హైడ్రాపై వెనక్కి తగ్గేది లేదు.. హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తాం : సీఎం రేవంత్
Publish Date:Jul 28, 2026
Advertisement
హైడ్రా కమిషనర్ నియామకానికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. హైకోర్టు తీర్పును ఇంకా పూర్తిగా పరిశీలించలేదని, ప్రభుత్వం తరఫున న్యాయ నిపుణులతో కలిసి ఆదే శాలను సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని సీఎం వెల్లడించారు. న్యాయస్థానాలపై తమ ప్రభుత్వానికి సంపూర్ణ గౌరవం, విశ్వాసం ఉందని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో కొందరు కావాలనే డబ్బులు ఖర్చు చేసి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి ఆరోపించారు. అలాంటి ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని కోరారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రతి కార్యక్రమం ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అమలు చేస్తున్నామని, హైడ్రా విషయంలో కూడా ప్రభుత్వానికి స్పష్టమైన కార్యాచరణ ఉందని తెలిపారు. హైడ్రా తమ ప్రభుత్వం తీసుకువచ్చిన అత్యంత కీలకమైన సంస్కరణల్లో ఒకటని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొ న్నారు. ఆక్రమణలను తొలగించడం, చెరువులు, కుంటలు, నాలాలు వంటి జలవ నరులను పరిరక్షించడం, నగరంలో వరదల సమస్యను తగ్గించడం వంటి లక్ష్యాలతో హైడ్రా సమర్థవంతంగా పనిచే స్తోందని అన్నారు. ఇప్పటివరకు అనేక చెరువులు, నాలాలు ఆక్రమణల నుంచి విముక్తి పొందాయని, ప్రజల నుంచి కూడా మంచి స్పందన లభించిందని చెప్పారు. హైడ్రా కమిషనర్ నియామకం విషయంలో ఎవరిని అధికారిగా నియమించాలనేది పూర్తిగా ప్రభుత్వ విచక్షణాధికారంలో భాగమని సీఎం స్పష్టం చేశారు. ఆ అధికారాన్ని ప్రభుత్వం నుంచి ఎవరూ హరించలేరని వ్యాఖ్యా నించారు. కోర్టుల తీర్పులను గౌరవిస్తూ,అవసరమైతే చట్టపరంగా తమ వాద నలు వినిపిస్తామని తెలిపారు. హైడ్రా దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న సంస్థగా గుర్తింపు పొందిందని, భవిష్యత్తులో ఈ సంస్థను మరింత బలోపేతం చేసి ప్రజా ప్రయోజనాల కోసం మరింత సమర్థవంతంగా పనిచేసేలా చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైడ్రా చేపడుతున్న కార్యక్రమాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగవని, ప్రభుత్వ సంకల్పం యథా విధిగా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. High Court verdict on Hydra, CM Revanth reddy, Hydra Commissioner Ranganath, Telangana Goverment, GHMC, BRS Party
http://www.teluguone.com/news/content/high-court-verdict-on-hydra-36-227377.html





