిస్తే పండుగ చేస్తానంటూ అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు.   ప్రభుత్వ సర్వీసులో బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ, ఒక రాజకీయ పార్టీకి కొమ్ముకాయడమే కాకుండా, సీనియర్ నాయకుడి అరెస్ట్‌పై హర్షం వ్యక్తం చేయడం అప్పట్లో  వివాదంగా మారింది.   ఒక రాజకీయ నాయకుడి పట్ల ఇటువంటి ద్వేషపూరిత భావజాలాన్ని ప్రదర్శించడం సరికాదని తోటి సిబ్బంది ఆయనను వారించినప్పటికీ పట్టించుకోలేదని సమాచారం. ఆయన అప్పట్లో వైసిపికి కరడుగట్టిన మద్దతుదారుడిగా వ్యవహరిస్తూ ఇష్టారీతిగా వ్యవహరించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. 

 2024 ఎన్నికల్లో రాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రజా తీర్పుతో వైసీపీ ప్రభుత్వం గద్దెదిగి, అఖండ మెజారిటీతో తెలుగుదేశం కూడటమి అధికారం చేపట్టింది.  కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తరువాత..   గత ప్రభుత్వ హయాంలో రాజకీయ పక్షపాతంతో, కక్షపూరితంగా ప్రవర్తించిన అధికారులను గుర్తించి వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారని అందరూ భావించారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడి అరెస్ట్ వేళ అత్యంత వివాదాస్పదంగా వ్యవహరించిన  ఈ టీటీడీ ఏఈఈపై కఠిన చర్యలు ఉంటాయని, ఆయనను విధులకు దూరంగా ఉంచుతారని టీటీడీ ఉద్యోగ వర్గాలు, టిడిపి శ్రేణులు భావించాయి. అయితే అందుకు పూర్తి భిన్నంగా జరిగింది. 

సదరు వివాదాస్పద ఏఈఈ స్థాయి అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, ఇటీవల నిర్వహించిన అంతర్గత సర్దుబాట్లు,  పోస్టింగ్‌లలో ఆయనకు కీలక స్థానం దక్కింది.   ప్రస్తుతం ఆయన టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో ఏఈఈ హోదాలోనే అత్యంత కీలకమైన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.  గతంలో చంద్రబాబుపై అత్యంత దారుణంగా విషం చిమ్మిన వ్యక్తికే  తెలుగుదేశంకూటమి ప్రభుత్వంలో కీలక పదవి  దక్కడం వెనుక అసలు రహస్యం ఏమిటనే దానిపై టీటీడీ పరిపాలనా భవనంలో జోరుగా చర్చలు సాగుతున్నాయి. పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పాటిస్తున్నామని చెబుతున్న వేళ ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడం విమర్శలకు తావిస్తోంది.

ఈ పరిణామం అటు తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న సాధారణ ఉద్యోగులను, ఇటు తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయి కార్యకర్తలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.   ఐదేళ్ల  వైసిపి పాలనలో తీవ్ర వేధింపులను తట్టుకుని పార్టీ కోసం నిలబడిన కార్యకర్తలకు తమ అధినేతను  దూషించిన వ్యక్తికి కీలక పోస్టింగ్ దక్కడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.  ప్రభుత్వం మారినప్పటికీ కొందరు ఉన్నతాధికారుల నిర్లక్ష్యం లేదా అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగానే ఇలాంటి వివాదాస్పద వ్యక్తులకు రక్షణ లభిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ప్రభుత్వ పెద్దల దృష్టికి రాకుండానే సదరు అధికారి తన పలుకుబడి ఉపయోగించుకుని ఈ పోస్టింగ్ పొంది ఉంటారని ప్రచారం జరుగుతోంది.

భవిష్యత్తు పరిణామాల విషయానికి వస్తే..  తిరుమల వంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో పనిచేసే సిబ్బందికి రాజకీయ తటస్థత, క్రమశిక్షణ అత్యంత అవసరం. భక్తుల విశ్వాసాలతో ముడిపడి ఉన్న ఆధ్యాత్మిక సంస్థలో రాజకీయ ద్వేషాలను ప్రదర్శించిన వ్యక్తులను ప్రోత్సహిస్తే సమాజంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని పరిశీలకులు అంటున్నారు. . ఈ వివాదాస్పద నియామకంపై ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ, రాజకీయ వర్గాల్లోనూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతుండటంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం,  టీటీడీ ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది.

CBN Arrest Controversy, TTD AEE Official Posting, NDA Government, Tirumala Tirupati Devasthanams News,  TTD Employee SweetsDistribution

By
en-us Political News

  
అవినాష్ రెడ్డి ఇల్లు, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఇళ్లపై జరిగిన దాడుల్లో కేవలం 24 లక్షల క్యాష్, కొన్ని డాక్యుమెంట్లు మాత్రమే దొరికాయా? లేక ఈ దాడుల వెనుక ఉమ్మడి తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేసే పెద్ద విషయం ఏమైనా జరగబోతోందా? అన్న చర్చ విస్తృతంగా సాగుతోంది.
టీపీసీసీ క్రమశిక్షణా కమిటీకి మంత్రి కొండా సురేఖ లేఖ..!
దాదాపు ఏడేళ్ల తరువాత ఈడీ సోదాలు నిర్వహించిందంటే ఏం జరుగుతోంది?  ఆర్థిక లావాదేవీలు, మనీ ల్యాండరింగ్ కోణంలో ఈడీ ఎలాంటి కీలక ఆధారాలు సేకరించబోతోంది? అన్న విషయంపై ప్రముఖ సామాజిక, రాజకీయ విశ్లేషకుడు, ఏపీ కమ్మకార్పొరేషన్ చైర్మన్ అడుసుమిల్లి శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. 
వివాహ వేదిక దాదాపుగా వైసీపీ మినీ ప్లీనరీ జరుగుతోందా అనిపించేలా ఉంది.  ఈ వివాహ కార్యక్రమం దాదాపుగా పార్టీ అంతర్గత సమావేశాన్ని తలపింప చేసేదిగా మారిపోయింది.  ఇటీవల కాలంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ఈ స్థాయిలో ఒకే వేదికపైకి రావడం ఇదే మొదటి సారి.
ఇప్పటికే టీడీపీ తరఫున సీనియర్ నాయకుడు అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవి దక్కిన సంగతి తెలిసిందే. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలతో పాటు  రాజకీయ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని ఆయనకు ఆ అవకాశం కల్పించారు.
ఈ ఫ్లెక్సీల్లో  జగన్ తో పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ల ఫోటోలు కూడా ఉన్నాయి బేగంపేట, పంజాగుట్ట, రాజ్‌భవన్ రోడ్డు, ఖైరతాబాద్ తదితర కీలక కూడళ్లలో ఇవి దర్శనమిస్తున్నాయి.
యితే లోకేష్ తనను తాను మేకోవర్ చేసుకోవడానికి ఆ ట్రోలింగ్ ను ఉపయోగించుకున్నారు. ఇప్పుడు వైసీపీయులకు లోకేష్ విషయంలో పన్నెత్తి మాట్లాడే అవకాశం కూడా దొరకడం లేదు. అందుకు భిన్నంగా వైసీపీ అధినేత జగన్ తన ప్రెస్ మీట్లలో అడ్డంగా దొరికిపోతూ విపరీతంగా ట్రోల్ అవుతున్నారు.
తమిళనాడు సీఎం విజయ్ కి   సన్నిహితుడు,  ఆయన వ్యక్తిగత జ్యోతిష్యుడు అయిన  రికీ రాధన్ పండిట్ వెట్రివేట్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్ వచ్చిన ఆయన  కవితతో భేటీ అయ్యారు.
ఈ క్రమంలోనే జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తూ సీట్ల సర్దుబాటుపై  కీలక  వ్యాఖ్యలు చేశారు. పొత్తు ధర్మాన్ని కాపాడుకుంటూనే, జనసేన పార్టీకి తగిన ప్రాధాన్యం దక్కేలా  సీట్ల పంపకాల వ్యూహాన్ని అమలు చేయాలని పవన్  నిర్ణయించారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.