టిఆర్ఎస్ నేతల్లో టెన్షన్

Publish Date:Mar 17, 2012

Advertisement

తెలంగాణా ప్రాంతంలో ఉప ఎన్నికలకు కారణమైన టిఆర్ ఎస్ నేతలకు, ఆ పార్టీ తరపున రంగంలో వున్న అభ్యర్ధులకు టెన్షన్ మొదలైంది. ఉప ఎన్నికల ప్రచారం ముగిసిన తరువాత ఓటర్ల నాడిని గమనించేందుకు వారు మంతనాలు జరుపుతున్నారు. ఈ ఎన్నికల్లో ఏదో విధంగా గట్టేక్కితే బాగానే ఉంటుంది. ఒకవేళ రెండు లేదా మూడు స్థానాలు కోల్పోయినా అది తెలంగాణా ఉద్యమానికి పెద్ద దెబ్బ అవుతుందని వారు భయపడుతున్నారు. సకల జనుల సమ్మె తరువాత తెలంగాణా సెంటిమెంట్ ఈ ప్రాంతంలో మరింత పెరిగిందని మొదట తెరాస నాయకులు భావించారు. తెలంగాణా ప్రజలు ఇతర పార్టీల నాయకులకు ఎన్నికల ప్రచారంలో అడ్డుకుంటారని కూడా వారు ఆశించారు. అయితే పరిస్థితులు ఇందుకు భిన్నంగా కనిపించాయి.

తెలంగాణా సెంటిమెంట్ బాగా తగ్గిందని తెరాస నాయకులే అంగీకరిస్తున్నారు. కాంగ్రెస్, టిడిపి నేతల ప్రచారాన్ని అడ్డుకోవాలని తెరాస నాయకులు పదే పదే రెచ్చగొట్టినప్పటికి స్థానిక ప్రజలెవరూ అటువంటి ప్రయత్నాలు ఎక్కడా చేయలేకపోవడం వారికి మరింతకలవరాన్ని కలిగించింది. కొన్ని చోట్ల టిఆర్ఎస్ కార్యకర్తలకే ప్రజల నుంచి ప్రతిఘటన ఎదురైంది. ఉద్యమం పేరుతో టిఆర్ఎస్ నాయకులు డబ్బులు దండుకుంటున్నారని, అటువంటి వారికి తాము ఈసారి ఓట్లు వేసేది లేదని ప్రజలు నిర్భయంగా చెప్పారు. టిఆర్ఎస్ తరపున ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ గ్రామాలకు వస్తున్నా విద్యార్థులను కూడా స్థానికులు ప్రతిఘటించారు. ఈ ఎన్నికల్లో తమ ఉనికిని చాటి కనీసం నాలుగైదు స్థానాల్లో టిఆర్ఎస్ ను ఓడించడానికి కాంగ్రెస్, టిడిపిలు సర్వశక్తులూ ఒడ్డాయి. ప్రచారం ముగిసిన తరువాత ఆఖరి ప్రయత్నంలో భాగంగా డబ్బు, మద్యంతో ఓటర్లను ఆకట్టుకోవడానికి ఈ రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. మారుతున్న పరిస్థితులుల్లో కొన్ని నియోజకవర్గాల్లో టిఆర్ఎస్ కు ఎదురుదెబ్బ తగలవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

 

 

By
en-us Political News

  
స్థానిక సమస్యలను క్షేత్రస్థాయిలో  తెలుసుకునేందుకు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే  కోమటిరెడ్డి  రాజగోపాల్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. కారు వదిలేసి ద్విచ్రవాహనంపై మునుగోడు వీధుల్లో  ఆయన పర్యటించారు.
ఆర్థిక నేర ఆరోపణలు, అవినీతి అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తులు విచారణను ఎదుర్కొనేందుకు అందుబాటులో లేకుండా విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని పేర్కొంటూ..  వారి పాస్‌పోర్ట్‌లను నిలిపివేయాలని ఏసీబీ పిటిషన్ దాఖలు చేసింది.
తెలంగాణలో వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించిన లోకల్ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక స్పష్టత ఇచ్చింది.
తెలంగాణ సచివాలయంలో సోమవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
గ్రేటర్   పరిధిలో బీఆర్ఎస్ కు చెందిన  పలువురు  ఎమ్మెల్యేలు, జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు కాంగ్రెస్ లోకి జంప్ చేశారు.  దానం నాగేందర్, వివేకానంద వంటి నేతల ఫిరాయింపులు పార్టీ కేడర్‌లో నిరుత్సాహాన్ని నింపాయి.
పదేళ్లుగా పక్కింటివారిలా పరిచయం.. మెల్లిగా చీటీలతో నమ్మకం సంపాదించారు.. ఆ నమ్మకంతోనే ఒక్కొక్కరి నుంచి భారీగా డబ్బులు తీసుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన ఉల్లాస్ పరీక్షకు హాజరవుతున్న లక్షలాది మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు మంత్రి సీతక్క అభినందనలు తెలిపారు.
పోయింది అధికారం మాత్రమే.. కేసీఆర్‌పై అభిమానం తగ్గలేదు.!
గడ్డిపోచలు కూడా గడ్డపారలుగా మారుతాయి..!
గణేష్‌ నిమజ్జనం సందర్భంగా పోలీసుల బందోబస్తు కొనసాగుతుండగా.. అల్మాస్‌గూడలో అర్ధరాత్రి కొందరు వ్యక్తులు హల్‌చల్‌ చేశారు.
వికారాబాద్ జిల్లా పరిగి మండలం బసిరెడ్డిపల్లి సమీపంలో పెద్దపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది.
 శ్రీనాథ్  అవయవ దానంతో చావు అంచున ఉన్న ఆరుగురికి  పునర్జన్మ లభించింది. శ్రీనాథ్ కుటుంబ సభ్యులకు జీవన్‌దాన్ అధికారులు   కృతజ్ఞతలు తెలియజేశారు. తన అవయవదానంతో  సిద్దని ప్రేమ వెంకట సత్య సాయి శ్రీనాథ్ మరణించిన తరువాత కూడా చిరంజీవిగా వర్ధిల్లుతున్నాడు.
తాడ్వాయి గురుకుల పాఠశాల విద్యార్థినులు పక్షుల కూతను బట్టి జాతిని గుర్తించే సరికొత్త ఎకో సెన్స్ బర్డ్ సౌండ్ డిటెక్షన్ ప్రాజెక్టును ఆవిష్కరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.