కెసిఆర్ ఫై ఎర్రబెల్లి ధ్వజం
Publish Date:Dec 18, 2011
Advertisement
హైదరాబాద్: టిఆర్ఎస్ నేతలు తెలంగాణ పేరు చెప్పి మంత్రి పదవులు అనుభవించారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర రావు ధ్వజమెత్తారు.తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాత్రి ఒక మాట ఉదయం మరో మాట మాట్లాడతారని అయన విమర్శించారు. సెంటిమెంటు పేరుతో ఆర్థికంగా లాభపడింది టిఆర్ఎస్ నేతలు కాదా అని ప్రశ్నించారు. టిడిపి అధికారంలోకి వస్తే తెలంగాణపై తీర్మానం చేయిస్తామన్నారు. ప్రస్తుతం మేం తెలంగాణ తెచ్చే పరిస్థితుల్లో ఇచ్చే పరిస్థితుల్లో లేమన్నారు. కానీ తెస్తామన్న టిఆర్ఎస్,ఇస్తామన్న కాంగ్రెసు మాత్రం కుమ్మక్కయ్యాయన్నారు.తెలంగాణ పేరుతో తెలుగుదేశం పార్టీ ఎలాంటి ఆర్థిక లబ్ధి పొందలేదన్నారు. టిఆర్ఎస్ తీరును తెలంగాణ ప్రజలు హర్షించరన్నారు. పోలవరం టెండర్లలో కెసిఆర్ పాత్ర ఉందని దానిని నిరూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కెసిఆర్ తెలంగాణ ప్రజలను సెంటిమెంటు పేరుతో మోసం చేస్తున్నారన్నారు. వ్యాపారస్తులు, సీని పరిశ్రమలోని వారిని బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. టిఆర్ఎస్ జెండాలు, పార్టీ పక్కన పెట్టి వస్తే మేము కూడా రావడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. తెలంగాణ అభివృద్ధి టిడిపి హయాంలోనే జరిగిందన్నారు. టిఆర్ఎస్, కోదండరామ్ రెడ్డి ప్రజల్ని రెచ్చగొట్టవద్దన్నారు.
తెలంగాణ కోసం కెసిఆర్ ఒక్కడే పోరాడటం లేదని మందకృష్ణ మాదిగ, కొండా లక్ష్మణ్ బాపూజీ, చుక్కా రామయ్య, విమలక్క తదితరులు నిస్వార్థంగా పోరాటం చేస్తున్నారన్నారు. తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ వారికి మద్దతు తెలుపకుండా స్వార్థంతో రాజకీయాలు చేస్తున్న కెసిఆర్ ఏజెంటుగా మారారన్నారు. కోదండరామ్ రెడ్డికి దమ్ముంటే రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం అందరికంటే మొదటిసారి రాజీనామా చేసిన టిడిపికి కూడా కోదండరామ్ ఎప్పుడూ మద్దతు పలకలేదన్నారు. టిడిపికి ఎప్పుడూ మద్దతు పలకని కోదండరామ్ రెడ్డికి తమను విమర్శించే హక్కు లేదన్నారు.
http://www.teluguone.com/news/content/trs-24-10016.html





