నేను ఎక్కడికీ పారిపోలేదు.. నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటా : ఉదయ్ కృష్ణారెడ్డి
Publish Date:Jul 28, 2026
Advertisement
నేడు పోలీసుల ఎదుట విచారణకు హాజరుకానున్న ట్రైనీ ఐపీఎస్..! ట్రైనీ ఐపీఎస్ అధికారిణి చేసిన ఫిర్యాదుతో నమో దైన కేసులో దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. కేసు తీవ్రతను దృష్టిలో పెట్టు కున్న నగర పోలీస్ కమిషనర్, ఈ వ్యవహారాన్ని ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)కు బదిలీ చేశారు. డీసీపీ లావణ్య నేతృత్వంలోని ప్రత్యేక బృందం అన్ని కోణాల్లో విచారణను వేగవంతం చేసింది. ఇప్పటికే బాధిత ట్రైనీ ఐపీఎస్ అధికారిణి నుంచి జాతీయ పోలీస్ అకాడమీలో సుమారు ఆరు గంటల పాటు డీసీపీ లావణ్య స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. ఈ సందర్భంగా తనపై జరిగినట్లు చెబుతున్న లైంగిక వేధింపులు, మానసిక, శారీరక చిత్రహింసలకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు, తన వద్ద ఉన్న ఆధారాలను కూడా విచారణ అధికారులకు అందజేసినట్లు తెలుస్తోంది. అధికారిణి ఇచ్చిన స్టేట్‌మెంట్, సమర్పించిన ఆధారాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.బాధిత అధికారిణి వాంగ్మూలం ఆధారంగా ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని ప్రశ్నించేందుకు అత్తాపూర్ పోలీసులు పలుమార్లు ప్రయత్నించారు. అయితే గత నాలుగు రోజులుగా ఆయన పోలీసులకు అందుబాటులోకి రాక పోవడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గాలింపు చేపట్టారు. ఆయన కోసం ప్రత్యేక బృందాలు పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఊహించని విధంగా నేడు ఉదయ్ కృష్ణారెడ్డి ఒక మీడియా ఛానల్ కార్యాలయానికి వచ్చి మీడియాతో మాట్లాడారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని పేర్కొన్నారు. భారత న్యాయ వ్యవస్థపై, చట్టంపై తనకు పూర్తి నమ్మకం ఉందని నేను ఎక్కడికీ పారిపోలేదు..మా నానమ్మ అనారోగ్యంతో ఉన్నందుకు స్వగ్రామం ఊళ్లపాలెం వచ్చాని తెలిపారు. నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటా..నా శాశ్వత చిరునామా ఊళ్లపాలెంకు ఎటువంటి నోటీసులు రాలేదని ఆయన వెల్లడించారు. సాయంత్రంలోగా పోలీసుల ఎదుట హాజరై తన స్టేట్‌మెంట్ ఇస్తానని స్పష్టం చేశారు. విచారణ కు పూర్తిగా సహకరిస్తానని కూడా తెలిపారు. ఉదయ్ కృష్ణారెడ్డి పోలీసుల ఎదుట హాజరైన తర్వాత డీసీపీ లావణ్య నేతృ త్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం ఆయనను సుదీర్ఘంగా ప్రశ్నించే అవకాశం ఉంది. బాధిత అధికారిణి ఇచ్చిన వాంగ్మూలం, అందించిన ఆధారాలు, ఇతర సాంకేతిక సమాచారాన్ని ఆధారంగా చేసుకుని పలు కీలక ప్రశ్నలు సంధించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే బాధిత అధికా రిణి వాంగ్మూలం నమోదు కావడం, కేసును ప్రత్యేక దర్యాప్తు బృందానికి బదిలీ చేయడం, ఇప్పుడు ఉదయ్ కృష్ణారెడ్డి విచార ణకు హాజరవుతానని ప్రకటించడం వంటి పరిణామాలతో కేసు మరింత ఆసక్తికరంగా మారింది. నేటి విచారణ అనంతరం ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. Trainee IPS Uday Krishna Reddy, SIT, harassment case, Attapur Police, oollapalem villeage, DCP Lavanya, CM Revanth reddy, CP Sajjanar, DGP C.V. Anand
http://www.teluguone.com/news/content/trainee-ips-uday-krishna-reddy-36-227346.html





