పగిలిన బగీరథ పైప్ లైన్.. పది రోజులైనా పట్టించుకోని అధకార యంత్రాంగం.!

Publish Date:Jul 28, 2026

Advertisement

తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో  ఇంటింటికీ తాగునీటిని అందించాలన్న సత్సంకల్పంతో  ప్రారంభించిన మిషన్ భగీరథ పథకం.. క్షేత్రస్థాయిలో నిర్వహణ, పర్యవేక్షణ లోపం కారణంగా నిరుపయోగంగా మారుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాగునీటి అవసరాలు తీర్చడం అటుంచి, నీటి వృధా అవుతోందని అంటున్నారు.  వికారాబాద్ జిల్లా పరిధిలోని దోమ మండల పరిధిలోని శివారెడ్డి పల్లి గేట్ సమీపంలో మిషన్ భగీరథ ప్రధాన పైప్‌లైన్ పగిలి గత పది రోజులుగా తాగునీరు వృదాగా రోడ్ల పాలౌతున్నా అధికారులకు చీమకుట్టినట్లైనా లేదని జనం ఫైర్ అవుతున్నారు. పైప్ లైన్ పగిలి నీరు వృధా అవుతున్నా సంబంధిత అధికారులు ఇంత వరకూ ఆ వైపు కన్నెత్తి చూడకపోడం మిషన్ బగీరథ పట్ల వారికి ఉన్న అక్కరకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోందని నెటిజన్లే సెటైర్లు గుప్పిస్తున్నారు.  

ఒకవైపు మంచినీటి కొరతతో జనం అల్లల్లాడుతుంటే.. మరోవైపు పది రోజులుగా నీరు వృధాగా పారుతున్నా అధికారులు పట్టించుకోకపోవడాన్ని ప్రజలు విమర్శిస్తున్నారు.  శివారెడ్డి పల్లి గేట్ ప్రాంతంలో పైప్‌లైన్ లీకేజీ కారణంగా గ్రామంలోని పలు కాలనీ వాసులకు మంచినీటి సరఫరా నిలిచిపోయింది. తాగునీటి కోసం మహిళలు, గ్రామస్థులు కిలోమీటర్ల కొద్దీ దూరంలో ఉన్న వ్యవసాయ బావులు, బోర్‌వెళ్ల వద్దకు కాలినడకన వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సి దుస్థితి ఏర్పడింది.  

  10 రోజులుగా పగిలిన బగీరథ పైప్ లైన్ గురించి వృధాగా పోతున్న నీటి గురించి  సంబంధిత అధికారులకు, స్థానిక పంచాయతీ సిబ్బందికి పలుమార్లు ఫిర్యాదు చేసినా వారు ఇసుమంతైనా స్పందించలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

మిషన్ భగీరథ ప్రాజెక్టు పనుల్లో నాణ్యతా ప్రమాణాలలోపం కారణంగానే పైప్ లైన్ లు తరచూ పగిలి లీకేజులు జరుగుతున్నాయన్న విమర్శలు కూడా వినవస్తున్నాయి.  ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం, మిషన్ భగీరథ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని  శివారెడ్డి పల్లి గేట్ వద్ద పగిలిన పైప్‌లైన్‌కు   యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి, నీటి వృధాను అరికట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.  నిలిచిపోయిన తాగునీటి సరఫరాను త్వరితగతిన పునరుద్ధరించి, ప్రజల దాహార్తిని తీర్చాలని కోరుతున్నారు.  

Mission Bhagiratha pipe burst, Doma mandal water crisis, Shivareddypalli water leakage,  Mission Bhagiratha pipeline damage

By
en-us Political News

  
తాజాగా బాధితురాలి మెడపై గొంతు నులిమినట్లు గాయాల ఆనవాళ్లు..!
డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ (తెలంగాణ వైద్య విధాన పరిషత్) పరిధిలోని ప్రభుత్వ హాస్పిటళ్లలో స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల ఫలితాలు విడుదల అయ్యాయి.
రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో వేగం మరింత పెరగాలని....అనుకున్న సమయానికి ప్రతి ప్రాజెక్టు పూర్తి కావాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
సోమేశ్ కుమార్‌పై 400 కంటెంప్ట్ కేసులప్పుడు బీఆర్‌ఎస్ మౌనం ఎందుకు..!
స్పందించని నాడీ వ్యవస్థ.. ఆరోగ్యం విషమం..!
హైదరాబాద్‌లోని గచ్చి బౌలి ఔటర్ రింగ్ రోడ్ (ORR)పై మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సజ్జనార్ విజ్ఞప్తి..!
ఖనిజాల నిధిగా పిలిచే మన నేల పొట్టలో అపారమైన ప్రాకృతిక సంపద దాగి ఉంది.
హైడ్రా కమిషనర్ నియామకానికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు.
దేశంలో కరెన్సీ వ్యవస్థను మరింత ఆధునికీకరించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భార్య ప్రాణాలు పోతుంటే వీడియో కాల్‌లో చూపించిన కసాయి భర్త..!
తెలంగాణకు 11.56 లక్షల ఇళ్లు కేటాయించాలని వినతి..!
జింబాబ్వేపై 3-0తో సాధించిన క్లీన్ స్వీప్ భారత క్రికెట్ అభిమానుల్లో కొత్త జోష్ నింపింది. అశోక్ శర్మ, యశ్ ఠాకూర్ లాంటి డెబ్యూటెంట్లలో కాన్ఫిడెన్స్ నింపి, వారి నుంచి అద్భుత ప్రదర్శన రాబట్టిన వెరీ వెరీ స్పెషల్ వీవీవీఎస్ లక్ష్మణ్ ప్రశాంతత, విజన్ క్రికెట్ అభిమానుల మనస్సులను హత్తుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.